1. బాబా నాతో ఉన్నారన్న నమ్మకం
2. బాబా నాపై చూపించిన కరుణాకటాక్షాలు
బాబా నాతో ఉన్నారన్న నమ్మకం
మేము వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడ్డ తెలుగువాళ్ళము. నేను బాబాని నమ్ముతాను, అలాగని బాబాకి పరమ భక్తురాలిని మాత్రం కాదు. అందరి దేవుళ్ళలాగానే బాబాని పూజిస్తాను. కాని బాబా మీద కాస్త ఎక్కువ నమ్మకం. ఒకసారి నాకు కుడి కాలు తొడ భాగంలో బాగా నొప్పి వస్తుండేది. అది ఏం చేసినా తగ్గలేదు. అలాంటి సమయంలో ఈ బ్లాగులో ఒక బాబా భక్తురాలు పంచుకున్న అనుభవం చదివి బాబా ఊదీ మహిమ తెలుసుకొని ఎలాగైనా నాకు బాబా ఊదీ కావాలని అనుకున్నాను. మరుసటిరోజు బ్లాగు ఓపెన్ చేయగానే, "నేను నీకు ఊదీ పంపాను. నువ్వు తీసుకున్నావా? లేదా?" అని సాయి వచనం కనిపించింది. నేను చాలా ఆలోచించిన తరువాత నా స్నేహితురాలితో విషయం చెప్తే, "నా దగ్గర ఊదీ ఉంది, తీసుకో" అని అంది. అయితే అదే సమయంలో అదివరకు నా సహోద్యోగి ఒకరు నాకు ఒక చిటికెడు ఊదీ ఇచ్చినట్లు గుర్తుకొచ్చి దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాననుకుంటూ నా ఫోన్ పౌచ్‌లో చూస్తే, అందులోనే ఊదీ ఉంది. సమయానికి బాబానే ఆ ఊదీ నాకు అందేలా చేశారు. నమ్మకంతో దాన్ని నొప్పి ఉన్న చోట రాశాను. కొన్ని నెలలుగా నన్ను ఇబ్బందిపెడుతున్న నొప్పి కొన్ని రోజులకు తగ్గిపోయింది.
మేము విజయదశమి సెలవులకి మైసూర్ వెళ్ళొచ్చాము. అక్కడ బాగానే ఉన్న మా బాబు చెన్నైకి తిరిగి రాగానే దగ్గటం మొదలుపెట్టి కొన్నిరోజులు దగ్గు, జలుబుతో ఇబ్బందిపడ్డాడు. రాత్రిళ్ళు దగ్గు మరీ ఎక్కువగా ఉంటుండేది. ఒకరోజు నేను బాబా మీద నమ్మకంతో బాబుకి ఊదీ రాసి 'సాయిబాబా' అని అనుకోని పడుకోమన్నాను. అంతటితో బాబుకి దగ్గు రాలేదు, ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఒకరోజు ప్రయాణంలో నేను, "బాబా! నువ్వు నాతో ఉంటే, నేను వెళ్తున్న దారిలో మీ నామమైన ఒకసారి నేను చూడగలగాలి" అని అనుకున్నాను. అయితే చాలాసేపటివరకు నాకు ఏమీ కనపడలేదు. కాని తర్వాత హఠాత్తుగా మా వెనకాల వస్తున్న వేరే కారు కోసం ఆగినప్పుడు 'శ్రీసాయి' అనే పేరుతో ఒక షాపు కనిపించింది. నేను ఆనందంతో ఒక 5 నిమషాలు అక్కడ ఆగిపోయాను. ఇంకోసారి కూడా ప్రయాణంలో అలాగే అనుకున్నాను. అప్పుడు కూడా కాసేపు ఏం కనపడలేదు. నేను ఆ రోజు బాగా అలిసిపోయి ఉండటం వల్ల మధ్యమధ్యలో కునుకుపాట్లు పడుతున్నాను. ఒకసారి హఠాత్తుగా మెలుకువ వచ్చినప్పుడు, 'అయ్యోయ్యో.. బాబాను వెతుకుతూ ఇలా పడుకున్నాను" అనుకుంటూ పక్కకు చూస్తే, సాయి పేరు కనిపించింది. దాంతో బాబా నాతో ఉన్నారన్న నమ్మకం నాకు వచ్చింది. కాకపోతే నేను ఉద్యోగపరంగా కష్టాలు పడీపడీ బాగా అలిసిపోయిన సమయంలో నేను బాబా వైపు అడుగులు వేసాను. ఆయన్నే నమ్ముకొని వేరే ఉద్యోగం చూసుకోకుండా బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మేము గత సంవత్సర కాలంగా శిరిడీ వెళ్లాలని అనుకుంటున్నాం. అయితే కుటుంబమంతా కలిసి వెళ్ళాలనుకోవటం వలన ఏదో ఒక అవాంతరం వచ్చి ఇప్పటిదాకా వెళ్ళలేకపోయాము. తొందరలో శిరిడీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
బాబా నాపై చూపించిన కరుణాకటాక్షాలు
Om sairam 🙏
ReplyDelete🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl urgent ga chai thandri
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please
ReplyDeleteOm sai ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDeleteసాయుబాబ మా తమ్ముడు ఆరోగ్యo బాగుచేశావు ధన్యవాదనలు ,అలాగే కాస్త తను కాస్త స్వామి మీద నడిచినట్టు చెయు
ReplyDeleteOm Sai Jai Jai Sai.🕉️🕉️🙏🙏🙏💐🍎
ReplyDelete