సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1732వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కలలో బూతులు తిట్టి జబ్బును నయం చేసిన బాబా
2. బాబాని నమ్ముకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు

కలలో బూతులు తిట్టి జబ్బును నయం చేసిన బాబా


నా పేరు కిషోర్. మాది అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా వయసు 24 సంవత్సరాలు. 2022 నుంచి నేను బాబాకి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాను. ఆ సంవత్సరంలోనే నాకు కొన్ని పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి, 80% కోలుకున్నాను. కానీ ఆ ఆరోగ్య సమస్యల తాలూకు ప్రభావం నా శరీరం మీద ఇంకా పోలేదు. అటువంటి స్థితిలో 2023లో మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరికొన్ని ఇతర సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. వాటికి తోడు ఏవైనా ఆరోగ్య సమస్యలు కూడా వస్తే, నా శరీరం తట్టుకునే స్థితిలో అస్సలు లేదు. కనీసం జ్వరం వచ్చినా తట్టుకొనే ఓపిక నాకు లేదు. ఇలాంటి పరిస్థితిలో 2023, జూన్ 12న తీవ్రమైన తలనొప్పి, జ్వరం వచ్చి నా శరీరంలో శక్తి లేనంత నీరసంగా అనిపించింది. అయినా హాస్పిటల్‌కి వెళ్లే సాహసం చేయలేక అలానే ఉన్నాను. ఎందుకంటే, హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్లనే 2022 చివరిలో నాకు చాలా సీరియస్ అయ్యిందేమోనని నా భయం. అందుకే మందులు వేసుకునే ధైర్యం కూడా చేయలేదు. కానీ చాలా భయపడ్డాను.

సాయి సచ్చరిత్రలో డాక్టర్ పిళ్ళై అను భక్తుడు నారిపుండుతో బాధపడుతూ, తట్టుకోలేక ఈ బాధను 10 జన్మలలో భరిస్తానని బాబాకి విన్నవించుకుంటాడు. బాబా, "పది జన్మలెందుకు? పది రోజుల్లో గత జన్మ పాపమును హరింపజేయగలను, ఇప్పుడే ఒక కాకి వచ్చి బాధ పోగొడుతుంది" అంటారు. అప్పుడు అబ్దుల్ అనే భక్తుడు వచ్చి పొరపాటున పుండు మీద కాలు వేయడంతో ఆ పుండు పగిలి అందులో నుంచి పురుగులు బయటకు వచ్చి అతనికి ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అది గుర్తొచ్చి, 'నాకు చాలా సమస్యలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా నాకు మళ్ళీ ఆరోగ్య సమస్యలు వద్దు. ఒకేసారి సమస్యలన్నీ అంటే ఎలా తట్టుకొనేది? అలాగని నాకు సమస్యలు అస్సలు వద్దని చెప్పడం లేదు కానీ, ఆ భక్తుడు అనుకున్నట్లు అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు నా శరీరం సహకరించదు. ఇంకోసారి ఎప్పుడైనా కొద్దికొద్దిగా వస్తే తట్టుకోవచ్చు కానీ, ఇప్పుడు నా వల్ల కాదేమో!' అని అనుకున్నాను. మరుసటి రోజు జూన్ 13, మంగళవారం రాత్రి బాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. కలలో నేను పడుకొని ఉండగా నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా, నేను ఒకరినొకరు చూసుకుంటూ ఒక చెట్టు లేదా ఒక సన్నటి కట్టే చుట్టూ తిరుగుతున్నాం. అలా తిరుగుతున్నప్పుడు బాబా స్పష్టంగా మాట్లాడుతున్నారు కానీ, నాకు ఏమీ అర్థం కావడం లేదు. తర్వాత బాబా నన్ను పచ్చి బూతులు తిట్టారు. నేను వాటిని నవ్వుతూ వింటున్నాను. అప్పుడు కలలోని నాకు మెలకువ వచ్చింది. నా చుట్టూ చాలా తినే పదార్థాలున్నాయి. అంతలో నాకు నిజంగా మెలకువ వచ్చింది. మర్నాడు పొద్దున్నుంచి నాకున్న ఆరోగ్యసమస్యలన్నీ తగ్గడం మొదలై సాయంత్రంలోగా 90% తగ్గిపోయాయి. బాబా దయతో ఎన్ని రోజులు అనుభవించాల్సిన బాధో ఒకే ఒక్కరోజుతో పోయింది. ఇక్కడ కలలో బాబా తిట్టడం అంటే మనల్ని తిట్టడం కాదు. నాకొచ్చిన జబ్బును తరిమివేయడానికే అలా చేసారని నాకు అనిపిస్తుంది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.

బాబాని నమ్ముకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు 


నేనొక చిన్న సాయి భక్తుడిని. ఈ మధ్యకాలంలో నాకు జరిగిన చిన్న అనుభవం మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నా కుటుంబసభ్యులందరికీ బస్సు ప్రయాణం పడదు. ప్రయాణంలో వాంతులై నీరసించిపోతాము. అలాంటిది ఈమధ్య మా చిన్నబాబు స్కూలు ట్రిప్‌కి వెళ్తానని చాలా మొండి పట్టుపట్టాడు. అప్పుడు నేను, "బాబా! బాబు ఆ ట్రిప్పులో ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల బాబు ఎటువంటి ఇబ్బందీ పడకుండా తన స్నేహితులతో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాడు. మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత మా పెద్దబాబు స్కూల్ ఎక్స్‌కర్సన్‌కని  మైసూరు వెళ్తానని అన్నాడు. నేను కాదనలేకపోయాను. అప్పుడు కూడా నేను బాబాని, “బాబా! ట్రిప్‌లో బాబుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంజాయ్ చేసి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని వేడుకున్నాను. బాబా నాయందు దయవుంచి బాబు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చేలా చేసారు. ఈ అనుభవాల ద్వారా బాబాని నమ్ముకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని నిరూపించారు. ఆయన పిలిస్తే పలుకుతారనటంలో ఏ సందేహమూ లేదు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని రెండు కోరికలు కోరాను. త్వరగా వాటిని నెరవేరుస్తారని నమ్ముతున్నాను బాబా. అందరినీ అనుగ్రహించండి. అందులో నేనూ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై


23 comments:

  1. Jai samardha sadguru Sainath Maharaj ki Jai!!!

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om sainadaya namaha 🙏

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent

    ReplyDelete
  5. Om Sai Ram, baba chelli intern location banglore nunchi hyderabad ki change chese la chudu neeku samastamu sadhyame, naaku ye problem lekunda wfh permission eche la chudu tandri pls

    ReplyDelete
  6. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  7. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  9. ఓం సాయిరామ్

    ReplyDelete
  10. Om sairam om sairam om sairam omsairam om sairam om sai ram om sai ram om sairam om sai ram om sai ram om sairam

    ReplyDelete
  11. sai baba maa madavaki chaduvu vilyva teleselaga cheyi baba. GK exam baaga rasanu ani i madava.

    ReplyDelete
  12. Baba please maa problems nundi gattu ekkinchandi.... financial gaa andariki appu ayipoyanu help cheyandi mere gattu ekkinchi pending bills vachela cheyandi ..... please 🥺

    ReplyDelete
  13. నా జీవితానికి ఒక దారి చూపించు సాయి గురుబ్రహ్మ పరమాత్మ సాయినాథానాలో నేతకలి కొట్టి రోగాలు సకల కొట్టు దోషాలు సకలకోటి పాపాలు తొలగించి నన్ను నా భర్తని కలుపు తండ్రి నా భర్త నన్ను అర్థం చేసుకో నా కోసం తిరిగి వచ్చేసారా చూడు తండ్రి చూడు బాబా

    ReplyDelete
  14. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  15. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  16. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  17. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  18. Om Sai Ram I want your blessings 🙏🙏🙏 for my trip to Tirupati .Be with us and bless us.please give full aayush to my family. Om Sai Ram

    ReplyDelete
  19. Omsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  20. Om Sairam
    Om Sairam
    Om Sairam
    Om Sairam
    Om Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo