ఈ భాగంలో అనుభవం:
- బాబా ఎప్పుడూ నాతోనే ఉంటారు
USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను ఒక అనుభవాన్ని సవివరంగా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది చదివిన తరువాత బాబా తన ప్రియమైన భక్తులను ఎలా చూసుకుంటారో మీకు అర్థమవుతుంది.
నేను తండ్రిలేని బిడ్డని. నాకు భారతదేశంలో ఆర్థిక వనరులేవీ అందుబాటులో లేవు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వెళ్లిపోదామనే ఉద్దేశ్యంతో నేను M.S చదవడానికి USA(నార్త్ కరోలినా) వచ్చాను. బాబా దయవల్ల చదువుకునేందుకు నాకు విశ్వవిద్యాలయంలో పూర్తి నిధులు(ఫండ్స్) లభించాయి. నేను ఇంకో రెండునెలల్లో నా M.S పూర్తి చేసి గ్రాడ్యుయేట్ అవుతాననగా నేను, నా స్నేహితులు ఇంటర్వ్యూలకి సిద్ధమవుతున్నాము. ఒక రాత్రి నేను, నా ఫ్రెండ్ సినిమా చూస్తుండగా అకస్మాత్తుగా నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. నన్ను అత్యవసర పరిస్థితి క్రింద హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పొటాషియం తక్కువ కావడం వలన అదొక రకమైన ఆందోళన(anxiety) వలన వచ్చిన ఎటాక్ అని డాక్టర్స్ చెప్పారు. నాపై నాకు నమ్మకం ఎక్కువ, ఎటువంటి పరిస్థితినైనా చక్కదిద్దుకోగలనని. అలాంటి నాకు ఆందోళనకరమైన ఎటాక్ అంటే ఒక్కక్షణం నేను నమ్మలేకపోయాను. నిజానికి ఆ విషయమే నన్ను ఆందోళనకు గురిచేసింది. అప్పటినుండి తీవ్రమైన పీడకలలు, అధిక రక్తపోటుతో గుండె కొట్టుకోవడం వంటి సమస్యలు నన్ను చాలా ఒత్తిడికి గురిచేసేవి. దాంతో నా మనస్సు నియంత్రణ కోల్పోయి, నేను పూర్తిగా నిస్సహాయురాలినైపోయాను. ఆ సమయంలో నా ప్రియమైన బాబా నాకు సహాయం చేశారు. నా స్నేహితులలో ఒకరి కుటుంబం ఇక్కడ ఉంది(వారు హిందూ పూజారులు). వాళ్ళు నన్ను తమ ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యురాలిలాగా చూసుకున్నారు. నాకోసం పూజలు చేసి, దాదాపు 2 వారాలు నాకు ఆహారాన్నిచ్చి నన్ను ఆదుకున్నారు. అది నాకు కొంత ఉపశమనాన్నిచ్చింది. కానీ భయం మాత్రం నన్ను వీడిపోలేదు. నా కడుపు పూర్తిగా అదుపు తప్పిపోయింది. కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నా ఆరోగ్యం మరింత దిగజారిపోతున్నట్లు గమనించాను. ఏ ఆహారమూ నాకు సరిపడక దాదాపు ప్రతిదీ తినడం మానేశాను. అది నన్ను బలహీనంగా, మరింత అధ్వాన్నంగా చేసింది.
ఆ పరిస్థితులలో నేను సియాటెల్ లో ఉన్న నా సోదరి వద్దకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వారం తరువాత, 5 నెలల గర్భవతి అయిన నా సోదరికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే అత్యవసర పరిస్థితి మీద హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. డాక్టర్లు, "వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయాలి. కానీ ఆమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువ" అని చెప్పారు. ఆ విషయం తెలిసిన నా సోదరి చాలా ఆందోళనపడింది. నేను తనకి బాబా ఊదీ పెట్టి తనతో, "బాబా ఎల్లప్పుడూ మనకోసం ఉన్నారు. దయచేసి ఆయనని గుర్తుంచుకో" అని చెప్పాను. బాబా దయ, ఆయన ఆశీర్వాదాల వలన ప్రమాదం నుండి తల్లి, బిడ్డ ఇద్దరూ బయటపడ్డారు. కానీ నా పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోసాగింది. ఏది తిన్నా చెవుల్లో ఏదో మోత మోగుతున్నట్లు, నాడి వేగంగా కొట్టుకుంటూ గుండెల్లో గాభరాగా ఉండేది. ఇవికాక చాలారకాల సమస్యలను నేను వివరించలేకపోతున్నాను. ఇదిలా ఉంటే నా సోదరి అత్తమామలు నేను వారి ఇంట ఉండటాన్ని ఇష్టపడేవారు కాదు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా నేను వెళ్లిపోవాలని వాళ్ళు ఎదురుచూస్తున్నారు. నా పరిస్థితి చూస్తే నా గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 నెలలైనా నాకు ఉద్యోగం లేదు. నాకు భీమా లేదు. కనీసం డాక్టర్ ను సంప్రదించడానికి కూడా డబ్బులేదు. అలాంటి స్థితిలో నేనేమీ చేయలేక మౌనంగా అన్నీ భరిస్తూ ఉన్నాను. ఆ స్థితిలో నేను గూగుల్ లో సెర్చ్ చేసి నా సోదరి ఇంటినుండి ఒక మైలు దూరంలో సాయిబాబా మందిరం ఉందని తెలుసుకుని వారానికి రెండుసార్లు అక్కడకు వెళ్లి "నా ఆరోగ్యాన్ని బాగు చేయమ"ని బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. అదే సమయంలో నేను సాయిసచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభించి భారతదేశంలో ఉన్న నాకు తెలిసిన ఒక వైద్యుడికి వీడియో కాల్ చేసి మాట్లాడాను. అతను కొన్ని మందులను పోస్ట్ ద్వారా పంపారు. అవి సరిగ్గా నేను సచ్చరిత్ర పూర్తి చేసిన గురువారంనాడు నాకు అందాయి. ఆశ్చర్యం! ప్రిస్క్రిప్షన్ ఉన్న లెటర్‌హెడ్ మీద సాయిబాబా ఫోటో, ‘ఓం సాయిరామ్, శ్రద్ధ, సబూరి’ అని ఉన్నాయి. బాబా నన్ను కనిపెట్టుకుని ఉన్నారని అనుకున్నాను. ఆ మందులు నెలరోజులు వాడాక నా ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. నన్ను చూసుకోవడానికి మా అమ్మ కూడా వచ్చింది. మేము ఇద్దరం తరచూ బాబా మందిరానికి వెళ్తూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం.
ఇంటిలో మా బావ క్రూరమైన ప్రవర్తనతో మేము చాలా బాధపడుతుండేవాళ్ళం. బయటకు వెళ్ళడానికి నాకు ఇంకా ఉద్యోగం లేదు. నా శరీరానికి ఏమి జరుగుతుందో తెలియదు. అయినప్పటికీ బాబాపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఈలోగా మే నెలలో నా సోదరి ఆరోగ్యకరమైన ఆడశిశువుని ప్రసవించింది. ఆ తరువాత వారంలో నాకు ఉద్యోగం వచ్చింది. నా సోదరి ఇంటికి కేవలం 5 నిమిషాల నడక దూరంలో నేనొక ఇంటిని అద్దెకు తీసుకుని విడిగా ఉండసాగాను. కానీ నా ఆరోగ్యం కారణంగా పనిపై నేను దృష్టి పెట్టలేకపోయాను. ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు, భయాలు, కడుపు సమస్యలు, ఒళ్ళు నొప్పులు, శ్వాస సమస్య, తీవ్రమైన అలసట, నిరాశ.. ఇవన్నీ పని చేయడానికి నన్ను అనుమతించేవి కావు. అయినప్పటికీ నేను ఆశను కోల్పోకుండా బాబాను చాలా దీనంగా ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో చాలా మంచి వేతనంతో వేరే సంస్థనుండి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నేనప్పుడు కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేను. అయినా బాబాని గుడ్డిగా విశ్వసిస్తూ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. బాబా దయతో నాకు ఆ ఉద్యోగం వచ్చింది. నేను మళ్ళీ నార్త్ కరోలినాకు వెళ్లి పని ప్రారంభించాను. అక్కడ నేను ఉండటానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఆశ్చర్యం! "నేను నీతోనే ఉన్నాను" అన్నట్లు ఆ ఇంట్లో గోడపై శ్రీసాయిబాబా క్యాలెండర్ ఉంది. బాబా తప్ప ఆ ఇంటిలో మరేమీ లేదు. ఏదీ లేకపోయినా 'బాబా ఉన్నారు, అది చాలు' అని నమ్మకంతో ధైర్యంగా ఉన్నాను.
కానీ అక్కడ కూడా తీవ్రమైన నా ఆరోగ్య సమస్యలు నన్ను పని చేయనివ్వలేదు. ఆరువారాలు సెలవు పెట్టి పరీక్షలు చేయించుకోవడం కోసం భారతదేశానికి వెళ్ళాను. నా కడుపులో హెర్నియా ఉందని డాక్టర్లు చెప్పారు. అదే నా అనారోగ్య సమస్యకు కారణమో, కాదో తెలియదుకానీ, 6 వారాలు అక్కడ చికిత్స చేయించుకుని తిరిగి USA వచ్చి ఉద్యోగంలో చేరాను. తరువాత నాకొక చిన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. బాబా దయతో సరిగ్గా సమయానికి మా అమ్మ నాకు సహాయం చేయడానికి వచ్చింది. ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నప్పటికీ, అవి ఎందుకు ఉన్నాయో ఏ వైద్యుడూ ఖచ్చితంగా నిర్ధారించలేకపోయాడు.
ఒకరోజు బాబా మందిరానికి వెళ్లాలని నాకు తీవ్రమైన కోరిక కలిగింది. నేను గూగుల్ లో సెర్చ్ చేస్తే నేనుండే చోటునుండి 23 మైళ్ళ దూరంలో బాబా మందిరం ఉందని తెలిసింది. కానీ నాకు కారులేదు. ఉబెర్ లో వెళ్లాలంటే 23 డాలర్ల ఖర్చు అవుతుంది. నా స్థాయికి అది చాలా ఎక్కువ మొత్తం. అందువలన ఏం చేయాలా అని నేను ఆలోచనలోపడ్డాను. వెంటనే నేను ఉండే చోటునుండి ఆలయం వరకు నేరుగా బస్సు అందుబాటులో ఉందని, కేవలం 2 డాలర్ల ఖర్చుతో అక్కడికి చేరుకోవచ్చని తెలిసింది. అప్పుడు బాబా నన్ను గమనిస్తూ నాకు సహాయం చేస్తున్నారని నాకు అనిపించింది. ఇక సంతోషంగా నేను, అమ్మ మందిరానికి వెళ్లి కొంతసేపు అక్కడే గడిపాము. చివరి బస్సు రాత్రి 8:40 కి ఉండటంతో మేము మందిరం నుండి 8:25 కే బయలుదేరాలని అనుకున్నాము. అయితే బాబా నిర్ణయమేమోగాని 8:30కి మేము బయటికి రాగలిగాము. వెంటనే తీవ్రమైన వర్షం ప్రారంభమైంది. మేము తిరిగి వెనుకకు వెళ్లి మందిరం వద్ద నిలబడ్డాము. వెంటనే వర్షం ఆగిపోయింది. మేము నడవడం మొదలుపెట్టగానే మళ్ళీ వర్షం మొదలైంది. మళ్ళీ వెనుక్కి వెళ్ళాము. వెంటనే వర్షం ఆగిపోయింది. కానీ ఈసారి బాబా ఆరతి వినపడటంతో మేము లోపలికి వెళ్లి శేజారతికి హాజరయ్యాము. నేను ఆరతి పాడుతూ ఎంతో ఆనందాన్ని అనుభవించాను. తరువాత మేము బయటకు వచ్చి బస్టాపుకి వెళ్ళడానికి నడక ప్రారంభించాము. వెంటనే వెనుకనుండి ఎవరో మమ్మల్ని పిలిచి, "మా కారులో వెళ్దాం రండి" అని అడిగారు. వాళ్ళు ఆరోజు మమ్మల్ని ఇంటివద్ద వదిలిపెట్టడమే కాకుండా ప్రతి గురువారం మమ్మల్ని బాబా మందిరానికి తీసుకువెళుతున్నారు. నాకోసం బాబా ఎంత గొప్ప ఏర్పాటు చేశారో చూశారా! శ్రీ శిరిడీసాయి ఎప్పుడూ నాతోనే ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" బాబా మిమ్మల్ని ప్రేమిస్తే, ఆయన మిమ్మల్ని అన్నివిధాలా జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సినదంతా చేస్తారు. మీకు ఒంటరిగా, ఆత్రుతగా అనిపించినప్పుడు సచ్చరిత్రగాని, భక్తుల అనుభవాలుగాని చదవండి. ఏ రూపంలోనైనా మీరు తక్షణ ఫలితాలను పొందుతారు. మనకు ఉండాల్సిందల్లా అపారమైన నమ్మకం, సహనం మాత్రమే. ఇంత వివరంగా వ్రాసినందుకు నన్ను క్షమించండి. కానీ ఈ అనుభవాన్ని మీతో పంచుకోమని సలహా ఇచ్చింది బాబానే అని నేను విశ్వసిస్తున్నాను.

ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteనువ్వు లేక నేను లేను సాయి
Jai sainathmaharajuki jai
ReplyDeleteJai sairam
ReplyDeleteOm sairam🙏
ReplyDeleteOm sairam🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete