సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1702వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తదయాళువు సాయినాథుడు
2. వెర్టిగో సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

భక్తదయాళువు సాయినాథుడు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! భక్తదయాళువైన సాయినాథుని పాదపద్మములకు శతకోటి వందనాలతో భక్త పరమాణువైన అమరనాథ్ అనే నేను నా అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు  చాలా ఆనందంగా ఉంది. నేను బాబాను మనస్పూర్తిగా చంద్రబాబునాయుడుగారిని జైలు నుండి బంధవిముక్తుణ్ణి చేయమని వేడుకున్నాను. నాలాగే ఎంతోమంది వేడుకొని ఉంటారు. బాబా దయవల్ల అతను విడుదలయ్యారు. అతనికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను.

మా బాబు అమెరికాలోని మిస్సోరీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. తను సెలవు దినాల్లో అట్లాంటాలో పార్ట్ టైం జాబ్ చేసి 42,000 డాలర్లు సంపాదించాడు. మన ఇండియాలో లాగా అక్కడ డబ్బులు నేరుగా తీసుకు రాకూడదు. అందుచేత ఏం చేయాలో తెలియక బాబు చాలా బాధపడ్డాడు. నేను బాబాని, "ఆ డబ్బు ఏ ఇబ్బంది లేకుండా బాబుకి అందేలా చేయమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక రెండునెలల తర్వాత ఒక ప్రైవేట్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా డబ్బులు మా వాడి చేతికి వచ్చాయి. బాబానే దారి చూపించి ఏ కష్టమూ లేకుండా చేసారు.

ఒకసారి నేను పనిచేసే కంపెనీలో మిషనరీ అద్దెకి ఇచ్చినవాళ్ళు కిరాయి డబ్బులు కోసం కంపెనీ మెయిన్ గేటు వేసి గొడవ చేశారు. హెడ్ ఆఫీసువాళ్ళు ఇంకా టైం పడుతుందంటే, వాళ్ళు  డబ్బులు ఇస్తేనే పనిచేస్తామని గొడవగొడవ చేసారు. ఆ స్థితిలో నేను బాబాని శరణువేడాను. అంతే, 10 నిమిషాల్లో యూనియన్‌వాళ్ళు పనిచేయటానికి ఒప్పుకున్నారు. తర్వాత నాలుగు రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందాయి.

నేను తరచూ నడుము నొప్పితో బాధపడుతుంటాను. ఒకసారి నొప్పి వచ్చిందంటే కనీసం 15 రోజులు నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే 2023, అక్టోబర్ నెలలో చాలా తీవ్రంగా నొప్పి వచ్చినప్పుడు మాత్రం కేవలం మూడు రోజుల్లోనే నేను పనిలోకి వెళ్లగలిగాను. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మీరే నా బలము, బలహీనత. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడు తండ్రీ. అలాగే నా మది కోరిక నెరవేర్చు తండ్రీ. మీ చరణములకు నమస్కారములతో మీ భక్తుడు..".


వెర్టిగో సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నాకు ఏ చిన్న బాధ వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, మనసు బాగుండకపోయినా నేను సాయినాథుని తలుచుకొని ఊదీ పెట్టుకుంటాను. వెంటనే నాకు ఉపశమనం లభిస్తుంది. ఒక సంవత్సరం క్రితం నాకు వెర్టిగో సమస్య వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడొకరోజు సాయినాథునికి నమస్కరించి, "ప్రతి గురువారం సాయి సచ్చరిత్ర చదువుతాను. నాకొచ్చిన ఈ వెర్టిగో సమస్యను తగ్గించు తండ్రీ. ఆ సమస్య తగ్గితే మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించి సచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. నెలలో సమస్య చాలావరకు తగ్గి క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. నాకు సర్వమూ నీవే తండ్రీ. ఎప్పుడూ ఇలానే కాపాడు తండ్రీ".


15 comments:

  1. Om Sairam nakuu job eppinchandi sai

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. sai baba maa sai madava bharam antha meede. eeroju social exam , madavaki exam baaga raase shaktini ivvandi baba. sunday memu andaram velli homa karyakramamu chesenduku maavaru, maa attagaru vappukonetattu cheyandi baba, nenu ee blog lo panchu kuntanu baba, tammudiki kuda oka thoduni chusipettu baba

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  6. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please..38weeks tharavtha delivery ayyi nenu na baby healthy ga intiki ravali thandri please baba

    ReplyDelete
  7. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  9. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  10. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Om Sri Sai Ram kapadu tandri 🙏

    ReplyDelete
  12. Baba please ma papa stomach pain taginchu baba🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo