సాయి వచనం:-
'నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు.'

'కష్టం మీద జీవించడాన్ని నేను ఇష్టపడతాను. అలా ఉండడాన్ని ప్రేమిస్తాను. కోట్లాది రూపాయలు మీరిచ్చినా వాటిని కాదని బాబా పాదాల వద్ద నిలబడి అర్థిస్తాను. చేయి చాచితే అది బాబా ముందే చాచుతాను' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 212వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఉద్యోగంతోపాటు ఊహించని జీతాన్ని అనుగ్రహించిన బాబా
  2. ప్రార్థనలకు సాయి సమాధానం

ఉద్యోగంతోపాటు ఊహించని జీతాన్ని అనుగ్రహించిన బాబా

నేను గత పదేళ్లుగా సాయిబాబా భక్తురాలిని. నేను యుకె వాసిని. బ్లాగులోని అనుభవాలు బాబాపై నాకున్న విశ్వాసాన్ని కఠినమైన కాలంలో సైతం సడలిపోకుండా ఉంచాయి. 2018, జులై నుండి 2019, ఫిబ్రవరి వరకు నా వ్యక్తిగత జీవితంలో కలలో కూడా ఊహించని సమస్యలను నేను ఎదుర్కొన్నాను. నా కెరీర్‌లో ఒక సంవత్సరంపాటు విరామం ఏర్పడింది. ఇంట్లోని సమస్యల కారణంగా నేను ఇంటర్వ్యూలకు సరిగా సిద్ధపడలేకపోయాను. నాకు మద్దతుగా ఉండే నా భర్త పూర్తిగా మారిపోయారు. ఆయన నుండి నాకు ఎటువంటి సహాయం లభించలేదు. ఆ పరిస్థితులలో నాకున్న ఏకైక విశ్వాసం నా సాయిబాబా. నేను సమస్యలన్నింటినీ ఆయనకు వదిలేసి చేయగలిగినంత కృషి చేశాను. సెప్టెంబర్ 2018 నుండి ఫిబ్రవరి 2019 వరకు, ముఖ్యంగా నవంబరు, డిసెంబరులలో నేను చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కానీ, ఒక్కటి కూడా క్లియర్ చేయలేకపోయాను. కొన్ని కంపెనీలలో అయితే మొదటి రౌండ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేయలేకపోయాను. ఆ సమయంలో సాయిసచ్చరిత్ర పారాయణ చేసి, "నాకు సరైన మార్గం చూపించమ"ని బాబాను నిరంతరం ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. క్వశ్చన్&ఆన్సర్ సైట్ ద్వారా "సమస్యలు పరిష్కారమై, నీవు ఊహించని మంచి విజయాన్ని సాధిస్తావు" వంటి సానుకూలమైన సందేశాలను నేను సదా పొందుతూ ఉండేదాన్ని. అవే నాకు మానసిక బలాన్ని చేకూర్చాయి.

అలా ఉండగా నా మాజీ సహోద్యోగులలో ఒకరు నేను అంతకుముందు విఫలమైన ఒక సంస్థలో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఉద్యోగంలో చేరేందుకు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఇంటిలోకి మారబోతున్నారని నాకు తెలిసింది. నేను అసూయపడలేదుగానీ, అతను రాకముందే నాకు ఉద్యోగం వస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ కేవలం 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది. అంత తక్కువ సమయంలో నాకు ఉద్యోగం ఎలా వస్తుందోనని ఆలోచిస్తూ, "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఒకే వారంలో 2 కంపెనీల ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయ్యాయి. మొదటి కంపెనీ ఇంటర్వ్యూ ప్రక్రియలో 3 దశలున్నాయి. అవి జరుగుతున్నప్పుడే రెండో కంపెనీ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయ్యింది. రెండో కంపెనీలో ప్రక్రియ చాలా సులభంగానూ, పైగా చాలా వేగవంతంగానూ ఉండటంతో నేను ఆ ఉద్యోగానికి ఎంపికయ్యాను. అది మొదటి కంపెనీలోని కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియను ఎదుర్కోవడానికి కావాల్సినంత నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకిచ్చింది. నిజానికి నాకు ఆ కంపెనీలో చేరడానికి ఇష్టంలేదు. అయినా నావంతు పూర్తి కృషిచేసి, ఆ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేశానని నేను వినాలనుకున్నాను. ఎందుకంటే, నేను ఆ ఇంటర్వ్యూను క్లియర్ చేయలేనని నా భర్త భావించినందున ఎలాగైనా ఇంటర్వ్యూను క్లియర్ చేయాలని నేను అనుకున్నాను. ఉద్యోగంలో చేరేందుకు నాకు పెద్దగా ఆశలు లేనందున ఇంటర్వ్యూ తర్వాత రిజల్ట్ తెలుసుకోవడానికి నేను కన్సల్టెంట్‌కి ఫోన్ కూడా చేయలేదు. ఇంటర్వ్యూ శుక్రవారం జరగగా, సోమవారం సాయంత్రం 'నేను ఇంటర్వ్యూను క్లియర్ చేశాన'ని కన్సల్టెంట్ నుండి కాల్ వచ్చింది. ఆ కంపెనీ మా ఇంటికి దగ్గరగా ఉన్నప్పటికీ, అక్కడ పని చేయడం సౌకర్యంగా ఉండదని భావించి నేను ఆ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు. అందువలన జీతం వంటి కొన్ని కారణాలను అడ్డుగా చెప్పి 'నో' చెప్పాలని అనుకున్నాను. నిజానికి నాకు జీతం సమస్యే కాదు. బాబా ఇవ్వదలుచుకుంటే నేను అడిగినంత జీతం పొందుతాను. ఒకవేళ అంతకన్నా తక్కువైనా నేను అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ బాబా దయతో నేను అడిగినంత జీతం ఆమోదించబడింది. 2 రోజుల తరువాత మరిన్ని వివరాల కోసం నేను కన్సల్టెంట్‌ను సంప్రదిస్తే, "నా జీతం ఇంకా అదనంగా 1000పౌండ్స్(84,708.05రూపాయలు) పెంచారని చెప్పారు. నేను అవాక్కైపోయాను. నిజంగా ఇది అద్భుతం! ఎందుకంటే, సాధారణంగా జీతం మనం అడిగినంత, లేదా అంతకన్నా తక్కువే ఇవ్వబడుతుంది. కానీ నా విషయంలో నేను కోరిన దానికంటే చాలా అదనంగా ఇవ్వబడింది. ఇదంతా నా బాబా వల్ల మాత్రమే జరిగింది. నా జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ నా బాబా ఆశీస్సులవల్లనే. పరిస్థితి ఏమైనప్పటికీ, బాబాపై మీ పూర్తి నమ్మకాన్ని ఉంచండి. ఆయన అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా వాటిని ఆయన పరిష్కరిస్తారని నాకు తెలుసు. "బాబా! నాకు, నా కుటుంబానికి మరియు మీ భక్తులందరికీ తోడుగా ఉండండి".

ప్రార్థనలకు సాయి సమాధానం

నేను ఒక సాయిభక్తురాలిని. నాకు వివాహమైయ్యేనాటికి వెంకటేశ్వరస్వామి, శివుని గురించే తెలుసు. సాయిబాబా గురించి అస్సలు తెలియదు. నా భర్తకు బాబాపట్ల అపారమైన నమ్మకం. నేను ఆయనతో చాలాసార్లు అయిష్టంగానే బాబా మందిరానికి వెళ్ళాను. అయితే ఒకరోజు బాబా నాకు శ్రీరామునిగా దర్శనమిచ్చారు. అప్పటినుండి బాబా నన్ను నడిపిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన నా ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు, నాకు శ్రేయస్కరమైతే నిమిషాల్లో ఆశీర్వదిస్తున్నారు. 2019, అక్టోబర్ లో ఒకరోజు నేను సెలవు అడిగే వీలులేనందున నా షెడ్యూల్‌లో మార్పు కోసం బాబాని అభ్యర్థించాను. కొన్ని గంటల్లో నా ప్రార్థనకు సమాధానం లభించింది. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం బాబాకు సర్వస్య శరణాగతి చెందితే, ఆయన మన సంరక్షకుడిగా ఉంటూ ముందుకు నడిపిస్తారు.

4 comments:

  1. Sai bagavanki jai please bless me baba

    ReplyDelete
  2. om sai ram sai baba is sadguru .we pray to sai baba to take care us.i have many leelas of sai.one is he gave health to me.i suffered with leg pain.i went to siridi fist time.with his blessings i got curedi took homepati medicines for6 years.i started walking freely.that is sai baba.i love him. i like him.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo