సాయి వచనం:-
'భక్తివిశ్వాసములతో నా వద్దకు వచ్చినవారినెవ్వరినీ ఎన్నడూ దూరం చేయను. ఇది నా వాగ్దానం.'

'కష్టం మీద జీవించడాన్ని నేను ఇష్టపడతాను. అలా ఉండడాన్ని ప్రేమిస్తాను. కోట్లాది రూపాయలు మీరిచ్చినా వాటిని కాదని బాబా పాదాల వద్ద నిలబడి అర్థిస్తాను. చేయి చాచితే అది బాబా ముందే చాచుతాను' - శ్రీబాబూజీ.

బాబాకు లేని కులం - బాబా బిడ్డలకెక్కడిది?


కులతత్వాన్ని, కులాభిమానాన్ని, అంటరానితనాన్ని మహాత్ములంతా నిరసించారు. శ్రీసాయి సంప్రదాయంలో కులానికి ఇసుమంతైనా చోటులేదు. తానో అగ్రకులస్థుడను అనిన  అహంకారం తలకెక్కిన ఒక భక్తుని, “నీ శరీరంలోనే ఒక హీనజాతి వాడున్నాడు. ముందు వాణ్ణి బయిటకు వెళ్లగొట్టు!” అంటూ మందలించారు. తమ కులమతాలేమిటని బాబాను ప్రశ్నించిన ధూలియా కోర్టు ప్రతినిధితో, తమది 'కబీరు మతమని, తమ కులం 'దైవం' (“పర్వర్డిగర్") అనీ సమాధామిచ్చారు బాబా. బాబాకే లేని 'కులం' బాబా బిడ్డలైన సాయి భక్తులకెక్కడిది?

“ఆ తండ్రికి తగ్గ బిడ్డలు కండి!” అని బాబా మనకుద్బోధించారు. కులం, కులతత్వం, కులాభిమానం మన హృదయాంతరాళాల నుండి వీడనంతవరకు మనం సాయిభక్తులము ఎన్నటికీ కాలేము. మన "కులాన్ని మనం విడిచిన నాడే ఆ సమర్థ సద్గురు కులం” లో స్థానం సంపాదించగలం.

కులాభిమానాన్ని తమ భక్తుల మనస్సుల నుండి తుడిచెయ్యడానికి బాబా ఎలా యత్నించేవారో తెలిపే సంఘటన - మచ్చుకు ఒకటి ఇక్కడ తెలుసుకుందాం:

ఒకసారి దామోదర్  రస్నే అనే భక్తుడు ఒక సందర్భంగా తన ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేసాడు. బాబా వద్దకెళ్ళి బాబా తరఫున, బాబా సేవకుడైన బాలాపాటిల్ ను భోజనానికి పంపమని వేడుకొన్నాడు. బాలాపాటిల్ తక్కువ కులానికి చెందినవాడు.  రస్నే  అభ్యర్థనను బాబా ఒక షరతు మీద అంగీకరించారు. “బాలాపాటిల్ అలాగే మీ ఇంటికి భోజనానికొస్తాడు! కానీ, అక్కడ అతణ్ణి ధూత్ ధూత్' (దూరం, దూరం!) అని కేకలేస్తూ, మీరు భోంచేసే చోట కాకుండా, దూరంగా భోజనం వడ్డించకూడదు” అని హెచ్చరించారు బాబా. బాబా ఆదేశానుసారం  రస్నే బాలాపాటిల్ ను తన ఇంటికి సగౌరవంగా తోడ్కొనిపోయి, తన భోజనాల గదిలో తన ప్రక్కనే కూర్చొనబెట్టుకొని, అతనితో బాటే భోజనం చేసాడు.

సోర్సు : సాయిపథం వాల్యూం  - 1

8 comments:

  1. Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  2. Om Sree Sachidanandha Samardha Sadguru Sainath Maharaj Ki Jai Jai Jai 🕉🙏❤😊📿🌹

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo