సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ వసంతరావు


శ్రీ అమిదాస్ లక్ష్మీదాస్ మెహతా వద్దనుండి శ్రీ వసంతరావు తీసుకున్న ఋణాన్ని శ్రీసాయిబాబా మాఫీ చేసిన అద్భుత లీలను గుజరాతీ పుస్తకం "సాయి సరోవర్" నుండి ఇంగ్లీష్ లోకి అనువదించి www.shirdisaitrust.org లో ప్రచురించబడింది. దానిని http://www.saiamrithadhara.comసైటు నుండి సేకరించి తెలుగు అనువాదం సాయి భక్తులకు అందిస్తున్నాము.  

శ్రీ అమిదాస్ లక్ష్మీదాస్ మెహతా అనే వడ్డీవ్యాపారి నాగపూర్ నివాసి. అతడు శ్రీ వసంతరావు అనే సాయిభక్తునికి ఆరువందల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే వసంతరావుకు చెడుకాలం నడవడం మొదలై అతను ఇంకా చాలామంది ఇతర ఋణదాతల వద్దనుండి కూడా అప్పు తీసుకున్నాడు. కాని అతను ఆ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. అప్పుల బాధలు భరించలేక తనకి ఎప్పుడూ అండగా ఉండే సాయిబాబాను ఆశ్రయించాలని నిర్ణయించుకుని శిరిడీ వెళ్ళాడు. ఋణదాతలు తమ బకాయిల తిరిగి చెల్లింపులకోసం వసంతరావు ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ, “సోదరుడు ఊరిలో లేడు” అనే ఒక్క సమాధానం మాత్రమే పొందుతుండేవారు. ఆ సమాధానంతో అమిదాస్ పూర్తిగా విసుగు చెంది వసంతరావు కోసం వెతకడం మొదలుపెట్టాడు. వసంతరావు శిరిడీలో ఫకీర్ పాదాల వద్ద పడి ఉన్నాడనే వార్త అతనికి తెలిసింది. దాంతో అమిదాస్ శిరిడీ వెళ్ళాడు.

ద్వారకామాయిలో సాయిబాబా పాదాలను ఒత్తుతున్న వసంతరావును అమీదాస్ చూసి పట్టలేని ఆగ్రహావేశాలతో చాలా చెడ్డ పదజాలంతో వసంతరావును తిట్టిపోశాడు. ఆ తిట్లను విన్న వసంతరావు కన్నీరు మున్నీరై మౌనంగా బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాడు. సాయిబాబా చాలా మర్యాదగా అమిదాస్‌తో, “భావు(సోదరుడా)! నువ్వు చాలారోజులు వేచి ఉన్నావు. దయచేసి మరో రెండురోజులు వేచి ఉండు. ఎల్లుండి వడ్డీతో సహా నీ డబ్బు నీకు అందుతుంది” అని చెప్పారు. బాబా మాటలను విశ్వసించి తనలో తాను సమాధానపడి అమిదాస్ వెళ్లిపోయాడు.

మూడవరోజు ఉదయం అమిదాస్ తన ఇంట్లో నిద్రపోతుండగా ఎవరో తలుపు తట్టారు. అమిదాస్ కళ్ళు నులుముకుంటూ తలుపు దగ్గరకు వెళ్లే, తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు. అమిదాస్, “నేను నిన్ను గుర్తించలేకపోతున్నానెందుకు?” అని అడిగాడు. ఆ అపరిచితుడు, “నేను వసంతరావుకి వినయపూర్వకమైన సేవకుడిని. మీ ఖాతాను (సెటిల్)పరిష్కరించమని అయ్యగారు నన్ను పంపారు. మీ పుస్తకాలను తనిఖీ చేసి, ఈ చిన్న సంచి నుండి వడ్డీతో సహా మీకు రావాల్సిన మొత్తాన్ని తీసుకోండి” అని చెప్పి ఒక చిన్న సంచిని అమిదాస్ చేతికి అందిస్తూ మళ్ళీ ఇలా అన్నాడు, “అయ్యా, మీ చేతులతో ఆ మొత్తాన్ని లెక్కించండి. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు అదనంగా ఏమీ తీసుకోర”ని.

"ఇంత చిన్న సంచిలో ఆరువందల రూపాయల వంటి పెద్ద మొత్తం ఎలా ఉంటాయి?" అని అమిదాస్ తన మనస్సులో అనుకుంటూ విశాలమైన కళ్ళతో అపరిచితుని వైపు చూస్తూ సంచిని అందుకుని అందునుండి నాణేలు బయటకు తీసి లెక్కించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం! అతడెన్ని నాణేలు బయటకు తీస్తున్నా ఆ సంచి ఖాళీ కావడంలేదు. సంచిలో నాణేలు ఏమాత్రం తగ్గడం లేదు. తన ఆరువందల రూపాయలు తీసుకుని, “సోదరుడా ఖాతా పుస్తకం మేడ మీద ఉంది. దయచేసి ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్లి తీసుకుని వస్తాను” అన్నాడు. అపరిచిత వ్యక్తి అందుకు నిరాకరిస్తూ, “అయ్యా దయచేసి మీరేమి శ్రమపడకండి. నేనింకా చాలా ఇతర ఖాతాలను పరిష్కరించాల్సి ఉంది.  కాబట్టి నేను బయలుదేరాల్సి ఉంది. మీరు రశీదును వసంతరావుకు పంపండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

తరువాత ఆ రశీదును వసంతరావు అందుకుంటూ నోట మాట రాక మూగబోయాడు. బాబా తనపై చూపిన కరుణకు ఆయనపట్ల ప్రేమతో ఆనందంలో మునిగిపోయాడు. తరువాత ఋణదాతల ఇబ్బందుల నుండి తనని విముక్తి చేయడానికి బాబా చాలా బాధపడాల్సి వచ్చిందని తనలో తాను పశ్చాత్తాపపడ్డాడు.

9 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete
  2. Baba na samasya parishkaram chyyandi

    ReplyDelete
  3. Baba na samasya parishkaram chyyandi

    ReplyDelete
  4. Sai em cheyaloo artham kaledu.bayamesthumdi sai napai dayunchi kapadu thandri

    ReplyDelete
    Replies
    1. సాయిరాం మీద భారం వేసి ధైర్యంగా ఉండాలి సాయిరాం

      Delete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼❤

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo