ఈరోజు భాగంలో అనుభవాలు:
- ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం బాబానే!
- బాబా ఆశీస్సులతో పాపకు జన్మనిచ్చాను
ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం బాబానే!
ఆస్ట్రేలియానుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు:
నేను సాయిబాబాను పూర్తిగా విశ్వసిస్తాను. ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం ఆయనే. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యపరంగా, వ్యక్తిగతపరంగా, వృత్తిపరంగా ఇలా పలురకాలుగా ఒకటి తర్వాత ఒకటిగా చాలా సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. ఆ సమస్యలతో పూర్తిగా విసిగిపోయాను. ఒకానొక సమయంలో, "ఇక నేను ఈ సమస్యలను తట్టుకోలేను, ఈ జీవితాన్ని కొనసాగించలేన"ని అనుకున్నాను. అటువంటి స్థితిలో కూడా ప్రతిరోజూ సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండేదాన్ని. నవగురువార వ్రతం కూడా చేయాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వ్రతకథ పుస్తకం లేకుండానే వ్రతం మొదలుపెట్టడానికి సిద్ధపడ్డాను. మొదటి గురువారంనాడు సాయి మందిరం దగ్గరున్న షాపులో పుస్తకం దొరుకుతుందేమో చూద్దామని మందిరానికి వెళ్లి షాపులో అడిగాను. కానీ వాళ్ల దగ్గర ఆ పుస్తకం లేదు. "సరే ఏం చేస్తాం? ఆన్లైన్ లో చదివి వ్రతం పూర్తి చేద్దామ"ని అనుకున్నాను. తరువాత బాబా దర్శనం చేసుకుని మందిరం లోపలినుండి బయటకు వచ్చాను. అక్కడ మందిర ప్రాంగణంలో ఒక టేబుల్ ఉంటుంది. దానిపై భక్తుల కోసం ప్రసాదాన్ని ఉంచుతారు. నేను ప్రసాదం తీసుకోవడానికి టేబుల్ దగ్గరకు వెళ్లి చూస్తే, ఆశ్చర్యం! టేబుల్ పై 'భక్తుల కోసం' అని వ్రాసిపెట్టి ఉంది, దాని ప్రక్కనే 'సాయివ్రతకథ' పుస్తకం ఉంది. అది కూడా కేవలం ఒకే ఒక్క పుస్తకం ఉంది. బాబానే ఆ పుస్తకాన్ని నాకు అందజేశారని ఆనందంతో మనసారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వ్రతం మొదలుపెట్టాక పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు కనిపించడం మొదలైంది.
మూడవ గురువారంనాడు నేను ఆఫీసు లంచ్ బ్రేక్‌లో బాబా దర్శనం కోసం మందిరానికి వెళ్ళాను. కానీ ఆ సమయంలో మందిరం మూసివుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా మందిర నిర్వహణ బాధ్యతలు చేసే వ్యక్తి అక్కడకు వచ్చారు. నన్ను చూస్తూ, "ఈ సమయంలో వచ్చారేమిటి?" అని అడిగారు. నేను, "నాకు మందిరం వేళల గురించి తెలియని కారణంగా ఈ సమయంలో వచ్చాను" అని చెప్పి, "మందిర వేళలు ఏమిటి?' అని అడిగాను. అందుకాయన, "మధ్యాహ్నం ఒంటిగంటకి మందిరం మూసివేసి, మళ్లీ సాయంత్రం ఐదు గంటలకి తెరుస్తాం" అని చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు, "ఒక భక్తునికి ఒక పుస్తకం అవసరమని నేనిప్పుడు ఇక్కడకు వచ్చాను" అని. తర్వాత మందిరం తెరచి, నన్ను 'బాబా దర్శనం చేసుకోమ'ని చెప్పారు. నేను ఆనందంగా లోపలకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అవకాశమే లేని సమయంలో బాబా నాకిలా సహాయం చేశారని ఎంతో మురిసిపోయాను. అప్పటికి అతను తన పని ముగించుకుని తాళం వేయడానికి బయట వేచివున్నారు. నేను దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా అతను నాతో, "సాయి పాదాల వద్ద మీకోసం ఒకటి ఉంది, వెళ్లి తీసుకోండి" అన్నారు. నేను ఆనందంతో మళ్ళీ లోపలికి పరుగుతీశాను. అక్కడ బాబా పాదాల వద్ద ఒక గులాబీ, ఒక అరటిపండు ఉన్నాయి. నేను పట్టలేని ఆనందంతో వాటిని తీసుకుని బయటకు వచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్తే, అతను, ""మీ బిడ్డకు ఏదైనా ఇవ్వండి బాబా!" అని బాబాను అడిగాను, ఆయనిచ్చారు. అంతే, నాదేముంది?" అన్నారు. "ఓ మై బాబా!" నా ఆనందానికి అవధుల్లేవు. నిజానికి నేను మందిరానికి వెళ్లేటప్పుడు, "బాబా! దయచేసి నాకు ఏదైనా సానుకూలమైన సంకేతమివ్వండి" అని అడిగాను. ఆయన గులాబీపువ్వు, అరటిపండు ఇచ్చారు. నాలోని భావాలను ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి నా సాయి నాకోసం ఏదో చేస్తున్నారు.
ఒకసారి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మేడపై ఉన్నాను. మేడపైన బాల్కనీ నుండి క్రిందకి చూస్తే సాయిబాబా కనిపించారు. వెంటనే ఆయనకివ్వడానికి పది డాలర్లు చేతిలో పట్టుకుని పరుగు పరుగున క్రిందకు వెళ్ళాను. అక్కడ చూస్తే ఇద్దరు సాయిబాబాలు ఉన్నారు. ఒకరు నిజమైన సాయిబాబా, మరొకరు టీవీ సీరియల్‌లో సాయిబాబా పాత్ర చేస్తున్న అతను. ఉన్నట్టుండి అసలు సాయిబాబా వెళ్లిపోయారు. సీరియల్ బాబా నా వైపు చూస్తున్నారు. "నేను ఈ డబ్బులు అసలు సాయిబాబాకే ఇస్తాను. ఆయనే నా నిజమైన సాయిబాబా" అని చెప్పాను. అంతటితో కల ముగిసింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే కల గురించి ఆలోచించాను కానీ, నాకేమీ అర్థం కాలేదు. వెంటనే, "బాబా! నాకు మళ్ళీ కలలో కనిపించి మీరు ఏమి చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా నాకు తెలియజేయండి" అని ప్రార్థించాను.
"బాబా! దయచేసి నా సమస్యలన్నీ పరిష్కరించండి. నేను ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించండి. నాకు తెలుసు, మీరు నన్ను సమస్యలనుంచి బయటపడేస్తారు".

బాబా ఆశీస్సులతో పాపకు జన్మనిచ్చాను
యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. మొదట్లో నాకు ఆయనపట్ల భక్తి ఉండేది కాదు. మావారు మాత్రం నిత్యం బాబాని పూజిస్తూ, ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవారు. క్రమం తప్పకుండా ఆయన సాయిబాబా మందిరంలో ఆరతులకు హాజరవుతూ ఉండేవారు. ఆయనను చూస్తూ క్రమంగా నేను కూడా సాయిబాబా పుస్తకాలు చదవడం, ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టాను.
గత నాలుగేళ్లనుండి మేము యు.ఎస్.ఏ. లో నివసిస్తున్నాము. నా భర్త హెచ్4 వీసా మీద యు.ఎస్. వచ్చారు. హెచ్1 వీసా కోసం చాలాసార్లు ప్రయత్నించాము. 2016లో చేసిన మొదటి ప్రయత్నంలో లాటరీలో ఎంపిక కాలేదు. అదే సమయంలో మేము పిల్లలకోసం కూడా ప్రయత్నిస్తుండేవాళ్ళం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవైపు ఆఫీసులో పని, మరోవైపు పిల్లల సమస్య మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుండేవి. అటువంటి సమయంలో భక్తుల అనుభవాలకు సంబంధించిన ఇంగ్లీష్ బ్లాగు నా దృష్టిలో పడింది. ఆ బ్లాగు మేము పడుతున్న ఒత్తిడినుండి దూరం చేసే ఆశాకిరణమైంది. భక్తులు తాము ప్రెగ్నెంట్ అవడంలో చేసిన ప్రయత్నాలు - ఊదీ నీళ్లను త్రాగడం, కడుపుపై ఊదీ రాసుకోవడం, రాత్రంతా బాబా పాదాల చెంత గ్లాసుతో నీళ్లు పెట్టి ఉదయాన వాటిని త్రాగడం, నవగురువార వ్రతం చేయడం మొదలైనవి తమ అనుభవాలలో చెప్తుండేవారు. నేను వాటిని ప్రయత్నిస్తుండేదాన్ని. అయినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. డాక్టర్లను సంప్రదిస్తూ పరీక్షలకు, మందులకు చాలా డబ్బు ఖర్చుపెట్టాం. అయినా ప్రయోజనం లేకపోవడం మాట అటుంచి, వాటి కారణంగా నాకేమీ బాగుండేది కాదు. అందువలన ఆఫీసు పనులు పూర్తి చేయడం కష్టంగా ఉండేది. ఇలా ఉండగా 2017, ఏప్రిల్ లో నా భర్త హెచ్1 వీసా లాటరీలో ఎంపిక అయ్యింది. అయినప్పటికీ అది ఆమోదం పొందుతుందో లేదో అన్న ఆలోచనతో మేము సంతోషించలేకపోయాము. దానితో నేను అనుభవిస్తున్న ఒత్తిడి తారాస్థాయికి చేరుకుని మందులు తీసుకోవడంతో సహా అన్నీ బాబాకు వదిలిపెట్టేసాను. అదే సమయంలో మా నాన్నగారు ఇండియానుండి ఒక పార్సెల్ పంపించి, ఆచారబద్ధంగా ఇంటిలో ఒక విధి నిర్వహిస్తే పిల్లలు కలిగే అవకాశం ఉందని చెప్పారు. కానీ మేము అటువంటివి ఏమీ చేయకుండానే బాబా అద్భుతం చేసారు. నేను గర్భం దాల్చాను. మొదట్లో నాకు చాలా వికారంగా ఉండేది. కనీసం నీళ్లు త్రాగడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ నాకు తెలుసు, నా కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి బాబా ఉన్నారని. నా నమ్మకం వమ్ము కాలేదు. ఆయన అనుగ్రహచిహ్నంగా 2018, ఏప్రిల్ 5 గురువారంనాడు మాకు పాప పుట్టింది. తనకి మేము 'యశస్వి' అని పేరు పెట్టుకున్నాము. "బాబా! ఎవరూ పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడండి. త్వరలోనే మీరు మావారికి వర్క్ వీసా అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను". పూర్తిగా బాబాకు శరణాగతి చెందండి. ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయి.
🕉 sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete