ఈరోజు భాగంలో అనుభవాలు:
- కడుపులోని బిడ్డ సమస్యను బాబా స్వీకరించారు
- అందంగా సమస్యను తీర్చిన బాబా
కడుపులోని బిడ్డ సమస్యను బాబా స్వీకరించారు
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయి బిడ్డని. సాయిభక్తులందరితో నా అనుభవాలను పంచుకోవడం నేను ఆశీర్వాదపూర్వకంగా భావిస్తున్నాను. తోటి భక్తుల అనుభవాల ద్వారా జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి తగినంత బలం చేకూరుతుంది. తమ అనుభవాలు పంచుకుంటున్న భక్తులందరికీ నా కృతజ్ఞతలు. నేను బాబాకు తోటి భక్తులతో పంచుకుంటానని వాగ్దానం చేసిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
బాబా దయతో నేను 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన అనుభవమిది. బిడ్డకి స్కాన్ చేసిన డాక్టర్, "బిడ్డ తలపై ఒక తిత్తి ఉంది. కానీ చింతించాల్సిన అవసరంలేదు, 28 వారాల తర్వాత అది దానంతట అదే తొలగిపోతుంది" అని చెప్పారు. దానితో నేను చాలా ఆందోళనపడ్డాను. అయితే నాకు బాబాపై నమ్మకం ఉంది. ఆయన ప్రతీదీ జాగ్రత్తగా చూసుకుంటారని ఆ విషయాన్ని ఆయన పవిత్ర పాదాలకు సమర్పించుకున్నాను. ఎప్పుడు నేను స్కానింగ్ కోసం హాస్పిటల్ కి వెళ్లినా మేము మైసూర్ పర్యటనలో కొనుక్కున్న చిన్న బాబా రాగి విగ్రహాన్ని నాతోపాటు తీసుకుని వెళుతుంటాను. ఆరోజు కూడా నేను ఆ బాబా విగ్రహాన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను. నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక బాబా విగ్రహాన్ని మా ఇంటి పూజగదిలో ఉంచబోతుండగా బాబా తలపై ఒక చిన్న రంధ్రం ఉండటం గమనించాను. అంతకుముందు లేనిది అప్పుడు కనిపించేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఆ విగ్రహాన్ని కొనే సమయంలో మేము అణువణువూ పూర్తిగా తనిఖీ చేసి మరీ తీసుకున్నాము. పైగా ఎన్నో రోజులుగా ఆ బాబాను చూస్తూనే ఉన్నాను. నాకు స్పష్టంగా తెలుసు ఆ రంధ్రం లేదని. అందువలన నా బిడ్డకున్న తిత్తిని బాబా తన తలపైకి తీసుకున్నారని నాకు అర్థమైంది. బాబా అంత కృప చూపాక నేను ఆందోళన చెందడానికి ఏమీ లేదని గ్రహించాను. తరువాత గురువారం నేను బిడ్డ గ్రోత్ గురించి స్కాన్ చేయించడం కోసం హాస్పిటల్ కి వెళ్ళాను. బాబా దయవల్ల 'అంతా బాగానే ఉంది, తిత్తి కూడా తొలగిపోయింద"ని డాక్టర్ చెప్పారు. నా సంతోషానికి అవధుల్లేవు. మనసారా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా ఎంత అద్భుతలీల చేశారో చూడండి. నా బిడ్డను అన్నిరకాల వ్యాధుల నుండి రక్షించి తను ఆరోగ్యంగా ఉండేందుకు నేను ప్రతిరోజూ ఉదయం, రాత్రి బాబా ఊదీ నీళ్లలో కలిపి తీసుకుంటున్నాను. నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, తనని చూసుకోవటానికి బాబా ఉన్నారు. ఆయనపై నాకు అపారమైన నమ్మకం ఉంది.

అందంగా సమస్యను తీర్చిన బాబా
బెంగుళూరు నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను బాబాకు సాధారణ భక్తురాలిని. మా కుటుంబంలో ఎవరికీ బాబాతో అనుబంధం లేదు. అలాంటిది ఆయనతో నాకు అనుబంధం చాలాకాలం క్రితం, అంటే 2011-2012 మధ్యకాలంలో చాలా అద్భుతంగా మొదలైంది. నా జీవితంలో కఠినమైన దశ నడుస్తున్నప్పుడు, నేను కొంత ఓదార్పు కోరుకుంటున్నప్పుడు బాబా వివిధ రకాలుగా నా వద్దకు రావడం ప్రారంభించారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోనో లేదా ఏదైనా సందేశమో నా దృష్టిలో పడుతుండేది. నెమ్మదిగా నేను వాటిని గమనించడం మొదలుపెట్టాను. నిదానంగా ఆయనతో నాకు అనుబంధం ఏర్పడుతూ వచ్చింది. ఆ సమయంలో నేను సాయిభక్తుల అనుభవాలతో ఉన్న ఒక ఇంగ్లీష్ వెబ్‌సైటును చూశాను. తద్వారా ఆయనపై నాకు విశ్వాసం బలపడింది. అప్పటినుండి బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. వాటిని తోటి భక్తులతో పంచుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ, ఏదో ఒక కారణం చేత అది సాధ్యపడలేదు. ఇన్నాళ్ళకి నా ప్రయత్నం ఫలించింది. నేనిప్పుడు 2018 సెప్టెంబర్ 27 గురువారంనాడు నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
కొంతకాలంగా నేను నా స్నేహితుడి వద్దనుండి ఒక వ్యక్తిగత సహాయం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ తను తిరస్కరిస్తాడేమోననే భయంతో నేను అతన్ని నేరుగా అడగలేకపోయాను. ఆ విషయమై నేను చీటీల పద్ధతి ద్వారా బాబా అభిప్రాయాన్ని అడగాలని అనుకుని, "తను ఏమి చెప్పినా హృదయపూర్వకంగా అంగీకరిస్తాన"ని మౌనంగా బాబాను ప్రార్థించాను. బాబా సానుకూలంగా సమాధానమిచ్చారు. కానీ నాకు నమ్మకం కుదరక, "సాయంత్రం వరకు వేచిచూద్దాం, అప్పటికి స్పష్టంగా అర్థమవుతుందేమో" అని అనుకున్నాను. ఆలోగా ప్రతికూల ఫలితాన్ని సైతం స్వీకరించడానికి నన్ను నేను సిద్ధపరుచుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే, సత్యాన్ని స్వీకరించక తప్పదు కదా! సాయంత్రమవుతున్నా నాకెటువంటి సంకేతం అందకపోవడంతో బహుశా బాబా నా కోరికను తిరస్కరించారని నేను అనుకున్నాను. అయితే బాబా దయతో నా కోరిక నెరవేరింది. అది చాలా అద్భుతంగా జరిగింది. నా స్నేహితుడు నాకు స్వయంగా ఫోన్ చేసి, "క్రిందకు వస్తావా? కాసేపు మాట్లాడుకుందాం" అని అడిగాడు. నేను సరేనని వెళ్ళాను. మేము కొన్ని సాధారణ విషయాల గురించి చర్చించుకుంటున్నాము. నేరుగా తనని సహాయం అడగమని నా మనసు చెబుతున్నప్పటికీ, బాబా తనదైన మార్గంలో ఏదైనా చేస్తారని ఓపికగా నేను వేచి ఉండటానికి ప్రయత్నించాను. ఇక మేము బయలుదేరే సమయం వచ్చింది. నా స్నేహితుడు నాతో, "ఎందుకు నువ్వు నన్ను సహాయం అడగటంలేదు? ఎందుకిలా అంటున్నానంటే, నేను నీకు సహాయం చేయగలనని నాకు తెలుసు" అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. "తను నాకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటే, నేనెందుకు తననుండి సహాయం తీసుకోవటానికి ఇంత ఆలోచించాను?" అని నా మనసులో అనుకుని తనకి విషయం చెప్పాను. అంత అందంగా సమస్యను తీర్చినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కాబట్టి, బాబాపై, ఆయన మార్గాలపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. కొన్నిసార్లు ఆయన ప్రతిస్పందించడానికి చాలా సమయం పడుతుంది. కానీ, ఆయన చేసేది ఏదైనా మన మంచికోసమే. ఆయన మార్గాలు అనూహ్యమైనవి. ఎట్టిపరిస్థితులలోనూ బాబాను వదులుకోవద్దు.
Jai sai ram
ReplyDelete🕉 sai Ram
ReplyDelete