సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1718వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా
2. ఒడిదుడుకులు అన్ని తప్పించి జీవితాన్ని నిలబెట్టిన బాబా

అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా


‘సాయి మహారాజ్ సన్నిధి’కి నమస్కారాలు. నా పేరు సరిత. ఈమద్య మా బాబుని ఆకాష్ బైజూస్‌లో జాయిన్ చేసాము. వాళ్ళు ట్యాబ్ ఇస్తామని అన్నారు కానీ, నెల రోజులైనా ఏదో ఒక కారణము చెప్తూ ట్యాబ్ పోస్ట్ చేయలేదు. చివరికి నా భర్తకు చాలా చిరాకొచ్చి, “కోర్స్ నుండి తప్పుకుంటామ"ని చెప్పారు. అప్పుడు వాళ్ళు, “ఒక 10 రోజుల సమయమివ్వమ”ని అడిగారు. అందుకు మావారు, "సరే, ఒక పది రోజులు వేచి చూస్తాం. అప్పటికీ ట్యాబ్ రాకపోతే కోర్స్ నుండి వైదొలుగుతామ"ని చెప్పారు. ఒకవేళ ట్యాబ్ రాకపోతే కోర్స్ నుండి వైదొలగాలని మా బాబు, నేను చాలా కలవరపడ్డాము.  అప్పుడు నేను, "బాబా! 10 రోజుల్లో ట్యాబ్ వచ్చేటట్లు చూడండి. మీ అనుగ్రహం మీ మిరకిల్స్ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, ఒక వారంలోపు ట్యాబ్ పోస్ట్ చేశామని మాకు మెసేజ్ వచ్చింది. అంతకుముందు ఒక వారంలో, పది రోజుల్లో పోస్ట్ చేస్తామని చాలాసార్లు అన్నారు కానీ, పంపలేదు. అలాంటిది బాబాని అడిగాక సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి నాకు తీవ్రమైన మైగ్రేన్ నొప్పి వచ్చి ఎంతకీ తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! రేపు ఉదయానికల్లా తగ్గితే, మీ అనుగ్రహం బ్లాగ్‌లో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికల్లా బాధ తగ్గింది. సాయిని తలచుకుంటే చాలు - ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. అడిగితే ఎంతటి కష్టాన్నైనా తీరుస్తారు బాబా. "ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


ఒడిదుడుకులు అన్ని తప్పించి జీవితాన్ని నిలబెట్టిన బాబా


నా పేరు దేవి. నాకు తల్లి, తండ్రి, గురువు అన్నీ బాబానే. ప్రస్తుతం యుఎస్‌లో ఉంటున్న మా అబ్బాయి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు పోలీసు కేసు పెట్టి, పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టమన్నారు. అంత మొత్తం మా దగ్గర లేనందున నేను గుడికి వెళ్లి బాబా దగ్గర కన్నీళ్లు పెట్టుకొని, "సహాయం చేయండి బాబా. మీ అనుగ్రహం బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని చెప్పుకొని రాత్రి 7 గంటలప్పుడు గుడి నుండి ఇంటికి వచ్చాను. తర్వాత రాత్రి 10 గంటలకు మా అబ్బాయి ఫోన్ చేసి, “రెండున్నర నెలలు సమయమిచ్చి డ్రైవింగ్ నేర్చుకోమన్నారు” అని చెప్పాడు. కష్టం వచ్చినపుడు బాబా మనతో ఉంటారని, మన చేయి వదలరని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనమేముంది? ఇలా 30 సంవత్సరాలుగా బాబా నా పక్కనే ఉన్నారు. ప్రశాంతంగా పెళ్లి జరగడం, బాబు పుట్టడం, పెద్ద ఇల్లు కట్టుకోవడం అన్నీ సవ్యంగా జరిగాక సరిగ్గా 15 ఏళ్లకు నడి సముద్రంలో పడవ బోల్తా పడినట్లు అనుకోని నష్టం రావడంతో ఇల్లు, డబ్బులు, బంగారం, కారు అన్ని పోయి మేము కట్టుబట్టలతో రోడ్డున పడ్డాము. ఆ సమయంలో మా అబ్బాయి చిన్న పిల్లాడు. ఎన్నో ఒడిదిడుకులు వచ్చి మా జీవితాలు గాలికి, దూళికి ఎక్కడికి కొట్టుకుపోతాయో అనుకున్నాము. కానీ ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనప్పటికీ అన్నింటిని ఎదుర్కొనేలా బాబా ప్రతిక్షణం మా చేయి పట్టుకునే ఉన్నారు. ప్రతి కష్టంలో ఎవరో ఒకరిని పంపి మా కష్టాన్ని తొలగించారు. మా అబ్బాయి చేత ఇంజినీరింగ్ పూర్తి చేయించి క్యాంపస్‌లో పెద్ద ఉద్యోగం వచ్చేలా చేసారు. తర్వాత బాబు యుఎస్‌లో MS చేయడానికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు కూడా బాబా అద్భుతం చేసి కావాల్సిన డబ్బులు సమకూరేలా చేసారు. ఇది మా జీవితాల్లో ఊహించని విషయం. "ధన్యవాదాలు బాబా. మీరు ఎప్పుడూ మాతో ఉండి మేము ధర్మం తప్పకుండా, అహంకారమునకు లోనుకాకుండా చూడండి తండ్రీ. నేను ఒక సమస్యను పరిష్కరించే విషయంలో దయ చూపించమని మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. మీరు తప్పకుండా అనుగ్రహిస్తారని తెలుసు. త్వరలో మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా మన సాయి కుటుంబంతో పంచుకుంటాను బాబా".


21 comments:

  1. Omsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  6. Baba nenu unna situation nunchi nannu kaapadu naaku ishtam lenidi jaragakunda ippude agipoye la chayandi, aa tension nenu padalekapothunna thandri

    ReplyDelete
    Replies
    1. Manasu purthiga korukondi....baba namam thaluchukondi....Baba kachitham gaa mekosam nilabadatharu emina chestharu

      Delete
  7. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete
  10. Baba Mee daya valla oka step datamu.... migathavi kuda meru thodu vundi munduki nadipinchandi please 🙏.... Thank you so much Baba❤️

    ReplyDelete
    Replies
    1. Baba manchigane avuthunnayi ani chepparu.... Maa valla evaru kastapadakunda chudandi Baba....pending vi kuda anni clear ayyi maa mokkulu anni thirchukune laga cheyandi please 🙏.....Thank you so much Baba ❤️.....meku padabi vandanam....nannu elane nethone vundi maa Teja ani anipinchukune laga ashirvadinchandi Baba 🙏

      Delete
  11. ఓం సాయిరామ్

    ReplyDelete
  12. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  13. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please..nose and mouth nunchi bleeding rakunda chudu baba miracle chei baba delivery ayyaka mana Sai Maharaj sannidhi blog lo panchukunta baba

    ReplyDelete
  14. Baba, please give PG medical MS Mch neurosurgery seat in NIMHANS College for my daughter and also give first rank in PG NEET exam. Pl give first rank in INI SET exam.

    ReplyDelete
  15. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  16. baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete
  17. Om Sairam
    Om Sairam
    Om Sairam
    Om Sairam
    Om Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo