సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1701వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీ శిరిడీసాయి దర్శనభాగ్యం
2. తలచుకోగానే సహాయం అందించిన బాబా

శ్రీ శిరిడీసాయి దర్శనభాగ్యం


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఆనాడు శిరిడీలో బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు చేసిన అద్భుత లీలల గురించి నాటి భక్తులు చర్చించుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించారు. ఆ అదృష్టం మనకిప్పుడు ఈ బ్లాగు ద్వారా దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులమని చెప్పవచ్చు. ఈ బ్లాగు వల్ల మనం ప్రతిరోజూ బాబా ప్రేమను ఆస్వాదిస్తూ వారి సాంగత్యంలో ఉంటున్నాము. అలాగే ఆ సాయినాథుడు మనకు ప్రసాదించిన అనుభవాలను సాయి దర్బార్‌లోని తోటి సాయిబంధువులందరితో పంచుకునే అదృష్టం మనకు లభించింది. బాబా భక్తులమవ్వడం మన భాగ్యం. ఇక నా అనుభవానికి వస్తే..


శ్రీ దాసగణు మహారాజ్ రచించిన శ్రీసాయినాథుని స్థవనమంజరి 105 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సాయి టీవీ ఆధ్వర్యంలో శిరిడీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకుగానూ నేను 2023, సెప్టెంబర్ నెలలో శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. ఆ విషయమై, 'నన్ను శిరిడీ రమ్మంటావా బాబా?' అని బాబాను చీటీలు వేసి అడిగితే, 'రమ్మ'ని సమాధానం ఇచ్చారు బాబా. అయితే మా కుటుంబంలోని వారెవరూ రావట్లేనందున, 'కనీసం నేను వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకునేలా చూడండి బాబా' అని అనుకున్నాను. బాబా దయవల్ల మావారు ఒప్పుకున్నారు. అప్పుడు నేను, "ఇంట్లో అయితే ఒప్పుకున్నారు బాబా. కానీ నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి బాబా. ఎవరైనా సాయిబంధువులతో కలిసి వచ్చేలా చూడండి బాబా" అని అనుకున్నాను. తర్వాత నేను సాయి టీవీవాళ్ళకి ఫోన్ చేస్తే, "ఈ కార్యక్రమానికి కొంతమంది భక్తులు వస్తున్నార"ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి, "వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి" అని చెప్పారు. ఆ నెంబరుకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు నేను బుక్ చేసుకున్న ట్రైన్కే కుటుంబంతో ఏడుగురం వస్తున్నామని చెప్పారు. అంతేకాదు, నేను బుక్ చేసుకున్న హోటల్లోనే తాము కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. అంతా బాబా ప్రణాళిక. ఆయన తన బిడ్డల్ని ఒంటరిగా వదలరు. నేనున్నానని ధైర్యం ఇవ్వటానికి ఎవరికివాళ్ళం తెలియకుండానే ఒకే ట్రైన్‌కి, ఒకే హోటల్లో బుక్ చేసుకొనేలా చేసి నాకు వాళ్ళ తోడును అనుగ్రహించారు.


శిరిడీ చేరుకున్నాక బాబా దయవల్ల విఠల మందిరంలో స్తవనమంజరి 21మార్లు పారాయణ చేసే అదృష్టం దక్కింది. బాబా దర్శనం చాలా బాగా జరిగింది. గురువారం చావడి ఉత్సవం చూసే భాగ్యం కూడా లభించింది. మేము ఎంతో ఆనందంగా ఆ ఉత్సవాన్ని తిలకించాం. తిరుగు ప్రయాణమయ్యే ముందు నేను మరోసారి సాయినాథుని దర్శించుకుందామని దర్శనానికి వెళ్లాను. అప్పుడు సమాధి మందిరంలో బాబా దివ్య మంగళ రూపాన్ని చూస్తూ, ఆయన నామం చెప్పుకుంటూ దాదాపు 30 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాను. అక్కడున్న సెక్యూరిటీవాళ్లకు నేను కనిపించలేదేమోనని అనిపించింది నాకు. అంతా బాబా దయ. అదివరకెప్పుడూ అంత సమయం బాబాను చూసుకునే అవకాశం నాకు రాలేదు. ఈసారే బాబా నాకు ఆ అదృష్టం కల్పించారు. ఆయన దయతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. నిజానికి శిరిడీ వెళదామని అనుకున్నప్పటినుంచి బాబా ఏదో ఒక రూపంలో "అంతా సవ్యంగా జరుగుతుంది. నీ ప్రయాణంలో నీకు తోడు ఉంటాను, కంగారుపడకు" అని సందేశాలు ఇచ్చారు. ఆయన మీద భారమేస్తే మన క్షేమం చూసుకుంటారు. మనకు కావలసింది 'శ్రద్ధ-సబూరీ'. "ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ రక్షించండి. అందరి మీద మీ కృపాదృష్టి సదా ఉంచండి బాబా".


చివరిగా మరో అనుభవం: నేను నా గత అనుభవంలో "బాబా! మా కొత్తింటి గృహప్రవేశానికి మీరు రావాలి. మీరు వచ్చి ఏ  ఆటంకాలు లేకుండా గృహప్రవేశం మంచిగా జరిగేలా చూడండి" అని బాబాను అడిగాను. మేము గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకునే ముందు బాబా వద్ద 'అక్టోబర్ నెలలో చేసుకోవాలా?, నవంబర్ నెలలో చేసుకోవాలా?' అని చీటీలు వేసి అడిగాను. బాబా అక్టోబరులో చేసుకోమని సమాధానం ఇచ్చారు. ఆయన దయతో 2023, అక్టోబర్ 26, గురువారం రోజున ముహూర్తం కుదిరింది. బాబా అనుమతితో ఆరోజే మా గృహప్రవేశం అని నిర్ణయించుకున్నాము. ఆలోగా నేను శిరిడీ వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు వంటపాత్రతో ఉండే బాబా విగ్రహం తెచ్చుకున్నాను. ఆ రూపంలో బాబా మా ఇంటికి గృహప్రవేశానికి వచ్చి, కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ వడ్డన చేసారు. మేము అనుకున్న దానికంటే కార్యక్రమం చాలా బాగా జరిగింది. మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు బాబా అనుమతి తీసుకుంటే పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.


తలచుకోగానే సహాయం అందించిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. 2023, అక్టోబర్ 31న నేను ఒక ఇరుకు సందులో కారు రివర్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాను. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత, "నేను ఇపుడు ఇంటికి వెళ్ళడం ఎలా బాబా?" అని అనుకున్నాను. మరుక్షణం ఎవరో ఒకతను నా కారు డోర్ వద్దకి వచ్చి, "నేను కారు తీసి ఇవ్వనా?" అని అడిగారు. నేను సరేనంటే, అతను చాలా జాగ్రత్తగా కారు వెనక్కి తీసి ఇచ్చారు. నేను సంతోషంగా అతనికి ధన్యవాదాలు చెప్పాను. అలాగే బాబాకి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆయన్ని తలుచుకోగానే అతను రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇలా ఎవరైనా ఎవరికైనా సహాయం చేస్తారేమో గానీ, నాకు మాత్రం ఇది బాబా చేసిన సహాయమని నా నమ్మకం. అందుకే మీతో పంచుకున్నాను. "సదా మాతో ఉండి సంరక్షించు సాయిదేవా".

18 comments:

  1. ఓం సాయిరాం బాబా నన్ను కోర్టుకి తీసుకొని వెళ్ళద్దు వద్దు బాబా కోర్టుకి వెళ్ళాక ముందే నా భర్త మారిన కోసం తిరిగి వచ్చేలా చూడు బాబా ఈ నిందలు అవమానాలు లేకుండా ప్రేమతో మమ్మల్ని కలుపు బాబా సాయి

    ReplyDelete
  2. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Baba, Please remove all of our sickness.
    Om sri Sai aarogya kshemadhaaya namaha 🙏🙏🙏

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandri pl urgent ga chai thandri meku satha koti vandanalu

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. sai baba maa sai madava bharam antha meede baba. maa attagari arogyam kuda bagundali baba. maavaru eeroje adivaram karyakramani vastanani anali baba

    ReplyDelete
  10. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  12. బాబా నేను నా మనస్సులో మిమ్మల్ని ఏమి కోరుకున్నానో దాన్ని జరిపించి మీ ఉనికిని యీ అల్పునికి తెలుపండి తండ్రీ 🙏🙏🙏🌹🌹🌹

    ReplyDelete
  13. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  15. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  16. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo