1. బాబా చూపిన కరుణ
2. సందేశం ద్వారా చెప్పినట్లే నయం చేసిన బాబా
బాబా చూపిన కరుణ
సాయిబందువులందరికీ నమస్కారం. నా పేరు ఉమ. మాది కర్నూలు. మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాత చాలా గొడవలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. దాంతో మా వదిన మా ఇంటికి రానని వెళ్ళిపోయింది. మా ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాము. నేను రోజూ ఏడుస్తూ బాబా గుడికి వెళ్లి అర్చన చేయిస్తుండేదాన్ని. సంవత్సరం తర్వాత అన్నయ్యకి కొడుకు పుట్టాడు. అప్పటివరకు మా ఇంటికి అస్సలు రానన్న మా వదిన డెలివరీ అయిన 3 నెలలకి మా ఇంటికి వచ్చింది. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం.
ఒకసారి నేను నాకు ఉద్యోగం రావాలని 'నవగురువార' వ్రతం చేసాను. పూజ నేను చేస్తే, ఐదో వారం లోపు మా అన్నకి ఆర్మీ ఉద్యోగం వచ్చింది. కారణం మా అన్న కూడా ఉద్యోగం లేదని బాధపడుతుండేవాడు. తనకైనా ఉద్యోగం వచ్చినందుకు మేము చాలా సంతోషించాము.
తరువాత నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు మార్కులు ఎంటర్ చేసే చోట ఎన్నిసార్లు ఎంటర్ చేసినా ఏదో ఎర్రర్ చూపిస్తుండేది. ఆ సమస్య గురించి నేను నా స్నేహితులను అడిగితే, వాళ్ళు పరిష్కారం చెప్పారు. కానీ నాకు అది అర్థం కాలేదు. అందువల్ల నేను బాబాను, "సహాయం చేయమ"ని అడిగి మళ్ళీ మార్కులు ఎంటర్ చేశాను. బాబా దయవల్ల నేను అప్పుడు ఏ సమస్యా లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేయగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకసారి మా అమ్మమ్మ గొంతునొప్పితో బాధపడింది. అప్పుడు నేను ఊదీ బాబా గొంతు వద్ద తాకించి, "నొప్పి తగ్గించు బాబా" అని బాబాని వేడుకుంటే అమ్మమ్మకి నొప్పి తగ్గింది. ఇలా చాలాసార్లు బాబా ఊదీ మహిమ నాకు తెలిసింది. రోజూ బాబా ఊదీ వాడడం వల్ల ఎలాంటి రోగాలు రావని నా జీవితంలో ఋజువైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను మీకు చాలా ఋణపడి ఉన్నాను".
సందేశం ద్వారా చెప్పినట్లే నయం చేసిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వము. సాయి లేకుండా ఒక అరసెకెండ్ కూడా నేను ఉండలేను. సాయితండ్రి నాకు ఎన్నో అద్భుతాలు చూపించారు. వాటిలో నుండి ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నా ఎడమ చేతి మోచేతి దగ్గర చర్మం లోపల వాపు వచ్చింది. అక్కడ కొంచెం నొప్పి కూడా ఉంది. నాకు చాలా అంటే మాటల్లో చెప్పలేనంత భయమేసింది. ఈ వాపు ఏంటని ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. వాటిలో పడి నాకు బాబాని ఏం అడగాలో కూడా అర్థం కాలేదు. నా భర్తకి చూపిస్తే, "అదేంటో, హాస్పిటల్లో చూపించాలి" అన్నారు. అది విని హాస్పిటల్లో ఏమంటారో అని నాకు మరింత భయమేసింది. నేను ఏడుస్తూ 'బాబానే కదా! వైద్యులకు వైద్యుడు. ఆయనని మించిన డాక్టర్ ఎవర'ని ఆయన్నే ప్రార్థించసాగాను. కానీ కొన్నిసార్లు నా భయం బాబాపై నా నమ్మకాన్ని అధిగమించేది. నేను అంతలా భయపడుతుండేదాన్ని. మా అమ్మతో విషయం చెప్తే, "ఏం కాదు. మనకి బాబా ఉన్నారు కదా! ఏం ఆలోచంచకు, తగ్గిపోతుంది" అని చెప్తుండేది. నా భర్తకి తన ఉద్యోగంలో బాబా చాలా అద్భుతాలు చూపిస్తుండేవారు. ఆయన వాటిని నాతో పంచుకుంటుండేవారు. నేను ఆయనతో నా గురించి ఒకసారి బాబాను ప్రార్థించమని చెప్పాను. ఆయన అలాగే చేసారు. 5 రోజుల వరకు వాపులో ఎటువంటి మార్పు లేదుగాని నొప్పి తగ్గింది. నేను రోజూ రాత్రి వాపుపై ఊదీ రాస్తూ ‘సాయినాథ రక్ష’ అని అనుకుంటూ పడుకునేదాన్ని. మరుసటిరోజు ఉదయం వాపు తగ్గిందా అని చూసేదాన్ని. అలాగే బ్లాగులో భక్తుల అనుభవాలు చదివేదాన్ని. అవి చదివాక నాకు చాలా ధైర్యం వచ్చేది. ఒకరోజు ఉదయం బాబాతో, "నాకు తగ్గితే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. అప్పుడు బాబా నాకు, "ఎలాంటి గడ్డైనా అదే తగ్గిపోతుంది" అని సందేశం ఇచ్చారు. అంతే, 4-5 రోజులకి వాపు తగ్గడం మొదలై 2023, నవంబర్ 16 నాటికి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మా బాబుకి బాగా ఎక్కువగా ఉన్న దగ్గుని కూడా తగ్గించారు బాబా. 'సాయీ' అని పిలిస్తే తప్పక పలుకుతాడు నా తండ్రి. "నాపై భారం వేయండి. నేను మోస్తాను" అన్న తమ మాట నిజమని ఋజువు చేసిన సాయినాథునికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సాయినాథుని చల్లని నీడలో అందరమూ చల్లగా ఉందాం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సమర్థు సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
ఓం సాయి రామ్ గురుదేవ మహా ప్రబో సాయినాథ నాలో సర్వగొట్టి రోగాలు సర్వకోటి దోషాలు సర్వకోటి పాపాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసే రచయి తండ్రి గొడవలు ఏ నిందలు ఏ అబద్ధాలు ఏ జాడీలు లేకుండా మనస్పూర్తిగా నివర్తనను భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్లలో చూడు తండ్రి నా కుటుంబ పరిస్థితి నా మనసుతో నా వయసును దృష్టిలో పెట్టుకొని ఒకసారి నా స్థానంలో ఉండే ఆలోచన నా జీవితం నీ చేతిలో ఉంది
ReplyDeleteOm sai ram ma sister ki Hyderabad lo job vachindi ani confirm chayandi thandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDelete🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please baba
ReplyDeletesai baba, maa sai madava bharam antha meede baba.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sainathaya Namah
ReplyDeleteBaba please bless and save me my baby.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా నా గర్భాన వున్న శిశువును కాపాడు తండ్రి.... ప్రసవం బాగా జరిగి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలూ, వైకల్యాలు లేకుండా పుట్టాలి... చక్కని ఆయుష్షు ప్రసాదించు...heartbeat లేదు అంటున్నారు కానీ నీ దయ వల్ల అంతా మంచి జరగాలి.. heartbeat చక్కగా స్టార్ట్ అవ్వాలి,growth బాగుండాలి..please baaba కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteJai Sai omsai Sri Sai kaadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete