ఈరోజు భాగంలో అనుభవాలు:
- క్లిష్ట పరిస్థితిలో బాబా చేసిన సహాయం
- అడిగినంతనే ఉద్యోగమిచ్చిన బాబా
క్లిష్ట పరిస్థితిలో బాబా చేసిన సహాయం
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
పదేళ్ళ క్రితం మా నాన్నగారి వద్ద నుండి మా అంకుల్ పది లక్షల రూపాయలు తీసుకున్నారు. తరువాత మా నాన్నగారు ఒక ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఒక కాంట్రాక్టరుని కలిసి మాట్లాడి బ్యాంకు లోన్ తీసుకున్నారు. కానీ హఠాత్తుగా ఆ కాంట్రాక్టరు పరిస్థితి బాగాలేక పని మొదలుపెట్టలేదు. దాంతో మేము చాలా క్లిష్ట పరిస్థితిలో పడిపోయాం. బ్యాంకు వాళ్ళు లోన్ డబ్బులు తిరిగి చెల్లించమని అడగడంతో మా నాన్నగారు తన డబ్బు తనకివ్వమని అంకుల్ ని అడిగారు. కానీ అతను మా పరిస్థితిని పట్టించుకోకుండా మాకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మా బంధువుల వద్ద కూడా మాపై చెడుగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దానితో అందరూ మాకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. గతంలో ఎన్నోసార్లు అంకుల్ మాకు సహాయం చేసి ఉన్నందున, అతనిపట్ల గౌరవంతో నా తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడలేకపోయేవారు. కానీ అతను చాలా దారుణంగా మాట్లాడేవాడు. అయినా కూడా మేము సహనంతో ఉండేవాళ్ళం. నా తల్లిదండ్రులు చాలా సున్నిత మనస్కులు. వాళ్ళెప్పుడూ అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండేవారు. అలాంటి మాకు కష్ట పరిస్థితి వచ్చేసరికి అందరూ ముఖం చాటేశారు. ఎవరికీ మా పరిస్థితి అర్థం కాలేదు. ఎటువంటి తప్పూ చేయని మాకు ఆ పరిస్థితి ఎంతో బాధాకరమైనప్పటికీ బాబా అంతా చూసుకుంటారని నాకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకం వలన నా తల్లిదండ్రులతో, "మీరేమీ బాధపడకండి. మనం బాబా రక్షణలో ఉన్నాం. ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికీ సత్యం అర్థమయ్యేలా చేస్తారు" అని చెప్పేదాన్ని. పదేళ్ళపాటు ఎంతో సహనంతో మేము వేచి చూశాము. చివరికి నాన్న బ్యాంకు లోన్ తీర్చడానికి మా పాత ప్లాట్ ని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కానీ ప్లాట్ ని ప్రభుత్వం చాలా తక్కువ ధరకి కొనుగోలు చేయాలని అనుకుంది. దాదాపు మాకు దారులన్నీ మూసుకుపోయాయి. అటువంటి స్థితిలో నేను, "బాబా! మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఈ పరిస్థితి నుండి కాపాడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఏమి జరిగిందో ఏమో తెలీదుగానీ బాబా కృపతో ఎటువంటి వాదులాట లేకుండా అంకుల్ మా డబ్బు మాకు తిరిగి ఇచ్చారు. ప్రభుత్వం కూడా మంచి ధర చెల్లించి మా ప్లాట్ తీసుకుంది. ఆ వచ్చిన డబ్బుతో బ్యాంకు లోన్ మొత్తం తీర్చేశాము. మా బంధువులకు కూడా సత్యం ఏమిటో అర్థమై మళ్ళీ మునుపటిలా మాతో ఉంటున్నారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు అండగా ఉండి సంరక్షిస్తున్నందుకు శతకోటి నమస్కారాలు బాబా. మేమెప్పుడూ మీ పాదాలను అంటిపెట్టుకుని ఉంటాము. లవ్ యు బాబా!" అన్ని సమయాలలోనూ బాబాను ప్రార్థించండి, ఆయనను మరువకండి. తప్పక శుభం జరుగుతుంది.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2399.html

అడిగినంతనే ఉద్యోగమిచ్చిన బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తుని అనుభవం:
నేను పూణేలో నివసిస్తున్న సాధారణ సాయిభక్తుడిని. 2018, ఆగష్టు 23న నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఆ తరువాత నేను మూడు నెలలపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఆ విషయమై నేను చాలా ఆందోళనపడుతూ ఉండేవాడిని. అటువంటి సమయంలో ఒక ఫంక్షన్ కోసం 2018, డిసెంబర్ 1న నేను ముంబయి వెళ్లాల్సి వచ్చింది. నవంబర్ 28న నాకెందుకు అనిపించిందో తెలీదుగానీ, "ముంబయి వెళ్ళడానికి ముందే నాకు ఉద్యోగం ఇవ్వండి బాబా" అని బాబాను ప్రార్థించాను. హఠాత్తుగా నా మనస్సులో ఒక ఆలోచన వచ్చి, నేను అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక కంపెనీకి ఫోన్ చేసి, "నేను మీ కంపెనీలో జాయిన్ కావచ్చా?" అని అడిగాను. ఆశ్చర్యం! వాళ్ళు మరో మాట మాట్లాడకుండా, "డిసెంబర్ 1వ తేదీన ఉద్యోగంలో చేరండి" అని చెప్పారు. నేను, "1వ తేదీన జాయిన్ కాలేను, 2వ తేదీనుండి వస్తాను” అని చెప్పాను. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. అడిగినంతనే బాబా నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించారు. అది చిన్న కంపెనీ అయినప్పటికీ మంచి కంపెనీ. “థాంక్యూ సో మచ్ బాబా!”
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🙏🕉😊😀❤
ReplyDelete🕉 sai Ram
ReplyDelete