సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1714వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా చేయి పట్టుకుంటే చాలు - అంతా సెట్ అయిపోతుంది

నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈమధ్యనే ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడం ప్రారంభించాను. నిజంగా ఇది అద్భుతమైన బ్లాగు. భక్తుల అనుభవాలను తెలుగులో ప్రచురించడం చాలా బాగుంది. నాకు 2015లో పెళ్లైంది. పెళ్లికి ముందు నా భర్త మా ఊరిలోని బాబా గుడికి వచ్చి నాతో మాట్లాడారు. అలా బాబా గుడిలో మేము ఒకరి గురించి ఒకరం తెలుసుకుని పెళ్ళికి ఒప్పుకున్నాము. అతను నేను అప్పటికే ఇండియాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమని చెప్పారు. అయితే నేను రాజీనామా చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. కానీ నా భర్త నన్ను రాజీనామా చేయమని బలవంతం చేసారు. నేను రాజీనామా ఇచ్చి మా అమ్మని బాధపెట్టలేక చాలా కష్టపడ్డాను. ఎలాగోలా పెళ్ళైయ్యేవరకు ఉద్యోగం చేసి, పెళ్లైయ్యాక నా భర్త మాట వినాలి కాబట్టి చివరికి రాజీనామా ఇచ్చి నా భర్తతో కలిసి యుఎస్ఏకి వచ్చాను. నేను సంతోషంగా ఉంటే మా అమ్మ కూడా సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను కోరుకున్నట్లు అంతా జరగలేదు. నాకు మద్యపానం తాగేవాళ్లంటే ఇష్టముండదు. అలాంటిది పెళ్లైయ్యాక నా భార్య మద్యపానం సేవిస్తారని తెలిసింది. అతను వారాంతాల్లో బాగా ఎక్కువగా తాగేవారు. నేను చాలా బాధపడుతూ కొన్నిసార్లు బాబా ముందు ఏడ్చేదాన్ని. ఒక్కోసారి తట్టుకోలేక బాబాని నిందించేదాన్ని. "నన్ను క్షమించండి బాబా. ఆ సమయంలో మీ విలువ నాకు తెలియదు".

పెళ్ళైన 3 నెలలకి నేను గర్భవతినయ్యాను. నిజానికి అంత తొందరగా గర్భం దాల్చడం నా భర్తకి ఇష్టం లేదు. కానీ మా తల్లిదండ్రుల, మరికొంతమంది ఒత్తిడి వల్ల నేను నా భర్తను ఒప్పుకోమని బలవంతపెట్టాను. ఆతను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను సరిగా చూసుకునేవాడు కాదు. నేను ఒంటరిగా ఏడ్చేదాన్ని. మా ఇంటి పక్కనుండే బాబా భక్తులొకరు నన్ను నొప్పులు మొదలయ్యే ముందు బాబా గుడికి వెళ్ళమని సలహా ఇచ్చారు. నేను ఆ సలహాను పాటించాలని అనుకున్నాను. అందువల్ల కాన్పు సమయం సమీపించి నాకు నొప్పులు మొదలైనప్పుడు ముందు బాబా గుడికి వెళదామని బయలుదేరాము. కానీ నిమిషాల్లో వాతావరణం మారిపోయి భారీ వర్షం కురువసాగింది. ఆ వర్షంలో బాబా గుడికి వెళ్లలేకపోయాము. అంతలో ప్రసవ నొప్పులు కూడా అధికమవుతున్నట్లు అనిపించడం వల్ల హాస్పిటల్ వైపుగా మళ్ళాము. హాస్పటల్‌కి చేరుకున్నాక నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హఠాత్తుగా నా కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ చాలా తగ్గడంతో నన్ను వెంటనే అత్యవసర వార్డుకి తీసుకెళ్లి నాకు అనస్థీషియా ఇచ్చారు. దురదృష్టవశాత్తు నా బిడ్డ చనిపోయింది. ఇది నాకు పెద్ద షాక్. చివరి క్షణాలో బాబా నన్ను తమ దర్శనానికి అనుమతించలేదని బాధపడ్డాను. అప్పటి నా బాధను వివరించడానికి మాటలు లేవు. వైవాహిక జీవితం బాగా లేదు, బిడ్డను కోల్పోయాను, వృత్తి జీవితాన్ని వదులుకున్నాను. ఇక నా జీవితం ఎలా ఉండబోతుందో తెలియదు. జీవితంపై అన్ని ఆశలు కోల్పోయాను. అట్టి స్థితిలో నా భర్త నన్ను ఇండియాకి వెళ్లిపొమ్మని చెప్పాడు. తన నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. నేను అక్కడికి వెళ్లి బంధువులను ఎదుర్కోలేనని చాలాసార్లు చెప్పి చూసాను. కానీ అతను వినలేదు. నాకు వేరే దారి లేక నా బిడ్డకు బదులు ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోలేదని బాధపడ్డాను. చివరికి తప్పనిసరై ఇండియాకి ప్రయాణమయ్యే ముందు నేను బాబా గుడికి వెళ్లి, "బాబా! నా జీవితంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నేను మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ దర్శిస్తానో, లేదో నాకు తెలీదు. నా భర్త విడాకులు ఇవ్వబోతున్నారేమో కూడా తెలీదు. సమస్తం మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాకు ఏ కోరికా లేదు, ఆశా లేదు" అని ప్రార్థించి ఇండియాకి వెళ్ళిపోయాను. అలా 2016 - 2017 మధ్యకాలంలో నా జీవితం పూర్తిగా తిరోగమన దిశలో సాగింది. నేను ఆ సమయంలో ఎన్నో కష్టాలు చవిచూశాను.

ఇండియా వచ్చాక నేను బాబా చేయి దృఢంగా పట్టుకున్నాను. ఒక్క నెలలో ప్రతిదీ సెట్ అయింది. బాబా నెమ్మదిగా నా జీవితాన్ని మార్చారు. మెల్లగా నా భర్తను మార్చి నా వైవాహిక జీవితాన్ని కాపాడారు. నాకు ఒక ఉద్యోగం ప్రసాదించారు. బాబా ఆశీర్వాదంతో నేను మళ్ళీ గర్భవతినయ్యాను. ఆ సమయంలో బాబా నాకు చాలా బలాన్ని ఇచ్చారు. ఆయన కన్న తల్లిదండ్రుల్లా నన్ను చూసుకున్నారు. చివరకు బాబా దయతో 2018లో నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. నేను ఎల్లప్పుడూ సాయి నామాన్ని జపించాలనుకుంటున్నందువల నా కొడుకుకి సాయితో మొదలయ్యేలా పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నా జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషం వచ్చినా లేదా ఇంకేదైనా వచ్చినా మొదట నా మదిలో మెదిలేది బాబానే. ఆయన నాకు సర్వస్వం, ఆయనే నా తల్లి, తండ్రి, గురువు, ఇంకా ఏ బంధమైనా. ఆయన ఒక కుటుంబసభ్యునిలా నాతో ఉంటున్నారు. ఆయన ఇచ్చిన "నేను ఇక్కడ ఉండగా మీకు భయమెందుకు?" అన్న హామీ నన్ను చాలాసార్లు రక్షించింది. ఈ కలియుగంలో ఎవరు మనల్ని అంతలా చూసుకుంటారు? మన ప్రియమైన, దయమయుడైన గురువు సాయిబాబా కంటే వేరెవరు అంతటి భరోసా ఇస్తారు? నేను ఎప్పుడూ ఆయన నామాన్నే జపిస్తూ ఉంటాను (భక్తులకు నా వినయపూర్వకమైన విన్నపం: ఆయన నామం ప్రతి సమస్యకు పరిష్కారం. నన్ను నమ్మండి). నా రోజువారీ జీవితంలో నేను బాబా అద్భుతాలను చాలా అనుభూతి చెందుతున్నాను. శ్రీసాయి సచ్చరిత్రలో తాబేలు కథలా బాబా నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు. నేను చాలా చాలా అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు చేసినదంతా గమనిస్తే నిజంగా నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి బాబా. మీరు ఎంతో మృదువుగా నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మీకు కోటి కోటి ప్రణామాలు బాబా".

చివరిగా మరో చిన్న అనుభవం చెప్పి ముగిస్తాను. ఇటీవల బాబా నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించారు. భగవంతుని కృపవల్ల అంతా సాఫీగా సాగుంతుండగా ఒకరోజు నా టీమ్ లీడ్ పరిష్కరించమని నాకు ఒక టాస్క్(సమస్య) అప్పగించారు. వెంటనే నేను అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది 'ప్రాధాన్యత 1' గల టాస్క్  అయినందున బిజినెస్ అంతా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తుంది. నేను తొందరగా ఆ సమస్యను పరిష్కరించలేకపోతే వాళ్ళు ఉన్నతాధికారులను సంప్రదిస్తారని నేను చాలా భయపడ్డాను. "దయచేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఒకపక్క బాబా జాగ్రత్త వహిస్తారని అనుకుంటూనే మరోపక్క ఒక మామూలు మనిషిగా ఎక్కడో ఓ చోట చాలా బాధపడసాగాను. నేను నాకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఒక వారంలో సచ్చరిత్ర పారాయణ చేస్తానని బాబాకి మాటిచ్చాను. కాని నాకు పారాయణ చేసే అవకాశం రాక వాయిదా వేస్తూ పోయాను. బహుశా ఆ కారణంగానే నేను ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నననిపించి బాబాకు క్షమాపణలు చెప్పుకొని, "దయచేసి గురువారంలోపు ఈ సమస్యకు పరిష్కారం చూపండి. నేను వచ్చే గురువారం నుండి పారాయణ ప్రారంభిస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. మంగళవారం రాత్రి సమస్యకు పరిష్కారం దొరికింది. "చాలా కృతజ్ఞతలు బాబా. నేను ఏదైనా తప్పు చేసి ఉంటూ నన్ను క్షమించండి. మీరు ఎల్లప్పుడూ నాతో ఉండండి. దయచేసి నా సోదరుడిని మరియు అతని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ విషయంలో ఏమి జరుగుతుందో మీకు తెలుసు. దయచేసి తనని మీ భక్తునిగా పరిగణించండి. ఒకసారి మీరు తనని మీ భక్తునిగా పరిగణించినట్లైతే నేను అతనికోసం ఇక ప్రార్థించను. ఎందుకంటే, మీరు మీ భక్తులకు సంబంధించి ప్రతిదీ చూసుకుంటారని నాకు తెలుసు. దయచేసి నా తల్లిదండ్రులతో ఉండండి బాబా. దయచేసి నేను ఎల్లప్పుడూ మీ నామజపం చేసేలా, ప్రశాంతంగా మీ పారాయణ చేసేలా నన్ను ఆశీర్వదించండి బాబా".

సాయి స్మరణం - సంకట హరణం|

బాబా శరణం - భవభయహరణం||


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.



23 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Your so lucky om sairam🙏

    ReplyDelete
  3. Gurudeva mahaprabho sainatha nalo sakalakoti rogalu sakalakoti dhoshalu tholaginchi nenu na bartha kalisi kapuram chesela Chei thandri . ye court case lekunda na Bartha mari nakosam Thirigi vachesela chudu thandri nanny kapuraniki thiskellela chudu said na man as u yenttha varaku thathukogaladho na thallithqndrula badha na age anni alochinchi okkasari na jeevithanni niilabettu said

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Om sai nannu e problem nunchi rakshinchu sai

    ReplyDelete
  9. Baba mammalni save cheyandi baba .....Edina thappu vunte kashaminchandi.....dairyam saripodam ledu 😔

    ReplyDelete
  10. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  11. Baba Kalyan ki marriage chai thandri pl

    ReplyDelete
  12. Om Sri Sai Arogyakshemadhaaya Namaha🙏🙏🙏

    ReplyDelete
  13. 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  14. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  15. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  16. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  17. saibaba maa sai madava bharam antha meede baba. madava behaviourlo, matalo, aluchananalo maarpu tevali baba. alage maavarilo maa attagarilo maarpu tevali baba.

    ReplyDelete
  18. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba safe delivery chei baba please baba

    ReplyDelete
  19. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  20. Baba, please give PG medical MS Mch neurosurgery seat for my daughter and also give first rank in PG NEET exam.

    ReplyDelete
  21. Baba, please give first rank in INICET Exam and give Ms Mch neurosurgery seat in NIMHANS College.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo