సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1710వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. డ్రైవరుని పంపి సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చిన బాబా
2. బాబా అనుగ్రహం

డ్రైవరుని పంపి సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చిన బాబా

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!! శ్రీసాయిబాబా భక్తకోటికి మా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ కృష్ణనాయక్. మేము హైదరాబాదులో ఉంటాం. 2023, అక్టోబర్ నెల 21వ తేదీన మేము మా కుటుంబంతో శ్రీ శిరిడీ సాయి దర్శనార్థం శిరిడీ వెళ్ళాము. అక్కడినుండి పండరీపురం వెళ్లి విఠలుని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ వచ్చాము. తర్వాత రోజు అక్టోబర్ 24, బుధవారంనాడు మా కుటుంబమంతా విమానంలో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు విమానం బయలుదేరుతుందనగ ఒక గంట ముందు మేము ఎయిర్పోర్టులో ఉండాలి. అలా కానీ పక్షంలో కనీసం ఒక అరగంట ముందైనా ఉండాలి. ఏదో కారణం వల్ల ఆలస్యమై నేను ఉదయం 11 గంటలకి క్యాబ్ బుక్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఐతే ఒక్క క్యాబ్ కూడా బుక్ కాలేదు. ఒకవేళ బుక్ అయినా కొంత దూరం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుండేవి. అలా 3 క్యాబ్‌లు రిజెక్ట్ అయ్యాయి. అప్పటికి సమయం 12:50 అయింది. కారు రాలేదు. ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని మేము చాలా భయపడి బాబాను వేడుకున్నాము. అంతే, ఎవరో కారు డ్రైవరు మాకు ఫోన్ చేసి, "నా గిరాకీ రద్దు అయింది. మీకు కావాలంటే నేను వస్తాను" అని అన్నాడు. నేను వెంటనే రమ్మన్నాను. కానీ అప్పుడు ఒంటిగంట అయింది. ట్రాఫిక్‌లో సికింద్రాబాద్‌లోని మౌలాలి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్‌కి వెళ్ళడానికి కనీసం 90 నిమిషాల సమయం పడుతుంది. ఎంత డబ్బిచ్చినా ట్రాఫిక్‌లో తొందరగా తీసుకెళ్లేవాళ్ళు ఎవరూ దొరకరు. అయినా మేము బాబా మీద భారమేసి కారులో కూర్చొని, "మమ్మల్ని సమయానికి ఎయిర్పోర్టుకి చేర్చు బాబా. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటామ"ని బాబాను వేడుకున్నాం. కారు డ్రైవర్, "మీరు చాలా పొరపాటు చేశారు. మీరు వెళ్ళేది ఆర్టీసీ బస్సులో కాదు,  విమానంలో. చెకింగ్ ఉంటుంది, ఒక గంట ముందు ఎయిర్పోర్టులో ఉండాలి" అని లోలోపల ఏదో గుణిగి మళ్లీ, "మీరు ఏం బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. నాకు షార్ట్ కట్ మార్గం తెలుసు. నేను ఉన్నాను, సమయానికి తీసుకొని వెళ్తాను" అని అన్నాడు. అన్నట్లే మమ్మల్ని విమానాశ్రయానికి చేర్చాడు. బాబా దయవల్ల విమానాశ్రయం అయితే చేరుకున్నాం. కానీ సరిగ్గా అప్పుడే టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ అందరినీ రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు, "సారీ అండి. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. మేము ఏమీ చేయలేము" అన్నారు. మేము బాబాని వేడుకొని మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ పైఆఫీసర్ మా వంక, మాతో పాటు ఉన్న చిన్నపిల్లల వంక, 75 సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రుల వంక చూసి, "సరే, ఏదో విధంగా వీళ్ళని పంపించండి" అని చెప్పాడు. బాబా దయవల్ల మేము విమానం ఎక్కి కూర్చున్నాం. కనీసం 90 నిమిషాల సమయం పట్టాల్సి ఉండగా కేవలం ౩౦-40 నిమిషాల్లో మమ్మల్ని ఎయిర్పోర్టుకి చేర్చిన ఆ కారు డ్రైవరు నిజంగా బాబా మాకోసం పంపిన మనిషి అని మేము భావిస్తున్నాం. బాబా ఆశీస్సులు లేకపోతే, ఆయన దయతో ఆ కారు డ్రైవరు రాకపోయుంటే మేము సరైన సమయానికి చేరుకొని ప్రయాణమయ్యే వాళ్ళం కాదు, కష్టాలు పడాల్సి వచ్చేది, గమ్యం చేరుకునేసరికి రాత్రి అయ్యేది. మేము ఈ అనుభవం ద్వారా ఇంకోసారి ముందుగానే బయలుదేరాలని తెలుసుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే సాయిభక్తులందరికీ మీరు సదా తోడు-నీడగా ఉండాలని కోరుకుంటూ మీకు మా సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను తండ్రీ".

ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబా అనుగ్రహం


నేను ఒక సాయి భక్తుడిని. నేను ఈమధ్య రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోసంగా 2 వారాలు బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. నేను ఎప్పుడూ అన్నిరోజులు నా భార్య, బిడ్డని వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. నేను వెళితే ఇంట్లో వాళ్లిద్దరే ఉంటారు. నా భార్య రోజంతా తన ఆఫీసులోనే ఉంటుంది. ఆ సమయంలో బాబుని చూసుకోవడానికి ఒక ఆయా ఉన్నప్పటికీ  రాత్రి మాత్రం నా భార్య ఒక్కతే బాబుని చూసుకోవాలి. వీటన్నిటి దృష్ట్యా నేను ట్రైనింగుకి వెళ్లేముందు, "బాబా! నేను ట్రైనింగుకి వెళ్తున్నాను. సంవత్సరం వయసున్న బాబుని నా భార్య ఒక్కతే చూసుకోవడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే రావడానికి నాకు కుదరదు. కాబట్టి నేను వచ్చేవరకు నా భార్య, బిడ్డలకి తోడుగా ఉండి వాళ్ళని సంరక్షిస్తూ ఉండు తండ్రీ. అలానే బెంగళూరులో ఉన్నప్పుడు వారం రోజుల్లో నేను ఎటువంటి ఆటంకం లేకుండా శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ పూర్తిచేసేలా అనుగ్రహించు తండ్రీ. నేను తిరిగి వచ్చాక మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. ఆ తండ్రి దయవల్ల నా భార్య, బిడ్డలకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. నేను కూడా సచ్చరిత్ర పారాయణ గురువారం మొదలుపెట్టి తర్వాత గురువారానికి పూర్తి చేయగలిగాను. నా తిరుగు ప్రయాణమప్పుడు దీపావళి సమయమైనందున నా టికెట్ కన్ఫర్మ్ అవుతుందో, అవ్వదో అని అనుకున్నాను. కానీ బాబాను ప్రార్థించినంతనే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇలా బాబా నాకు అన్ని విధాల సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా. మా బాబుకి దంతాలు ఇంకా రాలేదు, తొందరగా వచ్చేలా చూడు తండ్రీ". 


21 comments:

  1. ఓం సాయిరాం గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురుదేవ మహాప్రభు నా భర్త అర్థం చేసుకో నాకోసం తిరిగి వచ్చేసేలా చూడు తండ్రి నన్ను కాపురానికి తీసుకెళ్లలో చూడు సాయి ఏ కోర్టు కూడా వెలుగు లేకుండా చూడు తండ్రి నిన్ను నమ్ముకొని నీ మీద భారవేసి బతుకుతున్నాను సాయినాథ

    ReplyDelete
    Replies
    1. ఓం సాయిరామ్

      Delete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు నాథ్ మహారాజ్ కి జై.
    బాబా, మీ దయ వల్ల ట్రైన్ జర్నీ ముగించుకొని సమయానికి క్షేమంగా ఇంటికి చేరాము. నోవాటెల్ హోటల్ లో ఈ రోజు , రేపు జువెల్లరీ స్టాల్ నిర్వహించనున్న మా వదిన కి మరియు నా భార్య కి మీ ఆశీస్సులు కలుగజేయు వలసిందిగా ప్రార్థిస్తున్నము ఓ సాయి నాధా.

    ReplyDelete
  7. Om Sai Ram...Koti Koti Pranamam to your lotus feet baba... 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Baba Kalyan ki marriage chai

    ReplyDelete
  10. sai baba maa sai madava bharam antha meede baba. madava manchiga maari praayojakudu avvali baba. naaku maa sir leave sanction cheyali baba.maa attagaru, maavaru maarali baba.

    ReplyDelete
  11. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  12. Baba maku finance doriki munduki vellela laga chudandi please.....memu vunna situations nundi bayataki vachi maa projects anni complete ayyela cheyandi baba....evaru mammalni ebbandi pettakunda mere venaka vundi nadipinchandi please

    ReplyDelete
  13. ఓం నమో శ్రీ సాయి జ య జై సాయి బాబా

    ReplyDelete
  14. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba safe delivery chei baba please

    ReplyDelete
  15. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  16. Baba, we are coming for your Divya Darshan Shirdi. Please bless us.

    ReplyDelete
  17. ఓం సాయిరామ్

    ReplyDelete
  18. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  19. Om sai ram ma sister ki hyderabad lo job confirm ayye la chudu thandri naaku thodu pampandi thandri pls

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo