1. ఊహించని రీతిలో అనుగ్రహించిన బాబా2. నా తండ్రి బాబా అనుగ్రహం
3. ఊదీ మహిమ
ఊహించని రీతిలో అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా పరిచయం కాకముందు మాకు ఏ రకంగానూ కలిసి రాలేదు. ఒకరోజు నా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య "బాబాని పూజించుకోమ"ని చెప్పి మొదటిసారి బాబా గుడికి తీసుకొని వెళ్ళింది. ఇక అప్పటినుంచి మాకు అంతా కలిసి వచ్చింది. మా పిల్లలు చదువులు పూర్తి చేసుకొని జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. మా అబ్బాయి తన కుటుంబంతో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. మా అమ్మాయి, మా అబ్బాయి, కోడలు అందరూ బాబా భక్తులే. బాబా దయవల్ల అందరమూ సంతోషంగా ఉన్నాము. ఇకపోతే, బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.
నా తండ్రి బాబా అనుగ్రహం
నా సాయి తండ్రికి, సాయిబంధువులకు వందనాలు. నా పేరు లలిత. నేను కర్నూల్‌లో ఒక వెల్నెస్ కోచ్‌ని. అంటే ఆరోగ్యం బాగుండటానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఆ విధంగా ఒక సంవత్సరం నుంచి ప్రతినెల ఒక ఇద్దరు, ముగ్గురికి సహాయం చేస్తున్నాను. అయితే 2023, సెప్టెంబర్ నెలలో ఒక్కరికి కూడా సహాయం చేయలేకపోయాను. అందువల్ల నాకు ఏదోలా అనిపించి అక్టోబర్ నెల మొదటి వారంలో నేను బాబాని, "బాబా! ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. నా స్టేటస్ చూసి ఎవరో ఒకరు నాకు కాల్ చేసి సహాయం అడగాలి. ఇది ఖచ్చితంగా జరగాలి బాబా. ప్లీజ్ జరిపించండి" అని వేడుకున్నాను. బాబా దయ చూపించారు. మరుసటిరోజు ఉదయం ఒక ఆమె, 'నాకు మీ సహాయం కావాలి' అని నాకు మెసేజ్ చేశారు. దాంతో నేను ఆమెకి ఆరోగ్యం గురించి మంచి అవగాహన కల్పిస్తున్నాను. నిజానికి ఆమె ఆరు నెలలుగా నన్ను ఫాలో అవుతూ, నన్ను సహాయం అడుగుదామని అనుకుంటూ కూడా అడగలేకపోయారట. అలాంటిది నేను బాబాని అడిగిన మరుసటిరోజే అడిగారంటే అది నా తండ్రి అనుగ్రహమే కదా! "నా మీద కరుణ చూపించినందుకు ధన్యవాదాలు సాయి. ఎప్పుడూ ఇలానే నా మీద, నా కుటుంబం మీద మీ చల్లని చూపులు, దయ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ. మీకు శతకోటి వందనాలు బాబా".
ఊదీ మహిమ
సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు కల్పన. మాది హైదరాబాద్. నేను నా గత అనుభవంలో 'ఎవరైనా గట్టిగా మాట్లాడితే నా తలలో నరాలు కదిలిపోతున్నట్లుండేదని, అప్పుడు నేను, "బాబా! రోజుకు మీ పాటలు తొమ్మిది పాడుకుంటాను స్వామి" అని అనుకున్నానని, బాబా నా మనసులో భావాలను కల్పించి నా చేత సుమారు 25 చక్కని పాటలు వ్రాయించారని, వాటిని పాడుకున్నంతనే వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుందని, అలా బాబా దయతో నా ఆరోగ్య పరిస్థితి మెరుగైంద'ని పంచుకున్నాను. తర్వాత కూడా నేను బాబా దయతో పాటలు పాడుకుంటూ ఉంటున్నాను. అయితే ఈమధ్య ఎక్కువగా ఉద్రేకపడినా, గట్టిగా మాట్లాడినా తలలో నరాల కదలిక ఎక్కువగా ఉంటుండేది. అప్పుడు నేను భయంతో బాబా ఊదీ రాసుకున్నాను. దాంతో బాబా దయవల్ల నాకు ఆ బాధ తగ్గింది. ఇంకోసారి ఛాతి వెనుక భాగంలో నొప్పి అనిపించినప్పుడు, మరోసారి కంటి దగ్గర నొప్పి వచ్చినప్పుడు కూడా ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల నా ఛాతి వెనక నొప్పి, కంటి నొప్పి తగ్గిపోయాయి. బాబా ఊదీ మహిమ గలదని, ఏ నొప్పినైనా తగ్గిస్తుందని, బాధలను నివారిస్తుందని చరిత్రలోనే కాదు ఇప్పుడు కూడా నిరూపణ అయింది. "సాయినాథునికి శతకోటి వందనాలు, సర్వజనులను మీరు కాపాడుతారని ఆశిస్తున్నాను తండ్రీ".
Niku na midha jaali kalagadha sai
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan ki marriage chai thandri
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteBaba, take care of my son 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeletesai baba, maa madava bharam anta meede baba, eeroju hindi exam anni questions answers raselaga madava ki shakti ni evvandi baba, alage madava kosam chese homam, japalaku maavaru nenu vachhi chestanu ani ayana vachhi cheste naa anubhavanni ee blog lo panchukuntanu baba. maavaru tappakunda vastanu ani eeroje anali baba, mee daya valana, tammudiki oka thoduni kuda evvavalasinadi baba
ReplyDeleteBaba ee kastam nundi nannu twaraga bayataki vachela cheyandi please nenu thattukolekapothunna ee tension bayam nannu manasikam gaa champesthunnayi....chala kangaru bayam vesthundi.... meru natho vunnaru ani rujuvu ayina chupinchandi Naku kastha dariyam gaa vuntadi....prathi month edola gadusthundi kani bayam matram ekkuva ayipothundi.... please baba🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Omsairam om Sri sainathaya namah
ReplyDeleteSainathaya namaha
Om Sri Sai nathaya namaha
Swamy Naku Sandhya ki vivaham ayela chudu swamy
Na anubhavani Mee blog lo punchukuntanu om Sri sainathaya namaha
Baba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm sri sairam 🙏
ReplyDelete