రామకృష్ణ జీ కొఠారి తల్లిదండ్రులు
రామకృష్ణ జీ కొఠారి 1908లో జన్మించాడు. అతని తల్లితండ్రులు 1911లో మొట్టమొదటిసారి శిరిడీ సందర్శించారు. వాళ్ళు వెళ్లే సమయానికి బాబా మశీదులో కట్టడ వద్ద నిలబడి భక్తులకు ఊదీ పంపిణి చేస్తున్నారు. ఆ సుందర దృశ్యాన్ని చూసి వాళ్ళ మనసులు భక్తిభావంతో నిండిపోగా ప్రేమ పరవళ్లుతొక్కింది. వాళ్ళు ఇంటికి తిరిగివచ్చిన తరవాత ఒక బాబా ఫోటో(శ్యామారావు జయకర్ పెయింటింగ్) ఇంట్లో పెట్టుకొని ఆరాధించడం, భజనలు చేయడం మొదలుపెట్టారు. తొందరలోనే 'సాయి లజ్' అనే పేరుతో భజన మండలి ఏర్పడింది.
1913లో రామకృష్ణ తండ్రి నిమోనియాతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతనికి వైద్యం చేస్తున్న డాక్టర్ నాయక్ అతను కోలుకోవడంపై అనుమానంతో అతని కుటుంబసభ్యులతో, "రోగి వ్యాధికి పూర్తిగా అధీనమైపోయినందున కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి" అని చెప్పాడు. అది విన్న రామకృష్ణ తల్లి తన భర్త బతికితే తాను శిరిడీకి పాదయాత్ర చేసి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఆ రాత్రంతా భజన చేయడానికి భజన మండలి వాళ్ళింటికి వచ్చింది. పొద్దుపోతూనే వ్యాధి తీవ్రరూపం దాల్చింది. రాత్రి 10 గంటలకి డాక్టర్ని పిలిపించారు. అతను వచ్చి రోగికి ఇంజెక్షన్ చేసి, మందులిచ్చాడు కానీ, రోగి భార్యతో, "సుమారు 12 గంటల సమయంలో నీ భర్త మరణిస్తాడ"ని చెప్పాడు. బందువులు అది విని రోగికి భగవద్గీత చదివి వినిపించారు. మరోవైపు బాబా భజనలు కొనసాగుతున్నాయి. 11 గంటల ప్రాంతంలో రోగికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందై మొదలై అతను శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. అతని పరిస్థితి చూసిన అతని భార్య దిక్కుతోచక, "బాబా! నా భర్తని కాపాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అర్థరాత్రి ఒంటిగంట వరకు విషమ పరిస్థితి కొనసాగింది. అప్పుడు డాక్టర్ని మళ్ళీ పిలుపించారు. అతనొచ్చి రోగికి ఇంజెక్షన్లు చేసి, "గండం గడిచింద"ని హామీ ఇచ్చాడు. అయినా తెల్లవారుజాము 4 గంటల వరకు భజన కొనసాగింది. అప్పుడు భజన మండలి, బంధువులు రోగి భార్యతో "నీ భర్త ప్రాణాలతో బయటపడ్డాడు" అని భరోసాగా చెప్పి, "కాబట్టి నువ్వు నీ ప్రతిజ్ఞకు కట్టుబడి పాదయాత్రకు సిద్దపడటం మంచిద"ని అన్నారు. ఆ సమయం నుండి రోగి క్రమంగా కోలుకొని కొన్ని క్షణాల్లో కదలగలిగాడు. అందువలన ఆ కుటుంబం భజనమండలితో సహా కాలినడకన శిరిడీకి ప్రయాణం అయింది. కోపర్గావ్ చేరుకున్నాక కుటుంబసభ్యులు శిరిడీ వెళ్ళడానికి ఐదు ఎడ్లబండ్లను అద్దెకు తీసుకున్నారు. రామకృష్ణ తల్లి మాత్రం ఎడ్లబండిలో కూర్చోలేదు. ఆమె తన పాదాలు వాచి, బొబ్బలెక్కినా లెక్కచేయక ఆ బండ్ల వెనకాల నడక కొనసాగించింది. శిరిడీకి కొద్ది దూరంలో దారి రాళ్లు మరియు ముళ్ళమయంగా ఉంది. ఆమె అక్కడొక చెట్టు కిందకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ గొర్రెల కాపరి వస్త్రధారణలో తెల్లని గడ్డంతో ఉన్న ఒక వ్యక్తిని చూసింది. అతను ఆమె దగరకొచ్చి, "నీ ప్రతిజ్ఞను బాబా ఆమోదించారు. కాబట్టి తల్లీ, మిగిలిన దూరం ఎడ్లబండిలో వెళ్ళు" అని చెప్పాడు. ప్రేమపూర్వకంగా అతని మాటలు విన్నప్పటికీ ఆమె తన ప్రతిజ్ఞకు కట్టుబడి అతికష్టం మీద మిగిలిన దూరం నడక సాగించి శిరిడీలో మశీదు వద్దకి చేరుకుంది. ఆ సమయంలో బాబా తమ భక్తులతోపాటు మశీదులో కూర్చొని ఉన్నారు. ఆయన నానాసాహెబ్తో, "నేను ఈమెను దారిలో కలిసి బండి ఎక్కమని చెప్పాను. కానీ ఈమె నా మాటలు వినలేదు. ఈమె పాదాలు ఎలా వాచిపోయి, బొబ్బలెక్కి ఉన్నాయో చూడు! కానీ అవి సాయంత్రానికి నయమైపోతాయి" అని అన్నారు. బాబా మాటలు సత్యమయ్యాయి. సాయంత్రానికి వాపులు, బొబ్బలు అదృశ్యమయ్యాయి. వాళ్ళు కొద్దిరోజులు శిరిడీలో గడిపి బాబా ఆశీస్సులు, ఊదీ తీసుకొని తిరిగి తమ ఇంటికి వెళ్లారు.
జానకీబాయి ఇంగ్లే
జానకీబాయి ఇంగ్లే 1905వ సంవత్సరంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బాబాని ఆరాధిస్తుండేవారు. వాళ్ళు జానకీబాయికి ఏడేళ్ల వయస్సున్నప్పుడు 1912లో మొదటిసారి శిరిడీ తీసుకొని వెళ్లారు. వాళ్ళు మశీదుకి వెళ్ళేటప్పటికీ బాబా చెక్క కట్టడా వద్ద కూర్చొని ఉన్నారు. జానకీబాయి తల్లి బాబాకి ప్రణామాలర్పించడానికి ముందుకు వెళ్ళింది. కానీ చిన్నారి జానకీబాయి బాబా దగ్గరకి వెళ్ళడానికి భయపడి మశీదు ప్రవేశ ద్వారం వద్ద నిలబడింది. తన తల్లి, 'భయపడుతున్నావా?' అని తనని అడిగింది. అందుకు తను, 'అవున'ని తల ఆడించింది. అప్పుడు తన తల్లి తన చేయి పట్టుకొని లాగి బాబా పాదాలపై పడేసింది. బాబా నెమ్మదిగా తనని పైకి లేపి తన వీపుపై తట్టారు, అదే సమయంలో తమ మరో చేత్తో ఆమె కాళ్ళను తట్టారు. తర్వాత బాబా మృదువైన స్వరంతో "బిడ్డా! వెళ్ళు, రామునిలో లీనమవ్వు" అని అన్నారు. ఆ సమయంలో చిన్న వయసైనందున జానకీబాయికి ఏమీ అర్థం కాలేదుగాని వయసు పైబడ్డాక బాబా తనని ఎంతలా అనుగ్రహించారో అర్థమైంది. ఆమె 88 సంవత్సరాల వయసులో కూడా నిటారుగా నిలబడేది, ఎటువంటి సహాయం లేకుండా నడవగలిగేది. ఆ వయస్సులో కూడా ఆమె కీర్తనలు చేసేది, ఆనందంగా నృత్యం చేసి భక్తి, ప్రేమలను అంతటా వ్యాపింపజేసేది.
జానకీబాయికి పెళ్ళైన కొద్దిరోజులకి ఆమె తల్లి తీవ్రంగా అనారోగ్యం పాలైంది. ఆ స్థితిలో ఆమె తన కూతురుని గుర్తుచేసుకుంటూ, "నా కూతుర్ని నా ఇంటికి పంపండి బాబా" అని బాబాను తీవ్రంగా వేడుకుంది. బాబా జానకీబాయికి స్వప్నదర్శనమిచ్చి, "నీ తల్లిని ఉపేక్షించి వదిలిపెట్టకు; వెళ్లి ఆమెని చూడు" అని చెప్పారు. అయితే తన తల్లి దగ్గరకి వెళ్ళడానికి ఆమె అత్తగారు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ బాబా తనతో ఉన్నారని తెలిసిన జానకీబాయి తన బ్యాగు సర్దుకొని తన తల్లి దగ్గరకి వెళ్ళింది. తన తల్లి వద్ద రెండు, మూడు రోజులు ఉండి తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. బాబా దయవల్ల ఎటువంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకోలేదు.
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba chelli intern location ni hyd marchandi pls thandri
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri t m
ReplyDeletesai baba , ee new year lo maa sai madavani maa nundi duram cheyavaddu baba. madava poorthiga maari chakkaga chadivinchi i prayojakudini cheyalani vundi , anduku baba vari aseessulu kvali baba. alage maa tammudiki kuda oka thoduni chupinchandi baba
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please safe delivery chei baba please nenu adigina korikia therchinduku thanks baba
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm namoh Sree Sai naathaya namaha.
ReplyDeleteSree Sai Ram ki Jai.
Sai Ram ! Rohith Sai Aarogyam meruguparachandi.
Vaadiki sampoorna aarogyaanni prasadhinchandi.sampoorna roganirodhaka saktini prasaadinchandi swami. Vaadi kopanni, avesanni tagginchandi.
Aasirvadhinchandi.
Swami ! Dhayahoopi aasirvadhinchandi.
Vaadini mamoollu manishini cheyandi. Pranaamalu swami