- ఇలా ఉంటుంది సాయి దయ
నా పేరు కిరణ్మయి. నేను ఎంతో బాధలో వున్నప్పుడు ఈ బ్లాగు నాకు కనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ నేను సాయి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. అవి నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. నేను ఇప్పుడు సాయినాథుడు నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. ఒకరోజు రాత్రి పడుకునేముందు సంవత్సరం వయసున్న మా పాపకి బాగా జలుబు చేసింది. తనకి జలుబు చేసిందంటే నాకు చాలా భయం. ఎందుకంటే, తను పళ్ళు, పెరుగన్నం మాత్రమే ఇష్టంగా తింటుంది. అలాంటి తనకి జలుబు చేసిందంటే తినడానికి ఇంకేమీ ఉండవు. అందుకని నేను ఆ రాత్రి నిద్రపోయేముందు పాప ముక్కుకి ఊదీ, విక్స్ రాసి, ఆ సాయినాథుని దణ్ణం పెట్టుకొని, "స్వామీ! రేపు ఉదయం నిద్రలేచేసరికి నా బిడ్డకి జలుబు తగ్గిపోవాలి. అదే జరిగితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని దృఢంగా వేడుకున్నాను. ఆ సాయినాథుడు దయతో ఉదయం లేచేసరికి నా బిడ్డ జలుబు తగ్గించారు. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం పంచుకోవటం ఆలస్యమైన కారణంగా ఏమో నా బిడ్డకి మళ్ళీ మళ్లీ జలుబు చేస్తుంది. నన్ను క్షమించి నా బిడ్డను చల్లగా చూడు తండ్రీ".
ఒక ఆదివారం నేను, నా భర్త, నా బిడ్డ గుడికి వెళ్ళి, దర్శనమయ్యాక తిరిగి వచ్చేటప్పుడు బస్సు ఎక్కాక చూసుకుంటే నా భర్త ఫోన్ కనిపించలేదు. దాంతో టెన్షన్ పడుతూ ఇద్దరం బస్సులో వేతికాం కానీ, ఫోన్ కనిపించలేదు. నా భర్త, "వచ్చిన దారిలో కిందపడిపోయిందేమో! చూస్తాను" అని తరువాత స్టాపులో బస్సు దిగి వెనక్కి వెళ్లారు. మేము ఇంటికి వెళ్ళాము. మేము ఇల్లు చేరుకున్న గంట తర్వాత నా భర్త ఇంటికి వచ్చి ఫోన్ దొరకలేదని అన్నారు. అది ఐఫోన్ అయినప్పటికీ చాలా సంవత్సరాలుగా వాడుతున్నందువల్ల పాతది అయిపోయి సరిగ్గా పని చేయట్లేదు. అందువల్ల మావారు కొత్త ఫోన్ కొనుకున్నే ప్రయత్నాల్లో పడ్డారు. కానీ మా పాప పుట్టినప్పటినుంచి తనకు తీసిన ఫొటోలన్నీ ఆ ఫోన్‌లోనే ఉన్నందున మావారు చాలా బాధపడుతుండేవారు. విషయం తెలిసి నేను కూడా చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రి నేను పడుకునేముందు బాధతో, "సాయినాథా! నా భర్త ఫోన్ దొరికేలా చేయండి స్వామి. అది దొరికితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. నిజంగా బాబా దయ చూపారు. మరుసటిరోజు మధ్యాహ్నం నేను, మా పాప పడుకొని లేచేసరికి ఫోన్ దొరికిందని మావారు చెప్పారు. విషయమేమిటంటే, నా భర్త ఫోన్ ఎవరో ఒక బస్సు డ్రైవర్‌కి దొరికితే, అతను తను పనిచేస్తున్న సంస్థవాళ్ళకి ఇచ్చాడు. మేము నెదర్లాండ్స్‌లో వుంటాము. ఈ దేశం రూల్స్ ప్రకారం ఎవరైనా పోగొట్టుకున్న వస్తువులను ఒక వెబ్సైటులో పెడతారు. ఆ వెబ్సైటులో చూసి మావారు తన ఫోన్ తెచ్చుకున్నారు. ఆయన ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పినప్పటికీ మా విషయంలో జరగడం నిజంగా ఆ సాయితండ్రి దయ.
నా భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకి 13 సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ జరగని ఒక పెద్ద విషయం ఒకసారి జరిగింది. ఆయన కొత్తగా చేరిన కంపెనీలోని ఒక సహోద్యోగి, మావారి ప్రవర్తన సరిగా లేదని పిర్యాదు చేయడంతో మావారిని తను చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి తొలగించాలని ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నిర్ణయించుకున్నారు. దాంతో మావారికి వేరే ప్రాజెక్ట్ చూపించే బాధ్యత ఆ కంపెనీ మీద ఉన్నప్పటికీ వేరే ప్రాజెక్ట్‌లు లేవని మావారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అనుకున్నారు. అయితే ఈ దేశం నియమ నిబంధనల ప్రకారం అలా ఎవరినీ ఉద్యోగంలో నుంచి తొలగించే హక్కు కంపెనీకి లేదు. అయినా తొలగించినట్లైతే చాలా పెద్ద మొత్తంలో ఆ కంపెనీవాళ్ళు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం లాయర్ ద్వారా ఆ కంపెనీవాళ్ళతో మాట్లాడమని ఫ్రెండ్స్ సలహా ఇవ్వడంతో మావారు లాయరుతో మాట్లాడించే ప్రయత్నం చేసారు. నేను, 'మావారిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. బయట మార్కెట్ సరిగ్గా లేదు. అదీకాక చిన్న దేశం. కంపెనీలు తక్కువ, అవకాశాలు కూడా తక్కువ. మావారికి ఉద్యోగం దొరుకుతుందా? లేదా?' అని చాలా టెన్షన్ పడ్డాను. నేను భయపడినట్లే, మావారు కొన్ని ఇంటర్వ్యులకి హాజరైనప్పటికీ ఏదో ఒక కారణం చేత ఆఫర్ లెటర్ మావారి చేతి దాకా వచ్చేది కాదు. ఈ స్థితిలో నేను సాయినాథునికి మనసారా దణ్ణం పెట్టుకొని, "స్వామీ! మీ దయవల్ల నా భర్తకి మంచి ఉద్యోగం రావాలి. అలాగే లాయర్ ద్వారా ఆ కంపెనీ నుంచి మంచి మొత్తంలో డబ్బులు మాకు అందేలా చూడండి. అలా జరిగితే మీకు 50 యూరోల దక్షిణ సమర్పించుకొని, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల నా భర్త చాలా కంపెనీలలో ప్రయత్నించగా అన్నిటికంటే చాలా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అలాగే లాయర్ ద్వారా పాత కంపెనీవాళ్ళు మంచి మొత్తంలో డబ్బులు మాకిచ్చారు. అలా ఉంటుంది సాయి దయ. "ధన్యవాదాలు బాబా. మీ సహాయం జన్మలో మరవలేను తండ్రీ. దయతో నా బిడ్డని చల్లగా చూడు తండ్రీ".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
గురు బ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోని సప్తకోటి రోగాలు శతకోటి దోషాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసేలా చెయ్యి తండ్రి లేకుండా మనస్పూర్తిగా నా భర్త నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయినాథ ప్రభు తండ్రి
ReplyDeleteNaku na bartha kavalii sai
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, we are on the way to Shirdi for your Divya Darshan. Bless us.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteThanks thandri ika mundu ye problems lekunda chudu thandri pls
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri meku satha koti vandanalu. Please baba
ReplyDeleteBaba naa valla kavatamledu Mee mede baram antha ...😭😭😭
ReplyDeleteBaba Sai drink habit mani inchu thandri marriage chai thandri pl
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba. eeroju madava annam motham tente repu neneu blog lo anubhavanni anchukuntanu baba. alage maa tammudiki kuda oka thodu ni chupinchu baba narasaraopet lo
ReplyDeletemaa sai madavani mee bhaktudini chesuko baba
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteSamagra sadguru sainath maharaj ki jai 🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOM SAIRAM
ReplyDelete