ఈ భాగంలో అనుభవాలు:
1. శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబా
2. ఆఫీస్ పనిలో వచ్చిన సమస్యని పరిష్కరించిన సాయి
శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఉద్యోగం మానేసాక మేము శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాం. తర్వాత మరుసటిరోజు సాయంత్రం మేము శిరిడీ రైలు ఎక్కాల్సి ఉండగా ముందురోజు హఠాత్తుగా మా తమ్ముడు శిరిడీ చూడలేదని, తనని కూడా తీసుకెళదామని నేను, మావారు అనుకున్నాం. అప్పుడు 'మా తమ్ముడు శిరిడీకి రావచ్చా?' అని బాబాని చీటీలు వేసి అడిగాం. బాబా సమాధానం 'తీసుకొని రమ్మ'ని వచ్చింది. అయితే మేము ఉండేది హైదరాబాద్‌లో. మా తమ్ముడు ఉండేది వైజాగ్‌లో. అందువల్ల అప్పటికప్పుడు బస్ టికెట్ బుక్ చేసి, మా తమ్ముడిని హైదరాబాద్‌కి రప్పించాము. తర్వాత కరెంటు రిజర్వేషన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉండటంతో మా తమ్ముడికి రానూపోనూ టిక్కెట్లు బుక్ చేసాం. అయితే సాయంత్రం మేము ఎక్కాల్సిన శిరిడీ రైలు ఆలస్యమై రాత్రి 12 గంటలకి బయలుదేరుతుందని మెసేజ్ వచ్చింది. దాంతో మరో రైలుకి టిక్కెట్లు అందుబాటులో ఉండటం చూసి, బుక్ చేసుకొని అదేరోజు రాత్రి 8:30కి రైలు ఎక్కాము. నేను ముందు నుండి మనసులో బాబాని, "బాబా! ఈమద్య రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల నాకు భయంగా ఉంది. మీరు దగ్గర ఉండి మమ్మల్ని క్షేమంగా శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ క్షేమంగా ఇక్కడికి తీసుకొని రావాలి" అని అడుగుతూ ఉండేదాన్ని. బాబా దయవల్ల మేము క్షేమంగా మరుసటిరోజు గురువారం ఉదయం శిరిడీ చేరుకున్నాము. మా ఆర్థిక పరిస్థితి బాగా లేనందున వసతికి, ఫుడ్‌కి ఎలా అని టెన్షన్‌గా ఉన్నందున మావారు ముందుగానే 'సాయి ఆశ్రమంలో రూమ్ బుక్ చేసారు. 3 రోజులకి 750 రూపాయలు అయ్యింది. అయితే నేను రూమ్ ఎలా ఉంటుందోనని భయపడ్డాను. కానీ, రూమ్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రూమ్‌లో బాబా ఫోటో ఉంది. బాబాని చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. అక్కడినుండి బాబా లీలలు మొదలయ్యాయి. సాయంత్రం దర్శనానికి వెళితే చాలా తొందరగా అయిపొయింది. ఆశ్రమంలోనే భోజనాలు చేసాము. మరుసటిరోజు నాసిక్ వెళ్ళాము. అక్కడ కూడా బాబా మాకు పెద్ద ఖర్చు కానివ్వలేదు. ఆయన దయతో చాలా బాగా యాత్ర జరిగింది. తర్వాత శనివారంనాడు ఎలాగైనా హారతికి హాజరవ్వాలని ఉచిత దర్శన లైన్లోకి వెళితే, మా ముందున్న అందరినీ లోపలికి పంపేసి మమ్మల్ని మాత్రం ఆపేశారు. అప్పుడు నేను, "ప్లీజ్ బాబా! మమ్మల్ని కూడా హారతికి అనుమతించండి" అని బాబాను అడిగాను. వెంటనే మమ్మల్ని సమాధి మందిరంలోకి వెళ్ళండని పంపించారు. ఇక ఒకటే పరుగున వెళ్లి హారతిలో కూర్చున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. కన్నీళ్లు వచ్చాయి. మా పరిష్టితికి తగ్గిట్లే మేము అక్కడున్న 3 రోజులూ బాబా మాకు ఎలాంటి అనవసర ఖర్చులు లేకుండా చూసుకున్నారు. మేము అనుకున్న బడ్జెట్‌లోనే అంతా జరిగింది. ఇకపోతే ఆదివారం మధ్యాహ్నం మేము రైలు ఎక్కాల్సి ఉండగా హఠాత్తుగా ఉదయం నా కడుపులో నొప్పి మొదలై నిల్చులేక, కూర్చోలేక, తినలేక నేను చాలా ఇబ్బందిపడ్డాను. మరో వైపు మేము రైలు అందుకోవడానికి నగర్సోల్ వెళ్లాల్సి ఉంది. ఆ స్థితిలో నాకు ఏమీ అర్దంకాక, "బాబా! ఇంటికి చేరేవారికి నాకు ఈ నొప్పిని తగ్గించు" అని బాబాని వేడుకున్నాను. బాబా దయ చూపి నేను అడిగినట్లు చేసారు. రైలు దిగేవరకు పడుకునే ఉన్నాను కానీ, నొప్పి లేదు. రైలు దిగాక ఆటోలో మా ఇంటికి వెళుతుంటే దారిలో ఒక కారు మీద బాబా దర్శనమిచ్చారు. ఆయన, 'నువ్వు అడిగినట్లు నేను నిన్ను శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపేసాను' అని చెప్పినట్లు నాకు అనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా".
ఆఫీస్ పనిలో వచ్చిన సమస్యని పరిష్కరించిన సాయి
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశదీప్తి. 2023, నవంబర్ నెల చివరి వారంలో ఆఫీసులో నేను ఒక చిన్న ఇష్యూ మీద పని చేశాను. అంతా సరిగా చేసినప్పటికీ ఎందుకోగాని నేను ఆ ఇష్యూకి చేసిన ఫిక్స్ సరిగా పని చేయలేదు. ఎంత ఆలోచించినా కారణమేంటో నాకు అర్థం కాలేదు. అలా మూడు రోజులు ఇబ్బందిపడ్డాను. చివరికి నా సహోద్యోగిని సహాయం అడిగాను. అతను మొత్తం చూసి, "అంతా సరిగానే ఉంది. సమస్యేమీ లేదు" అని చెప్పాడు. కానీ అది సరిగా పని చేయడం లేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక సాయిని తలుచుకొని, "బాబా! నేను ఆ ఇష్యూకి చేసిన ఫిక్స్ పని చేసినట్లైతే మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ తర్వాత నా సహోద్యోగి, "ఒకసారి ఫ్రెష్ కోడ్ తీసుకొని, సేమ్ ఫిక్స్ ప్రయత్నం చేయమ"ని చెప్పాడు. అలా చేయగానే ఆ ఫిక్స్ పని చేసింది. ఇది ఖచ్చితంగా బాబా అనుగ్రహమే. ఎందుకంటే, అంతకుముందు ఎంత ప్రయత్నించినా పనిచేయని ఫిక్స్ బాబాని కోరుకోగానే పని చేసింది. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sairam 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏
ReplyDeleteSai ram🙏
ReplyDeleteOmsrisairam
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please safe delivery chei baba please baba mere dikku
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOmsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba Mee mede baram vesthunna.... please antha set cheyandi
ReplyDeleteOm Sai Ram
ReplyDeletesai baba maa sai madavabharam antha meede baba. madavalo maarpu ravali. bhadyatha teliyali. manchiga chaduvukoni prayojakudini avvali baba.
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై సాయిరాం జై సాయిరాం జై జై సాయిరాం 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః 🙏🙏🙏🙏