1. బాబా దయతో ఆరోగ్యం
2. పెద్దగా నొప్పి లేకుండా అనుగ్రహించిన బాబా
బాబా దయతో ఆరోగ్యం
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు దీప. నేను నా చిన్నతనం నుంచి సాయి భక్తురాలిని. మామూలుగా పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా ఎందుకో భయమేస్తుంది. అలాంటిది ఎటువంటి జ్వరమైనా తొందరగా తగ్గట్లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. నేను బాబుకి మందులు వేసి, రోజూ బాబా ఊదీ పెడుతూ మూడు రోజులు చూశాను. జ్వరం తగ్గుతూ మళ్ళీ వస్తుండేదికానీ పూర్తిగా తగ్గలేదు. ఇక అప్పుడు నేను బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాను. డాక్టర్, "5 రోజులు వరకు తగ్గకపోతే, బ్లడ్ టెస్ట్ చేయించాల"ని అన్నారు. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా చేసి, టెస్టుల అవసరం లేకుండా చూడు తండ్రి. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా అనుగ్రహించి తొందరగా బాబుకి జ్వరం తగ్గేలా చేశారు. "ధన్యవాదాలు. బాబా. నా అనుభవం పంచుకోవడం కాస్త ఆలస్యమైంది, క్షమించండి బాబా".
తర్వాత ఒకరోజు మా నాన్న, "నాకు కొంచెం బాగాలేదు. హాస్పిటల్‌కి వెళ్లొస్తాన"ని వెళ్లారు. నాకెందుకో చాలా భయమేసి, "బాబా! టాబ్లెట్లతో తగ్గాలి, ఏ టెస్టులూ వద్దు. అంతా బాగుంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకొని నాన్న ఇంటికి తిరిగి వచ్చేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని మనసులో అనుకుంటూ ఉన్నాను. నాన్న వచ్చి, "సమస్యేమీ కాదంట, టాబ్లెట్స్ ఇచ్చారు" అని చెప్పగానే మనసులో బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుండాలి బాబా. ఇంట్లోనే కాదు, అందరూ బాగుండాలి. అందులో మేమూ ఉండాలి".
మరోసారి నాకు బాగా జలుబు చేసి ఒక పది రోజులు చాలా ఇబ్బందిపడ్డాను. అంతలో మోకాళ్ళ నొప్పి, పాదాల నొప్పులు కూడా మొదలవడంతో, 'ఇంత చిన్న వయసులో నాకేంటి ఈ ఇబ్బందులు' అనిపించి రెండురోజులు చాలా బాధపడ్డాను. ఇక అప్పుడు నొప్పులు ఉన్న చోట ఊదీ రాసాను. మరుసటిరోజుకి నొప్పులు చాలావరకు తగ్గాయి. ఆ రోజు గురువారం. బాబా మందిరానికి వెళ్లి బాబాను దర్శించుకొని వచ్చాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా. నాకు ఏమి కావాలో నీకు తెలుసు. సమయానికన్నీ ఇస్తావని తెలిసినా ఎందుకో తెలియని బాధగా ఉంది. నాకు కాలం కలిసి రావట్లేదు, సహకరించట్లేదో అర్థం కావడం లేదు. నాకు నా కాళ్ళపై నిలబడాలని ఉంది. నా బాధని అర్థం చేసుకొని నాకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించు తండ్రీ. నా ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా సహకరించేలా చూడయ్యా".
పెద్దగా నొప్పి లేకుండా అనుగ్రహించిన బాబా
సాయినాథ్ మహారాజ్ కి జై!!! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2023, నవంబర్ 5, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసాక మావారు పని ఉందని బయటికి వెళ్లారు. ఆయన వెళ్తూ వెళ్తూ మా మూడు సంవత్సరాల బాబుని, "నాతో వస్తావా?" అని అడిగారు. వాడు వస్తానని ఆయనతో బయలుదేరాడు. వాడు మెట్ల మీద గెంతుతూ దిగుతుంటే హఠాత్తుగా కాలుజారి కిందపడిపోయాడు. వాడి ఏడుపు వినగానే నేను బాబాని, "బాబా! బాబుకి పెద్ద దెబ్బ తగలకుండా చూడండి" అని వేడుకున్నాను. మావారు బాబుని హత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చారు. బాబుని చూసాక నాకు చాలా టెన్షన్ వచ్చింది. బాబు కనుబొమ్మకి, కనురెప్పకి దెబ్బలు తగిలాయి. కనుబొమ్మ వద్ద పచ్చగా అయి వాపు వచ్చింది. నేను మనసులో బాబాని తలుచుకుంటూ బాబుకి గాయమైన చోట ఐస్ క్యూబ్ పెట్టి, "చిన్న బాబు బాబా. వాడికి నొప్పి లేకుండా చేయండి. అలాగే జ్వరం ఏమీ రాకుండా మీరే చూడాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల బాబుకి నొప్పి స్వల్పంగా ఉండి రాత్రి ఇబ్బంది పడకుండా నిద్రపోయాడు. "ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నందుకు శతకోటి ధన్యవాదాలు బాబా".
Please bless us with a healthy life.
ReplyDeleteOm Sri Sai Arogya kshemadhaaya namaha 🙏🙏🙏
సాయి ఏ కోర్టు కేసులు అవమానాలు బాధలు అబద్ధాలు చాడీలు ద్వేషాలు ఏమీ లేకుండా నా భర్త ప్రేమతో నన్ను భార్యగా స్వీకరించి మేమిద్దరం కలిసేలా చూడు బాబా సాయి నా జీవితం నీ చేతిలో ఉంది బాబా సాయి నాకు మంచి ఉద్యోగం దొరికేలా చూడు బాబా
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri meku satha koti vandanalu
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమ దాయ నమః🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please.. safe delivery chei baba please baby nenu safe ga vundali thandri please baba
ReplyDeleteఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteఓం శ్రీ సాయినాధాయ నమః
ReplyDeleteOm sri sainadaya namaha🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba na health bagu chey baba, naa bidda ki asthma lakshanalu pogottu thandri, baba naku health bagundi udhyoga biksha prasadhinchi nenu anubavisthunna avamanalni thagginchu thandri, na bartha lo konchemanna marpu theskura thandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete