సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1700వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. గోవా యాత్రలో బాబా చూసిన దయ
2. అడిగింది ఇచ్చి తామున్నామని నిరూపించే బాబా

గోవా యాత్రలో బాబా చూసిన దయ


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు ఆశాదీప్తి. ఈమధ్య మా అత్తయ్యవాళ్ళు మొత్తం కుటుంబమంతా కలిసి వెళ్లడానికి అనువుగా ఉంటుందని ఒక సెవెన్ సీటర్ కారు తీసుకున్నారు. తర్వాత కొత్త కారులో అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో పిల్లలు దసరా సెలవులకి గోవా వెళ్దామని పట్టుపట్టారు. మేము సరేనని కారులో గోవా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అయితే అందరూ గోవా వెళ్లే రోడ్డు మార్గం అంతగా బాగోదని, చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. దాంతో నాకు పిల్లల్తో కారులో అంత దూరం ప్రయాణం కొంచెం రిస్కీ అనిపించింది. అందువల్ల గోవా వెళ్లేందుకు బయలుదేరేముందు నేను సాయినాథుని తలుచుకుని "ప్రయాణం అంతా సవ్యంగా జరిగి మేము క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబా మీద భారమేసాను. అందరూ చెప్పినట్లే 14 గంటల ప్రయాణం కాస్త 18 గంటలు పట్టింది. అంత ఆలస్యమైనా కూడా బాబా దయవల్ల సమయానికి ఆహారం తదితర అన్నీ లభించి, పిల్లలతో మాకు ఎక్కడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి రాలేదు.


ఒకరోజు మేమంతా గోవాలో బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుపెడుతూనే రెండు గిత్తలు పోట్లాడుకోవడం మా కంటపడింది. ఆ పక్కనే చాలా కుక్కలు ఉన్నాయి. మాకు కాస్త భయమేసి త్వరత్వరగా నడుచుకుంటూ వెళుతుంటే కుక్కలు బాగా మొరగటం మొదలుపెట్టాయి. దాంతో మిగిలిన గిత్తలు లేచి పరుగులు తీస్తూ మమ్మల్ని చుట్టుముట్టాయి. నేను, మా బాబు, మా మావయ్యగారు వాటి మధ్య ఇరుక్కుపోయాం. ఆ సమయంలో నాకు దిక్కుతోచక బాబుని గట్టిగా పట్టుకుని చుట్టూ చూడసాగాను. నాకప్పుడు కనీసం బాబాను శరణువేడాలన్న ఆలోచన కూడా రాలేదు. అయినా బాబా మమ్మల్ని కాపాడారు. ఎలాంటి హాని జరగకుండా మేము అక్కడినుండి తప్పించుకుని బయటపడ్డాం. అంతా బాబా మాపై చూపిన దయ, అనుగ్రహం.


గోవా నుండి తిరుగు ప్రయాణమయ్యే రోజున నాకు బాగా అలసటగా అనిపించి, జ్వరం కూడా వచ్చింది. నాకు జ్వరంతో 18 గంటల ప్రయాణమంటే చాలా భయమేసి కాస్త బాబా ఊదీ, ఒక టాబ్లెట్ నోట్లో వేసుకొని, "బాబా! మీదే భారం" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి నేను కోలుకున్నాను. ప్రయాణంలో జ్వరం నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. 


ఇంకో ముఖ్య అనుభవం. మేము గోవాకి బయలుదేరే ముందు ఎంత వెతికినా మా బాబు వెండి కడియం కనిపించలేదు. ఇంకా వెతికేందుకు సమయం లేకపోవడంతో మేము గోవాకు బయలుదేరిపోయాం. నేను మనసులో, "బాబా! ఆ కడియం పోకుండా ఇంట్లోనే ఉండి త్వరగా దొరికితే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. గోవా నుండి ఇంటికి తిరిగి వచ్చాక కడియం కోసం మళ్ళీ వెతికితే, అది మా బాబు స్కూలు బ్యాగులో దొరికింది. ఇలా ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉంటూ మమ్మల్ని ఎల్లవేళలా ముందుకు నడిపిస్తున్న సాయికి శతకోటి వందనాలు.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అడిగింది ఇచ్చి తామున్నామని నిరూపించే బాబా

ముందుగా సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. సాయిబాబా నన్ను ఎన్నోసార్లు కాపాడారు. ఆయన్ని పిలిస్తే పలుకుతాడని ఎందుకు అంటారో నా విషయంలో చాలాసార్లు ఋజువైంది. నేను ఎప్పుడు బాధపడ్డా, నాకు ఇది కావాలని బాబాని ఒక్కసారి అడిగితే వెంటనే ఆయన అడిగినవిచ్చి తామున్నామని నిరూపించారు. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా చిన్న విషయమే అయినా కానీ నేను నా కోరిక తీరుస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పాను. అందుకే మీతో పంచుకుంటున్నాను. మావారు చాలా రోజుల నుంచి తిరుమల వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ వెళ్లడం కుదరలేదు. చివరికి 2023, అక్టోబర్ 1న వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసారు. కానీ ఆ నెల నాకు నెలసరి ఆలస్యం అయింది. దాంతో ఎక్కడ తిరుమలకు వెళ్లేరోజు నెలసరి వస్తుందో అని నేను చాలా భయపడ్డాను. ఆ స్థితిలో బాబాని, "తిరుమల వెళ్లి తిరిగి వచ్చేవరకు నాకు నెలసరి రాకుండా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబాని అడిగాక జరగనిది ఏమైనా ఉంటుందా? మా తిరుమల యాత్ర, స్వామివారి దర్శనం అంతా సంతోషంగా జరిగి ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులకి నాకు నెలసరి వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

25 comments:

  1. సాయి నన్ను క్షమించు సాయి ఏ ఇబ్బంది లేకుండా ఈ కోర్టు కేసులు లేకుండా ఈ అవమానాలు నిందలు అబద్ధాలు చాడీలు ఏమీ లేకుండా ప్రేమతో నా భర్త నన్ను స్వీకరించే ఆశీర్వదించు సాయి కోర్టుకు వెళ్లకుండానే నా సమస్యని పరిష్కరించు బాబా నా భర్త నా కోసం తిరిగి వచ్చేసారా చూడు బాబా సాయి

    ReplyDelete
    Replies
    1. Every Thursday dhuni ki coconut samarpinchandi

      Delete
    2. Baba Kalyan ki marriage chai thandri pl urgent ga chai thandri

      Delete
    3. ఓం శ్రీ సాయినాథాయ నమః తప్పకుండా నీ భర్త నిన్ను తీసుకొని వెళతాడు భయపడకు తల్లి

      Delete
    4. బాబాను స్మరిస్తూ ఉండండి

      Delete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Please make us all healthy, om sri sai arogyakshemadhaaya namaha🙏🙏🙏

    ReplyDelete
  8. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  11. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please..safe ga delivery ayyi nenu na baby keshamanga intiki ravali thandri.. complications lekunda chudu baba please baba

    ReplyDelete
  12. Om Sai Ram with your blessings my health improved.Thank you Sai Ram.i am living with full happy life.Sai Ram my life is yours.your are my father, mother everything.

    ReplyDelete
  13. sai baba, maa sai madava bharam antha meede baba, madava ni poorthiga marcheyali baba. eeroju madava kosam japam modalu pettaru, adivaram memu naluguramu vachhi abhisheka, homa karyakramamulu chesetattu deevinchandi. maa varu cheppina ventane vappukoni andaram vacchhi aa karyakramamuni chesukunte nenu naa anubhavanni ee bloglo panchukuntanu baba. meere maa varini vappinchali baba

    ReplyDelete
  14. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  15. Baba, maa block product out put sariga ravatam ledu. Karuninchandi output Baga vachela chudandi baba.

    ReplyDelete
  16. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  17. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo