ఈ భాగంలో అనుభవాలు:
- అడిగిన వెంటనే బాబా ఆదుకున్నారు
- బాబాపై విశ్వాసాన్ని పెంచిన అనుభవం
అడిగిన వెంటనే బాబా ఆదుకున్నారు
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నాకు బాబా ప్రసాదించిన అనుభవాలను మొదటిసారి మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది.
మేము మూడు సంవత్సరాల పాటు ఒక ఇంటిలో అద్దెకు వున్నాము. ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఇంటి యజమాని మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టారు. నేను బాబాతో, “వారు మమ్మల్ని ఇబ్బందిపెట్టకుండా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా” అని చెప్పుకున్నాను. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత రోజునుండి వారు మమ్మల్ని ఇబ్బందిపెట్టడం మానేశారు. నేను ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత మేము బాబా దయవలన మంచి ఇంట్లో చేరాము.
మరొక అనుభవం:
ఒకసారి నా ఫ్రెండుకి కిడ్నీలో రాయి ఉందని, దానిని సర్జరీ చేసి తొలగించాల్సి వుంటుందని డాక్టర్ చెప్పారు. నా ఫ్రెండ్ చాలా భయపడ్డారు. అదేరోజు నేను చేస్తున్న సాయి సచ్చరిత్ర (34వ అధ్యాయము) పారాయణలో, ఒక వృద్ధుడు కిడ్నీలో రాయితో ఎంతో బాధపడుతున్నప్పడు, బాబా ఊదీని నీళ్ళలో కలిపి సేవించడం వలన ఆ రాయి కరిగి మూత్రం ద్వారా బయటపడి ఆ వృద్ధుడు ఆరోగ్యవంతుడైన అనుభవాన్ని చదివాను. వెంటనే నేను, “నా ఫ్రెండుకి సర్జరీ అవసరం లేకుండా కిడ్నీలో రాయి కరిగిపోయేలా చేయండి బాబా. అలా జరిగితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. నా ఫ్రెండ్ ఆరోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయించారు. డాక్టరు ఆ రిపోర్టు చూసి, “సర్జరీ ఏమీ అవసరం లేదు. మందులతో తగ్గిపోతుంది” అని చెప్పారు. ఆ సంగతి తెలిసి, నా ప్రార్థన విని నా ఫ్రెండుకి సర్జరీ అవసరం లేకుండా చేసినందుకు నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
“చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఈ అనుభవాలన్నీ ఇంత ఆలస్యంగా బ్లాగులో పంచుకున్నందుకు క్షమించండి బాబా! మీ ఆశీస్సులు ఇలాగే అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి బాబా!”

బాబాపై విశ్వాసాన్ని పెంచిన అనుభవం
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ముందుగా మన సద్గురు సాయికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల క్రితం మంచంమీద పడుకుని బాబా నన్ను ఎలా తన భక్తురాలిగా మలచుకున్నారో గుర్తుచేసుకోవడం ద్వారా నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. చిన్నప్పటినుంచి మా ఇంట్లో బాబా ఫోటో ఉండేది. కానీ ఆయన గురించి నాకేమీ తెలియదు. దేవతలందరితోపాటు ఆయనను కూడా ఆరాధించేదాన్ని, అంతే! అయితే, 2008లో ఈ పిచ్చుకను బాబా తమ వైపుకు లాక్కున్నారు. సాయిబాబా మందిరాన్ని నిర్మించిన బంధువులు మాకు ఉన్నారు. ఆ మందిరంలోని బాబా విగ్రహం దాదాపు శిరిడీలో బాబా విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఆ మందిర వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న గొప్ప వేడుకగా జరుపుకుంటారు. నేను, నా తోబుట్టువులు సాధారణంగా డిసెంబర్ 25న వెళ్ళకుండా ఆ వేడుకకు ముందు లేదా తరువాత మందిరాన్ని దర్శిస్తూ ఉంటాము. ఎందుకంటే, మా బంధువులు ఉన్నత తరగతి కుటుంబానికి చెందినవారు. వాళ్ళు మమ్మల్ని అవమానించడానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరు. కానీ ఆ సంవత్సరం మందిర వార్షికోత్సవానికి కొన్ని కారణాల వల్ల మా అమ్మ వెళ్లే వీలులేకపోవడంతో నాన్న నన్ను తనతో రమ్మని అడిగారు. నేనింక తప్పనిసరై నాన్నతోపాటు వెళ్ళాను. మేము మందిరంలోకి ప్రవేశించేసరికి బాబా అందమైన చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతించారు. మేము ఎన్నోసార్లు అక్కడి బాబాను దర్శించాముగానీ ఆసారి ఆయన చిరునవ్వు ఎంతో భిన్నంగా ఉంది. నేను నాన్నతో, "నన్ను ఇబ్బందిపెట్టడానికి మళ్ళీ వచ్చారని బాబా ఆలోచిస్తున్నారేమో!" అని అన్నాను(అలా అనుకున్నందుకు నన్ను క్షమించండి బాబా). ఆ సమయంలో బాబాకి అభిషేకం జరుగుతోంది. అక్కడ చాలామంది జనం ఉన్నారు. నేను మా బంధువులను పలకరించాను. కానీ ఎప్పటిలాగే వారినుండి ఎటువంటి స్పందనా లేదు. బంధువులలో ఒక అంకుల్ నన్ను వెళ్లి బాబాకు అభిషేకం చేయమని అడిగారు. కానీ ఆ మందిర యజమాని భార్య నన్ను అందరిముందూ ఏమైనా అంటుందేమో అనే భయంతో నేను ముందుకు వెళ్లకుండా కేవలం తల ఆడించి ఉండిపోయాను. అయితే అంకుల్ ఊరుకోకుండా నన్ను బలవంతపెట్టారు. దానితో నేను నాన్న వైపు చూశాను. ఆయన కూడా వెళ్ళమని చెప్పారు. నేను బాబాతో, “నన్ను కాపాడండి బాబా” అంటూ వెళ్ళాను. పైకి వెళ్ళాను కానీ, 'నువ్వెందుకు పైకి వచ్చావనో లేదా ఇంకేదైనా ఆవిడ అంటుందేమోన'ని భయపడుతూనే బాబా మీద నీళ్ళు పోయడం మొదలుపెట్టాను. ఆమె నన్ను చూసింది కానీ ఒక్కమాట కూడా అనలేదు. నేను సంతోషంగా తిరిగి క్రిందకి వచ్చాను. ఆ రోజంతా బాగానే జరిగింది. ఆరోజునుండి నాకు బాబాపై విశ్వాసం పెరిగింది. "ఐ లవ్ యూ బాబా! దయచేసి నన్ను మీ నిజమైన భక్తురాలిగా మలచండి".
Om Sai Ram please. Bless baba.today Leelas are very excited.i love you baba.i like you.om Sai Ram.blessus Baba.
ReplyDeleteOm sai ram bless me baba
ReplyDeleteOm saisadgur please help me
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete