- బాబా మిరాకిల్స్‌కి రాజు
సాయి భక్తులకి నా నమస్కారాలు. నా పేరు పద్మజ. మా పెద్దమ్మవాళ్ళు 2023, సెప్టెంబర్ 20న తిరుమల యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. వారం ముందు మా పెద్దమ్మ నన్ను తమతో తిరుమల రమ్మని అడిగింది. అయితే సెప్టెంబర్ 21 నా నెలసరి సమయమవ్వడం వల్ల నేను రాలేనని చెప్పాను. కానీ మా పెద్దమ్మ ప్రతిరోజూ, "కారులో వెళ్దాం. ఒక్క రోజులో దర్శనమైపోతుంది. ఏమీ కాదు. ఒకవేళ నెలసరి సమయమని నువ్వు భయపడుతునట్లేతే టాబ్లెట్ వేసుకో" అని నాతో అంటుండేది. కానీ నాకు టాబ్లెట్లు పడవు. అందుకని నేను ఖచ్చితంగా రానని చెప్పేసాను. దాంతో పెద్దమ్మ ఊరుకుంది. కానీ ప్రయాణానికి ముందురోజు నన్ను మళ్ళీ రమ్మని అడిగింది. అప్పుడు నేను, 'పెద్దావిడ ఇన్నిసార్లు అడుగుతున్నారు. ఒకసారి బాబాని అడిగి, వెళ్ళమంటే వెళదామ'ని బాబా దగ్గర చీటీలు వేశాను. అందులో 'తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకో' అని వచ్చింది. ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సాయంత్రం బట్టలు సర్దుకున్నాను. కానీ మా అమ్మవాళ్లు, "నెలసరి సమయం వెళ్లొద్దు. ఒకవేళ నెలసరి వస్తే దర్శనం చేసుకోకుండా వచ్చేయాలి. కానీ దర్శనం చేసుకోకుండా రాకూడదు" అన్నారు. నేను అమ్మతో, "బాబా వెళ్ళమన్నారు. ఏమీ కాదు" అని చెప్పాను. కానీ నాకు చాలా భయంగానే ఉండింది.
మేము మరుసటిరోజు ఉదయం 5 గంటలకి బయలుదేరుదామనుకున్నాం కానీ, పెద్దమ్మవాళ్ళు ఆలస్యం చేశారు. అప్పుడు నా మనసుకెందుకో ఒకసారి బాబాకి చెప్పుకొని వెళ్దామనిపించి పక్కనే ఉన్న బాబా గుడికి వెళ్ళాను. బాబాని దర్శించుకొని, "బాబా! దర్శనమై తిరిగి వచ్చేవరకు నాకు నెలసరి రాకూడదు. తిరుమల నుంచి రాగానే మొదట మీకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని మొక్కుకొని వచ్చాను. తర్వాత మా తిరుమల యాత్ర మొదలైంది. నేను మనసులో నెలసరి వస్తుందేమోనని ఎంతగానో టెన్షన్ పడుతూ చేతిలో చిన్న బాబా ఫోటో పట్టుకొని 'సాయిరాం సాయిరాం' అని అనుకుంటూనే ఉన్నాను. బాబా తమ అనుగ్రహాన్ని చూపుతూనే ఉన్నారు. మేము ముందుగా కాణిపాకం వెళ్ళాము. ఊరిలోకి ప్రవేశిస్తూనే ఎదురుగా కారు మీద బాబా దర్శనమిచ్చారు. మా పెద్దమ్మ, "అదిగో మీ బాబా. నీకన్నా ముందే వచ్చేసారు" అని అంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా చేతిలో ఉన్న బాబా ఫోటో వదలకుండా దర్శనానికి వెళ్ళాను. బాబా దయవల్ల మాకు గణపతి దర్శనం చాలా బాగా జరిగింది. అనంతరం మా కారు తిరుమలకు బయలుదేరింది. నేను, 'సాయిరాం సాయిరాం' అని అనుకుంటూ, "నెలసరి వస్తే, నా వల్ల వీళ్లంతా ఇబ్బందిపడతారు బాబా. నాకు భయంగా ఉన్నా మీరు చెప్పారని ధైర్యం చేసి వచ్చేసాను" అని బాబాతో మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించాను. తిరుమల చేరుకున్నాక ఓ చోట కారు పార్కు చేసారు. అక్కడ ఎదురుగా బాబా మళ్ళీ దర్శనమిచ్చారు. ఆయనను చూడగానే నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. పెద్దమ్మ, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. నేను, "నాకోసం మా బాబా మళ్లీ వచ్చేసారు" అని అన్నారు. పెద్దమ్మ, "ఆయన నిన్ను వదిలిపెట్టడు" అని అన్నారు. తర్వాత అందరూ టీ షాప్ దగ్గర టీ తాగుతుండగా నాకు నెలసరి మొదలవుతున్నట్లనిపించి దుఃఖం ఆగలేదు. "బాబా! ఇలా చేశావేంటి? నీ మీద భారమేసి ఇంత దూరం వస్తే ఇలా జరిగిందేంటి? నా వల్ల వీళ్లంతా ఇప్పుడు ఇబ్బందిపడతారు" అని చేతిలో ఉన్న బాబా ఫోటోని చూస్తూ ఉన్నాను. అప్పటికి మాకింకా రూము కేటాయించలేదు. అప్పుడు సరిగ్గా 5 గంటలైంది. "రేపు ఈ సమయం వరకు నాకు నెలసరి రాకుండా చూడు సాయి ప్లీజ్.. ఇంటికి రాగానే మీ దర్శనం చేసుకొని, తొమ్మిది ప్రదక్షణలు చేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆ వెంటనే మా తమ్ముడు రూము బుక్ అయిందని వచ్చాడు. నేను రూముకి వెళ్ళిన వెంటనే వాష్ రూములోకి వెళ్లి ఏడ్చేసాను. కానీ ఆశ్చర్యమేమిటంటే, నాకు నెలసరి రాలేదు. అప్పటి నా ఆనందాన్ని చెప్పలేను. మనసులోనే బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మేము ఇంటి దగ్గర బయలుదేరేముందు మా పక్క ఇళ్ల వాళ్ళందరూ, "ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దర్శనానికి 2 రోజులు పడుతుంది" అన్నారు. వాళ్ళు చెప్పినట్లే తిరుమల కొండ మీద జనం బాగా ఎక్కువగా ఉన్నారు. రాత్రి 8 గంటలప్పుడు పెద్దమ్మవాళ్ళు "రేపు దర్శనంకి పోదాం" అన్నారు. నేను మాత్రం ఈ రాత్రే వెళ్దామని అందరినీ రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు సరేనని అన్నారు. మేము భయపడుతూనే ఉచిత దర్శనంకి వెళ్ళాము. నేను బాబా ఫోటోతో దర్శనానికి వెళ్లాను. ఫోటో కాదు, ఆ రూపంలో బాబానే నాతో ఉన్నారు. మాకు దర్శనం మరుసటిరోజు ఉదయం 11:30కి అని వచ్చింది. మా చెల్లివాళ్ళ పాప చిన్నది. తను ఇబ్బందిపెడుతుంటే తిరిగి వెళ్ళిపోదామని అన్నారు వాళ్లు. నేను నమ్మకంగా, "ఏమీ కాదు, వెళ్దాం" అన్నాను. నేను చిన్నప్పటినుంచి తిరుమలకు 20 సార్లుకు పైనే వెళ్లాను. ఎప్పుడూ దర్శనానికి సగం రోజు పట్టేది. కంపార్ట్మెంట్‌లో ఉంచేస్తుండేవారు. ఇప్పుడు కూడా అలానే కంపార్ట్మెంట్‌లో పడేస్తారేమోనని అందరూ భయపడ్డారు. నేను బాబాతో, "బాబా! మమ్మల్ని కంపార్ట్మెంట్‌లో పెట్టకుండా దర్శనం త్వరగా జరిగేలా చూడు తండ్రీ. తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని చెప్పుకున్నాను. కానీ బ్రహ్మోత్సవాల కారణంగా బాగా జనం ఉన్నారు. దాదాపు కంపార్టమెంటులన్నీ నిండి ఉన్నాయి. మమ్మల్ని కూడా ఒక కంపార్ట్మెంట్‌లో పెట్టారు. అక్కడ కనీసం కాళ్లు చాపుకొని కూర్చొనే స్థలం కూడా లేదు. పెద్దమ్మ, "పద్మజ, బాబాకి మ్రొక్కుకో" అంటుంటే నేను నెలసరి టెన్షన్‌తో, "సరిగ్గా రేపు నెలసరి వచ్చేస్తుందేమో! అలా అయితే ఎలా బాబా? ప్లీజ్ బాబా.. మమ్మల్ని దర్శనానికి పంపాలి" అని నమ్మకంగా అనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితి దృష్ట్యా త్వరగా దర్శనమవ్వడం అసాధ్యం. అలాంటిది అరగంటలో కంపార్ట్మెంట్ తలుపులు తెరిచారు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకి దర్శనమని ఇచ్చినప్పటికీ అరగంటలో మమ్మల్ని దర్శనానికి పంపారు. దర్శనానికి వెళ్లే లైన్ అంతా జనం విపరీతంగా ఉన్నారు. మాతో చిన్న పాప ఉండటం వల్ల మాకు భయం భయంగా ఉంది. స్వామి దగ్గరకి చేరుకోవడానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. నేను, "బాబా సహాయం చేయండి. చిన్న పాప ఉంది" అని బాబాని అడుగుతూ ఉన్నాను. బాబా మిరాకిల్స్‌కి రాజు. ఆయన మళ్ళీ అద్భుతం చేసారు. సరిగ్గా మేము వెళ్తున్న దారిలో ఉన్న ద్వారం వద్దకి వెళ్ళగానే ఆ దారి మూసేసి వేరే మార్గం గుండా 10 నిమిషాల్లో గుడి లోపలికి పంపించేశారు. లోపల ఒకటే జనం ఉన్నందున భక్తులను ఒక్క క్షణం కూడా నిలబడనివ్వకుండా స్వామివారి సేవకులు లాగేస్తున్నారు. బాబా ఫోటో నా చేతిలోనే ఉంది. నేను నడుస్తూనే, "బాబా! స్వామి దర్శనం బాగా జరిగేలా చూడు. మీకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాన"ని మళ్లీ బాబాకి మొక్కుకున్నాను. సరిగ్గా నేను స్వామి ముందుకు వెళ్ళగానే అక్కడ సేవ చేస్తున్న ఒకతను ముందు వాళ్ళకి ఏదో ఇస్తూ, మరో చేయి నాకు అడ్డంగా పెట్టాడు. అందువల్ల నేను స్వామికి ఎదురుగా ఒక నిమిషంపాటు అక్కడ నిలిచిపోయాను. పూర్తిగా వజ్రాల అలంకరణతో స్వామి ధగధగా మెరిసిపోతున్నారు. నా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లో తిరుమల వెళ్ళాను కానీ, అంత స్పష్టంగా స్వామిని ఎప్పుడూ చూడలేదు. మామూలుగా అయితే లైన్లో ఎంతో సమయాన్ని వెచ్చించి నడుచుకుంటూ వచ్చే భక్తులను సరిగ్గా స్వామి దగ్గరకి రాగానే లాగేస్తారు. అలాంటిది నేను మొదటిసారి ఒక్క నిమిషంపాటు స్వామి ఎదురుగా నిలబడి స్వామిని తృప్తిగా దర్శించుకున్నాను. ఇప్పుడు ఈ అనుభవం వ్రాస్తుంటే కూడా నా కళ్ళముందు ఆనాటి ఆ దర్శనం మెదులుతుంది. అప్పుడు సాయే నాకు తోడుగా వచ్చారని నా నమ్మకం. ఆయన దయవల్ల రెండురోజులు పడుతుందన్న ఉచిత దర్శనం కేవలం రెండు గంటలలో అయిపోయి బయటకు వచ్చాము. ఇదంతా మన సాయి చేసిన అద్భుతం.
దర్శనానంతరం మేము రూముకి వచ్చాక మరుసటిరోజు పొద్దున్న అలివేలు మంగాపురం వెళ్లాలని అనుకున్నాము. కానీ నాకు నెలసరి టెన్షన్. అందువల్ల ఆ రాత్రి ఊదీ నా పొట్టకు రాసుకొని, బాబా ఫోటో పొట్ట దగ్గర పెట్టుకొని, 'సాయిరాం సాయిరాం' అనుకుంటూ పడుకున్నాను. తెల్లారక మంగాపురం వెళ్ళాము. అక్కడ దర్శనానికి విపరీతమైన జనం ఉన్నారు. ఆ జనంలో పాప ఏడుస్తుంటే పెద్దమ్మవాళ్ళు, "మరోసారి వద్దాం. ఈసారికి వెళ్ళిపోదాం" అని అనసాగారు. మరోపక్క చాలాసేపటివరకు దర్శనానికి వదలట్లేదు. కాసేపటికి పెద్దమ్మ, "బాబాని అడుగు" అన్నారు. బాబా ఫోటో నా చేతిలోనే ఉంది. "సాయీ! అమ్మవారి దర్శనం ఇప్పించండి. 9 ప్రదక్షిణలు చేస్తాను" అని మళ్ళీ బాబాతో చెప్పుకున్నాను. వెంటనే క్యూలైన్ కదిలింది. పెద్దమ్మ, "చెప్పాను కదా! బాబా నీతోనే ఉన్నార"ని అంది. అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో శ్రీకాళహస్తి కూడా దర్శించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము. ఇంటికి రాగానే స్నానం చేసి బాబా గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత ఇంటికొచ్చి పూజ చేసి తిరుమల లడ్డు అందరికీ పంచిపెట్టాను. తర్వాత నాకు నెలసరి వచ్చింది. ముందురోజు సాయంత్రం అదే సమయంలో తిరుమల కొండ మీద, "రేపు ఈ సమయం వరకు నాకు నెలసరి రాకుండా చూడు బాబా" అని బాబాను వేడుకున్నాను. సరిగ్గా అదే సమయానికి నెలసరి వచ్చేలా చేసారు బాబా.
Om Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteగురు బ్రహ్మ పరమాత్మ నాలోని సర్వకోటి పాపాలు సర్వకోటి రోగాలు తొలగించి నిన్ను నా భర్త కలిసి కాపురం చేసేలా చేయి తండ్రి సాయినాథ ఈ కోర్టు గొడవలు లేకుండా మనస్పూర్తిగా నా భర్త నన్ను భార్యగా స్వీకరించి కాపారానికి తీసుకెళ్లలో చూడు తండ్రి
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, Ma chelli ki hyd lo intern location vache la chai thandri pls
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba safe delivery chei baba.complications lekunda chudu baba please.meku matarame chepukogalani problem therchu baba please
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba. madavalo maarpu ravali baba. alage maa tammudiki kuda oka thoduni chudandi baba. alage repu memu hyd vellutaku anumathi evvandi prayanamu prasanthamga jaragali baba.
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOm sai ram 🙏🪔 blessy kids with their exams baba 🙏
ReplyDeleteOm Sai Ram Baba bless 🙏🙏 my family 🙏😀
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sai Ram
ReplyDelete