సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1708వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి దరికి చేర్చిన జీసెస్

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అందరికీ నమస్కారాలు. నా పేరు మమత. ఇదివరకు 'సాయిభక్త అనుభవమాలిక' 1540వ భాగంలో నేను మొదటిసారి ఈ బ్లాగులో నా అనుభవం పంచుకున్నాను. నిజానికి నేను ఆ అనుభవంతోపాటు సాయినాథుని ద్వారా నేను పొందిన నా మొదటి అనుభవాన్ని కూడా పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నా మనసు చాలా బాధలో ఉంది. అదీకాక ఎక్కువ మేటరు వ్రాయకూడదేమో, అనుభవం పెద్దగా అవుతుందేమో అని చిన్నగా పంచుకున్నాను. తర్వాత బ్లాగులో అనుభవాన్ని అన్ని వివరాలతో చాలా వివరంగా వ్రాసి పంచుకోవచ్చని చూసాను. సరే, ఇక సాయితండ్రితో నాకు అనుబంధం ఏర్పడిన తీరు గురించి, ఆయన నాకు ప్రసాదించిన మొదటి అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను.


మాది క్రైస్తవ కుటుంబం. మా తాతయ్య ఉన్నప్పుడు మాకు చిన్న చర్చి ఉండేది. పండగలప్పుడు తాతయ్య ప్రార్థనలు చేస్తుండేవారు. తాతయ్య చనిపోయాక అమ్మ ప్రార్థన చేయించడం మానేసింది. తర్వాత మేము వేరే ఊరికి మారాము. అన్నయ్య, నేను ఎదిగేకొద్దీ వేరేవాళ్లతో కలిసి అన్ని గుడ్లకి వెళ్తుండేవాళ్ళం. అన్నయ్య హిందూ దేవుళ్ళనే నమ్మేవాడు. జీసెస్‌కి ప్రార్థన చేసేవాడు కాదు. నేను మాత్రం ఇంటర్ వరకు చర్చికి వెళ్లకపోయినా, రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు జీసెస్‌ని ప్రార్థిస్తుండేదాన్ని. కానీ నాకు జీసస్‌తో అనుబంధం ఏర్పడలేదు.


నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు హాస్టల్లో ఒక అక్క దగ్గర సాయి లీలామృతం పుస్తకం ఉండేది. ఆ అక్క, "ఈ పుస్తకం 11 రోజులు పారాయణం చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయ"ని చెప్పింది. 'కోరికలు నెరవేరుతాయంటే, చేద్దాం. కోరిక నెరేవేరుతుందేమో' అనిపించడం సహజమే కదా! అందుచేత నేను నా చదువు గురించి కోరిక కోరుకొని ఆ పుస్తకం చదవాలనుకొని అక్కతో, "అక్కా! సెలవులు ఉన్నాయి కదా, నువ్వు ఆ పుస్తకం ఇస్తే ఇంటికి తీసుకెళ్లి పారాయణ చేస్తాను" అని అన్నాను. అక్క, "తీసుకు వెళ్ళు" అని అంది. అయితే క్రైస్తవ మతస్థురాలినైన నాకు పూజ విధానాలు, పారాయణ ఎలా చేయాలి అన్నవి తెలియదు. కాబట్టి మామూలుగానే నేను ఆ పుస్తకం చదివసాగాను. చదివే కొద్ది చదవాలనిపించేది, చాలా ఆనందమేసేది, దేవుడు, గురువు అంటే ఏంటి, జన్మ-పునర్జన్మ వంటి చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అసలు చెప్పాలంటే సాయితండ్రి పరిచయంతో నాకు దేవుడంటే ఏంటనేది తెలిసింది. తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అక్క దగ్గర నుంచి ఆ పుస్తకం తీసుకొని చదువుతూ అక్కవాళ్ళతో కలిసి మా హాస్టల్‌కి దగ్గరలో ఉన్న తేనే సాయి మందిరంకి వెళ్తుండేదాన్ని. నాకు చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉండేది.


మా హాస్టల్ నుండి కొంచం దూరంలో ఉన్న వేరే ఊరిలో సాయిబాబా నెమలి మందిరమని ఒక గుడి ఉంది. ఒకరోజు అక్క, నేను ఆ గుడికి వెళదామని బస్టాండుకి వెళ్ళాము. అక్కడ అక్కకి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ అతను అక్కతో ఏమీ మాట్లాడలేదు. మేము బస్సు కోసం వేచి చూడసాగాం. బస్సు రావడం ఆలస్యమయ్యేసరికి ఆ ఊరు వెళ్లే జనం చాలా ఎక్కువయ్యారు. కొంతసేపటికి ఒక బస్సు వచ్చింది. చీమ దూరడానికి కూడా చోటు లేనంత రద్దీగా ఉన్నందున మేము ఆ జనంలో తోసుకుంటూ ఎక్కే సాహసం చేయలేక బస్సు ఎక్కకుండా అలాగే నిలబడిపోయి, "బాబా! ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎలా? మీరే మాకు సహాయం చేయాలి" అని నేను, అక్క బాబాను అడిగాము. అంతలో అక్కకు తెలిసిన అబ్బాయి మమ్మల్ని పిలిచి, "బస్సులో చోటు ఉంది. లోపలికి రండి" అని అన్నాడు. అక్క, నేను ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఇలా బాబాని తలుచుకొని బాధపడ్డామో, లేదో మరుక్షణంలో అప్పటివరకు మాట్లాడని ఆ అన్నయ్య వచ్చి చోటు ఉందని చెప్పడం, అదీకాక అంత రద్దీలో రెండు సీట్లు ఉండటం మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నాకైతే చాలా ఆనందమేసింది. ఇది సాయితండ్రితో నా మొదటి అనుభవం. మేము మంచిగా సాయితండ్రి దర్శనం చేసుకుని సంతోషంగా హాస్టల్‌కి తిరిగి వచ్చాము.


ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక గదిలో ఇరుక్కుపోయాను. ఆ గదిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆ గదికి ఉన్న ఒక కిటికీ వద్ద జీసస్ కనిపించి ఆయన నన్ను ఆ కిటికీ గుండా బయటకు తీసుకొచ్చి నా చేయి పట్టుకొని గాల్లో తేలుతూ నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. నేను అప్పుడు 'సాయి' అని అనుకుంటూ ఆనందంతో జీసస్‌ని, "మీకు సాయి తెలుసా?" అని అడిగాను. అందుకు జీసస్, "నాకు తెలుసమ్మా, నిన్ను అక్కడికే తీసుకు వెళుతున్నాను" అని అన్నారు. తర్వాత నన్ను సాయి దగ్గర విడిచిపెట్టారు. అంతటితో ఆ కల ముగిసిందనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు మరేమీ గుర్తులేదు. తర్వాత సాయితండ్రితో అనుబంధం పెరుగుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, 'సాయి గురించి నాకు తెలియనంతవరకు అంటే ఇంటర్ వరకు జీసెస్ నన్ను కాపాడి, నేను సాయి గురించి తెలుసుకున్నాక నన్ను ఆయనకు అప్పజెప్పారు. అన్ని రూపాలు సాయితండ్రివే. అందరూ ఒకటే. నా తండ్రి నన్ను ఎప్పటినుంచో రక్షిస్తూ వస్తున్నారు. అది నేను తెలుసుకోలేకపోయాను అంతే' అని. అప్పుడు 'తండ్రీ సాయీ! ఇంకా ముందే మిమ్మల్ని తెలుసుకునుంటే బాగుండేది కదా!' అని నాకు ఏడుపొచ్చింది.


2022లో నాకు మరొక కల వచ్చింది. ఆ కలలో నేను ఏదో గుడికి వెళుతూ దారిలో ఓ చోట ఆగాను. అక్కడ సాయి మందిరం ఉంటే సంతోషంగా లోపలికి వెళ్లాను. అక్కడ సాయి విగ్రహరూపంలో కాషాయ వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఆయన్ని చూడగానే నాకు చాలా ఆనందమేసింది. సాయితండ్రి ఏదో మాట్లాడుతున్నారుగాని నాకు వినిపించలేదు. అప్పుడు, "సాయీ! నాకు వినిపించట్లేదు. నాకు వినిపించట్లేదు సాయీ" అని అనుకుంటే వినిపించాయి. అది ఏమనంటే, "నన్ను తండ్రి అని కాదు, అన్నయ్య అని పిలు" అని. తర్వాత నేను నా చదువు గురించి సాయితో ఒక మాట చెప్పాను. ఆయన సరేనన్నారు. అంతటితో ఆ కల ముగిసి నాకు మెలకువ వచ్చి చాలా ఆనందంగా అనిపించింది. సాయి నన్ను తమని అన్నయ్య అని పిలవమనడానికి కారణం లేకపోలేదు. 2020, ఫిబ్రవరిలో మా అన్నయ్య చనిపోయాడు. తర్వాత ఎవరైనా నా కుటుంబం గురించి అడిగినప్పుడు అన్నయ్య లేడని చెప్తున్నాను. అందువల్ల సాయితండ్రి అన్నయ్య లేడని బాధపడవద్దు, నీకు అన్నయ్య లేడనకు, నేనే నీ అన్నయ్యనని చెప్పారనిపించింది.


ఇంకా బాబా నా పోస్టు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఉండిపోయిన పరీక్షలు వ్రాయడంలో, ఇంకా చాలా చాలా లెక్కలేనన్ని చిన్న, పెద్ద అనుభవాలు ఇచ్చి నన్ను సంరక్షిస్తూ వస్తున్నారు. సాయితండ్రే నాకన్నీ, ఆయన లేకుండా నేను ఉండలేను. "సాయితండ్రీ! మీరు నన్ను కన్న తల్లిదండ్రుల్లా, అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అమ్మానాన్న ఆరోగ్యం బాగుండేలా, వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ. నేను మిమ్మల్ని విడవకుండా మీ సాంగత్యంలో సదా ముందుకు వెళ్లేలా, ప్రతిక్షణం మిమ్మల్ని తలుచుకొంటూ మీరు చూపించే మార్గంలో మంచి బుద్ధికుశలతతో నడుచుకునేలా, సదా మీరు నా వెంటే, నా దగ్గరే ఉన్నారని ప్రతిక్షణం నేను గమనించేలా అనుగ్రహించండి సాయితండ్రీ. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి". 


సద్గురు శ్రీ సాయినాథార్ఫణమస్తు!!!


17 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయి ఓం సాయిరాం నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చూడు సాయి ఓం సాయిరాం ఓం సాయిరాం సాయిబాబా కోర్టు కేసులు ఏమీ లేకుండా ఏందో ఏమోమానాలు ఏ చాడీలు లేకుండా నా భర్త మారి నన్ను మారిన స్వీకరించుకుంటానికి తీసుకెళ్లలో చూడు బాబు సాయి ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను మామ పని చేయవంతంగా చూడు తండ్రి

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandri meku satha koti vandanalu

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. saibaba maa saimadava bharamantha meede baba. madavaki evaraina smart watch koni estshe bagundu. alage maa tammudiki kuda oka thoduni evvandi baba. maa atta garu, maa varu maarali . manchiga avvali baba.

    ReplyDelete
  10. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please BP normal ga vundali thandri please complications lekunda chudu baba safe delivery chei baba.. bless cheyandi baba nannu na puttaboye biddanu.omesairam

    ReplyDelete
  11. Omsaisri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Om sainadaya namaha🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  14. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  15. 2 Sai Leela is very nice.om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo