శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాఖడే ఉరఫ్ నానుభట్ పూజారి ఉరఫ్ నానూ మామా సాయిబాబా భౌతికదేహంతో ఉన్న కాలంలోనే ఆయనను దర్శించుకున్న భాగ్యశాలి. బాపూసాహెబ్ జోగ్‌కు సహాయకునిగా ఉంటూ బాబాకు ఆరతి, పూజ నిర్వహిస్తూ ఉండేవాడు. బాబా సమాధి అనంతరం కూడా ఎన్నో సంవత్సరాలపాటు పూజారిగా ఆయనకు పూజ, ఆరతి నిర్వహించాడు. అతనిని బాబా 'నానుమామా' అని సంబోధించేవారు. అందువల్ల శిరిడీ గ్రామస్తులు కూడా అతన్ని అలానే పిలిచేవారు.
నానుమామా సంగమనేరు నివాసి. ఇతడు మొట్టమొదట 1914వ సంవత్సరంలో శిరిడీ వెళ్ళాడు. శిరిడీలో అతని సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అందువల్ల అప్పుడప్పుడు శిరిడీ వెళ్లి వస్తుండేవాడు. ఒకరోజు అతడు తన స్వగ్రామంలో ఉండగా అతనికొక కల వచ్చింది. ఆ కలలో బాబా అతని ముందు ప్రత్యక్షమై, “అబ్బాయీ! నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు. శిరిడీ వచ్చేయి. శిరిడీలో ఎంతో ఆనందం ఉంది!" అని అన్నారు. మరుసటిరోజే తన తల్లి తరఫు బంధువైన లక్ష్మణరావు కులకర్ణి రత్నపార్ఖీ(లక్ష్మణ్ మామ, బాపాజీ తండ్రి) ఆ గ్రామానికి వచ్చాడు. అతడు తనతోపాటు శిరిడీ వచ్చి తనకు సహాయకుడిగా ఉండమని నానుమామాను కోరాడు. నానుమామా సంతోషంగా అతనితోపాటు శిరిడీ వెళ్లి, కొంతకాలం అతనితోపాటే ఉండేవాడు. తరువాత సమాధిమందిరం వెనుక వైపు ఉన్న భవనంలోని గది అద్దెకు తీసుకొని అందులోకి మారాడు. మొదట్లో తన జీవనోపాధి కోసం శిరిడీ పరిసర గ్రామాల్లో భిక్షాటన చేసేవాడు. కొంతకాలం గైడుగా వ్యవహరిస్తూ శిరిడీ వచ్చే యాత్రికులకు చుట్టుపక్కల గ్రామాలను చూపిస్తూ ఉండేవాడు కూడా. కానీ బాబా పూజలో జోగ్‌కు సహాయం చేయడాన్ని అతడెంతగానో ఇష్టపడేవాడు. ఒకటి రెండు సంవత్సరాలు ఉచితంగా బాబా సేవ చేసిన తరువాత సాయిబాబా సంస్థాన్ వారు అతన్ని శాశ్వత పూజారిగా నియమించారు. నానుమామా తదనంతరం అతని కొడుకు దిగంబర్ సమాధిమందిరంలో బాబా ఆరతి నిర్వహించే పూజారి అయ్యాడు. ప్రస్తుతం ఆ కుటుంబ వారసులు నగరపాలక కార్యాలయానికి వెనుకనున్న హెగ్డేవార్ నగర్ లో నివాసముంటున్నారు. వారు నివాసముంటున్న ఆ ఇంటిని దిగంబరే కొనుగోలు చేశారు.
సమాప్తం

Sources: Baba’s Anurag by Sai Bhakta Vinny Chitluri,
Devotees' Experiences of Sri Saibaba part III

Om sai ram!🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDelete