- జాగ్రత్తగా చూసుకున్న బాబా
- బాబాకి చెప్పుకున్నంతనే అందిన డబ్బులు
జాగ్రత్తగా చూసుకున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు నా నమస్కారాలు. నాపేరు సంధ్య. శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకుంటున్నాను. 2023, సెప్టెంబర్ నెలలో మావారు గోవా వెళదామని నిర్ణయించి, అక్టోబర్ 2న వెళ్ళడానికి మా పిలలతో కలిసి ప్లాన్ చేసి విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేశారు. అప్పుడు నేను బాబా ఫోటో ముందు నిల్చోని, "బాబా! గోవా టూరు, విమాన ప్రయాణం. మీరు మాకు తోడుగా ఉండి విజయవంతం చేయండి. అలాగే సర్వాంతర్యామి అయిన మీరు మా ఇల్లు కూడా చూసుకోండి. మీ అపార ప్రేమను బ్లాగు మాధ్యమంగా సాటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తర్వాత అక్టోబర్ 2వ తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నేను మెలకువలో ఉండగానే బాబా నాతో ఏదో మాట్లాడుతున్నట్లు దర్శనమిచ్చారు. బాబా ఏం మాట్లాడారో నాకు వినపడలేదుగానీ ఆయన దర్శనమే పెద్ద శుభసూచకమని సంతోషించాను. ఆ ఆనందంలోనే నేను బ్యాగులు సర్దాను. తర్వాత అందరం సంతోషంగా బాబాకి నమస్కరించి ఆయన కూడా మాతోపాటు వస్తున్నారన్న భావనతో విమానాశ్రయానికి బయలుదేరాం. తర్వాత నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, అక్కడ "ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమాని నేనే" అని సాయి వచనం వచ్చింది. అది చూసి బాబా ప్రేమకు ఆనందభరితురాలినయ్యాను. విమానాశ్రయంలో అడుగుపెట్టగానే సాయితండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే, విమానాశ్రయాన్ని, విమానాన్ని దగ్గర నుండి చూడటం అదే మొదటిసారి. విమానంలో కూర్చున్నప్పుడు నా పిల్లలు, నేను, మావారు చాలా సంతోషించాము. ఆ సంతోషంలో మరోసారి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కారణం విమాన ప్రయాణం చేసే అర్హత బాబా ఆశీర్వాదమే కనుక. మా పక్క సీటు ఖాళీగా ఉండటంతో అందులో బాబా కూర్చున్నారని భావించాను. బాబా దయతో మొదటిసారి విమాన ప్రయాణం చేసి ఎంతో ఆనందంగా సురక్షితంగా గోవా చేరుకున్నాము. ఆ రాత్రి రూమ్ కోసం వెతకగా బాబా దయవల్ల చక్కటి లగ్జరీ రూమ్ దొరికింది. రాత్రి పది గంటల వరకు సముద్రతీరాన సరదాగా గడిపి రూముకు చేరుకున్నాము. ఉదయానే ‘రాత్రి సముద్రం చూసాను, ఉదయం ఎలా ఉంటుందో’ అని సంతోషంగా మళ్ళీ బీచ్‌కి వెళ్లి నేను, మావారు, పిల్లలు ఎంతో సరదాగా, ఆనందంగా గడిపాము. మొదటిసారి సముద్రాన్ని చూసిన ఆనందంలో నేను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత అదేరోజు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు కొన్ని చూసాం.
మర్నాడు బ్రహ్మీముహూర్తంలో మెలకువలో ఉండగా బాబా నాకు ఒక దృశ్యం చూపించారు. ఆ దృశ్యమందు నేను సముద్రతీరాన నిల్చొని సముద్రాన్ని చూస్తుంటే, అక్కడ సముద్రం లేదు. సముద్రానికి బదులుగా ఒక అందమైన శిరిడీసాయి మందిరం పైనున్న బంగారు శిఖరం నాకు కనిపిస్తుంది. అది చూసి నేను ఎంతో ఆనందం పొందాను. ఆ దృశ్యం ద్వారా 'బాబా నాతోనే ఉన్నారు, అణువణువునా నిండి ఉన్నారు. అంతటా ఉన్నారు. అన్నిట్లోనూ ఉన్నారు. విశ్వమంతా వ్యాపించిన ఉన్న ఆ విశ్వేశ్వరుడే సాయి' అని భోదించారని అనిపించింది. ఆ దృశ్యాన్ని చూపిన సాయితండ్రికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత గోవా నుండి తిరుగు ప్రయాణమయ్యే రోజున బాబా మళ్ళీ ఒక దృశ్యాన్ని చూపారు. ఆ దృశ్యంలో ఒక బాబా గుడి ఉంది, బాబా ఏదో మాట్లాడుతున్నారు. నేను బాబాను చూస్తూ గుడి దాటేశాను. అంతటితో ఆ దృశ్యం పూర్తైంది. శుభశకునంగా భావించి గోవా ప్రదేశాలకి థాంక్స్ చెపుతూ గోవా విమానాశ్రయానికి బయలుదేరాను. బాబా ఆశీర్వాదంతో సురక్షితంగా, ఆనందంగా తిరిగి మా ఇంటికి చేరుకున్నాము. గోవా వెళ్లేముందు నేను చేసిన ప్రార్థనలను కరుణతో విన్న బాబా అక్కడ గోవాలో మాకు ఇబ్బంది లేకుండా చేసుకోవడంతోపాటు ఇక్కడ మా ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నారు. "బాబా! మీ ప్రేమకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియట్లేదు. ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యం పాలైన మమ్మల్ని అక్కున చేర్చుకుని పూర్వం కన్నా వైభవంగా మా జీవితాలను మార్చిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? మీ ప్రేమను అనుభవించటం తప్ప మాటలకందని ఆ అనుభూతి గురించి ఎలా వ్రాయగలం? ఇప్పుడు మేము జీవిస్తున్న జీవితం మీరు పెట్టిన భిక్ష. అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేలవేల కృతజ్ఞతలు. మీ పాదాలే మాకు శరణం సాయి”.
సద్గురు చరణం భవభయ హరణం సాయినాథ శరణం!!!
బాబాకి చెప్పుకున్నంతనే అందిన డబ్బులు
నేను ఒక సాయి భక్తురాలిని. ఒక సంవత్సరం నుండి మేము ఆర్ధికంగా చాలా బాధల్లో ఉన్నాము. మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఒకరు మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టారు. ఆ సమయంలో ఈ బ్లాగు నా కంటపడింది. అప్పటినుండి మేము రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ ఉండేవాళ్ళము. చివరికి ఒకరోజు నేను, "మాకు రావలసిన డబ్బులు వస్తే, మీ అనుగ్రహం ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. అంతే, మాకు రావలసిన డబ్బులు వచ్చాయి. బాబా నిజంగా వెంట ఉండి కాపాడుతారు. "కృతజ్ఞతలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai Baba.... 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteగురుదేవ మహాప్రభో సాయినాథ సర్వకోటి రోగాలు నా సర్వకోటి పాపాలు సర్వకోటి దోషాలు తొలగించి నేను నా భర్త కలసి కాపురం చేసేటట్లు చేయి తండ్రి సాయినాథాయ కోర్టు కేసులో కూడా వలి అవమానాలు అబద్ధాలు చాణీలు నిందలు లేకుండా నా భర్త నన్ను అర్థం చేసుకొని మనస్పూర్తిగా భాయ్ గారు స్వీకరించి కాపురానికి తీసుకెళ్ళినా చూడు తండ్రి నా కన్నుల్లో దాంపత్యాన్ని ప్రసాదించు సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, we are coming Shirdi for your Divya Darshan. Please bless us.
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteOm sa i ,ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ReplyDeleteBaba maku finance doriki munduki vellela laga chudandi please.....memu vunna situations nundi bayataki vachi maa projects anni complete ayyela cheyandi baba....evaru mammalni ebbandi pettakunda mere venaka vundi nadipinchandi please
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sairam
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba.meere kapadali baba.
ReplyDeleteఆర్థికంగా చితికిపోయిన మమ్మల్ని అక్కున చేర్చుకుని పూర్వం కన్నా వైభవంగా మా జీవితాలను మార్చిన మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? మీ ప్రేమను అనుభవించటం తప్ప మాటలకందని ఆ అనుభూతి గురించి ఎలా వ్రాయగలం? ఇప్పుడు మేము జీవిస్తున్న జీవితం మీరు పెట్టిన భిక్ష. అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేలవేల కృతజ్ఞతలు. మీ పాదాలే మాకు శరణం సాయి”.
ReplyDelete