1. సాయికి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!2. అడిగినంతనే స్థలం అమ్ముడైపోయేలా దయ చూపిన బాబా
సాయికి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!
ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను ఇదివరకు 'సాయి భక్తుల అనుభవమాలిక 1579 & 1642లలో నా అనుభవాలు పంచుకున్నాను. సాయి దయవల్ల నాకు చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.
2023, సెప్టెంబరు 15న నేను నా కారు పార్క్ చేస్తున్నప్పుడు పొరపాటున నా కారు వేరే కారు వెనక వైపు గుద్దింది. నేను వెంటనే కారు దిగి అతనికి సారీ చెప్పి, "రిపేర్ చేయిస్తాన"ని చెప్పాను. అతను నా కారు ఫోటో, ఫోన్ నంబర్ తీసుకొని ఒక రెండు రోజులు తర్వాత 2000 డాలర్లు(ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1 లక్ష రూపాయలు) ఖర్చు అవుతుందని చెప్పాడు. నేను అది విని నిర్ఘాంతపోయి, "అంత మొత్తం అంటే నాకు చాలా కష్టం. నాకు వచ్చే జీతం నా కుటుంబానికి సరిపోతుంది" అని చెప్పాను. అందుకతను, "నాది కొత్త కారు. రిపేర్ చేయించు" అని అన్నాడు. నేను ఇంకేమీ చెప్పలేక సరేనని నా మనసులో, "బాబా! ఈ కష్టం నుండి బయటపడే మార్గం నువ్వే చూపు తండ్రీ. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. సుమారు 45 రోజుల తర్వాత 2023, నవంబర్ ౩న అతను 'నేను ఒక షాపులో కారు పెయింట్ కొన్నాను. నేనే వేసుకుంటాను. అంతా సెట్ అయిపోతుంది' అని మెసేజ్ పెట్టాడు. కాసేపు నాకు అసలు అది నిజమో, మాయో అర్దం కాలేదు. తర్వాత బాబానే అతని మనసు మార్చారనుకొని, 'నేను ఏమైన సహాయం చేయనా?' అని మెసేజ్ చేసాను. తను 'ఏమీ వద్దు అండి. నేను చూసుకుంటాను. ఇవన్నీ మామూలే. డోంట్ వర్రీ' అని బదులిచ్చాడు. అప్పుడు నేను, 'పెయింట్ కొన్నారు కదా! ఎంతైంది?' అని అడిగితే, '23 డాలర్ల'ని బదులిచ్చాడు. 'మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. నేను ఆ డబ్బులు చెల్లిస్తాను' అని అన్నాను. అతను, 'నో ప్రాబ్లమ్ అండి. ఆల్ గుడ్' అని బదులిచ్చాడు. ఎక్కడా 2000 డాలర్లు? ఎక్కడా 23 డాలర్లు? ఇది అంత బాబా నా మీద చూపిన ప్రేమ. ఆయనకి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారమవ్వాల్సిందే!
2022, ఆగస్టులో నేను ఒక అతనికి కొంత డబ్బిచ్చాను. తర్వాత నేను ఎన్నిసార్లు అడిగినా అతను ఇస్తానని చెప్తుండేవాడు కానీ, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు. అలా ఒక సంవత్సరం దాటింది. ప్రతినెలా వడ్డీ చెల్లించడానికి నాకు కష్టంగా ఉండటంతో, "బాబా! మీరే ఆ డబ్బు నాకు తిరిగి ఇప్పించాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. 2023, నవంబర్ 4న అతను మొత్తం డబ్బు నాకు పంపించాడు.
గత సంవత్సరమొకసారి, ఈ సంవత్సరమొకసారి మొత్తం రెండుసార్లు నాకు ఫిస్టులా ఆపరేషన్ అయింది. 2023, సెప్టెంబర్ 29న వేడి చేసి ఆ ప్రదేశంలో ఏదో చిన్న గడ్డలా వచ్చింది. అప్పుడు నేను బాబాతో, "ఇది తొందరగా తగ్గిపోవాలి బాబా" అని చెప్పుకొని ఆయన మీద భారమేసి మందు తీసుకున్నాను. కొన్ని రోజులకి ఆ గడ్డ తగ్గిపోయింది. తర్వాత ఈమద్య నా ఆరోగ్యం సరిగ్గా లేకుంటే బాబాతో, "నా ఆరోగ్యం బాగుండేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మనం బాబాని అడగటం ఆలస్యం అన్నీ ఇస్తారు. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
అడిగినంతనే స్థలం అమ్ముడైపోయేలా దయ చూపిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. మాది విజయవాడ. నా చిన్నతనం నుండి శ్రీసాయి నాతో ఉన్నారు. ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మాకు చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నాయి. వాటినుంచి బయటపడటానికి మేము చాలా నలిగిపోతుండేవాళ్ళము. మా ఇంటి ముందు మాకున్న ఒక స్థలం అమ్మేస్తే మా పరిస్థితి మెరుగు పడుతుందని చాలామంది చెప్పారు. దాంతో నేను ఆ స్థలం అమ్మటానికి 4, 5 సంవత్సరాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాగాని ఏదీ కలిసి రాలేదు. దానికి తోడు నా భర్త కూడా ఆ స్థలం అమ్మటానికి ఇష్టపడేవారు కాదు. అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా! అందుచేత నేను చివరికి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని అయిన బాబాను శరణువేడాను. ఆయన క్వశ్చన్ & ఆన్సర్ సైటు ద్వారా నాకు ధైర్యం చెప్పి నాకు అండగా నిలిచారు. బాబా దయతో మా స్థలం అమ్ముడైపోయింది. కానీ నా సమస్యలు ఇంకా తీరలేదు. అయినా నా సాయి ఉన్నారు. ఆయన సమస్యలన్నీ తొలగిస్తారు. సర్వకాల, సర్వ అవస్ధలందు నాతోనే ఉండి నన్ను నడిపిస్తారు. "తండ్రీ సాయినాథా! నువ్వే నా సర్వం".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteఓం సాయిరాం సాయి ఏ కోర్టు కేసులు అవమానాలు చాడీలు అబద్ధాలు ఏమీ లేకుండా నా బర్తడే మార్పు తీసుకురా సాయి కోర్టు కేసు మొదలుకొని ముందు తను మారి నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాయి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు బాబా సాయి నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు తండ్రి
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya namaha 🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba. eeroju maths exam madava baaga rasenduku meeru sahayam cheyandi baba. alage maa tammudiki kuda oka thoduni chaPINCHU BABA. alage edaina property konelaga chupinchu baba. madava dabbulu adagakunda chudu baba.
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri complications lekunda chudu baba please safe delivery chei baba please
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDelete