ఈ భాగంలో అనుభవాలు:
- నమ్ముకున్నవారికి బాబా రక్షణ తప్పక లభిస్తుంది
- నమ్మితే చాలు, బాబా మనకోసం ఏదైనా చేస్తారు
నమ్ముకున్నవారికి బాబా రక్షణ తప్పక లభిస్తుంది
సాయిభక్తురాలు అంజలి బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబాబాకి నేను 16 సంవత్సరాలుగా భక్తురాలిని. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఎన్నో సమస్యల నుండి నన్ను బయటకు లాగారు. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2014, సెప్టెంబరులో నేను మా పాపకు జన్మనిచ్చే సమయంలో జరిగిన సంఘటన ఇది. నా కాన్పు చాలా కష్టమైంది. డాక్టర్ నాలుగు రోజుల్లో ఆపరేషన్ చేద్దామని చెప్పారు. ఆలోగా నాకు జలుబు, దగ్గు మొదలయ్యాయి. అప్పటికే నన్ను హాస్పిటల్లో చేర్పించారు. జలుబు, దగ్గు ఎక్కువ అవుతున్నప్పటికీ నాకు హార్మోనల్ సమస్య ఉండటంతో డాక్టర్, "త్వరగా డెలివరీ చేయాలి. లేదంటే లోపల బేబీకి సమస్యలు వస్తాయి" అని చెప్పింది. దాంతో నేను ఆపరేషనుకి సిద్ధమయ్యాను. ఆపరేషన్ థియేటర్‌కి నన్ను తీసుకొని వెళ్లే లోపల నేను బాబాను ప్రార్థించుకుంటూ స్తవనమంజరి 11సార్లు పారాయణ చేశాను. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకొని వెళ్ళిన తరువాత మత్తు ఇచ్చే డాక్టర్, "ఇంత జలుబు, దగ్గు పెట్టుకొని డెలివరీ ఏమిటి?" అని నన్ను కోప్పడి, "ఈ పరిస్థితిలో ఆపరేషన్ చేస్తే కుట్లు వేసే చోట ఎప్పటికైనా చాలా సమస్య అవుతుంది" అని చెప్పారు. నాకు భయమేసినా బాబా మీద భారం వేసి ఆపరేషన్ చేయించుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను అందమైన పాపకు జన్మనిచ్చాను. అద్భుతం ఏమిటంటే, ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ దగ్గు అదుపులో ఉంది. కుట్లు వేసి నన్ను గదిలోకి మార్చిన తరువాత మళ్ళీ దగ్గు మొదలైంది. బాబా దయవలన కొన్నిరోజులలో ఆ సమస్య తగ్గిపోయింది. ఆ డాక్టర్ చెప్పినట్లు కుట్లు వేసిన చోట ఇప్పటివరకూ నాకు ఏ సమస్యా రాలేదు. నేను చాలా ఓవర్ వెయిట్ వుంటాను. అందువలన నాకు డెలివరీ పునర్జన్మ అని చెప్పాలి. బాబా దయవలనే నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డాను. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్న బాబాకి జీవితాంతం నేను కృతజ్ఞురాలినై ఉంటాను. సర్వకాల సర్వావస్థలయందు ఆయనే దిక్కు అని నమ్మినవారిని బాబా ఖచ్చితంగా కాపాడుతారు.

నమ్మితే చాలు, బాబా మనకోసం ఏదైనా చేస్తారు
భద్రాచలం నుండి సాయిభక్తురాలు ప్రియాంక బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిరామ్! నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను బాబాని నమ్ముతున్నాను. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటాను. వెంటనే ఆయన నాకు రక్షణనిస్తూ ఉంటారు. ఈమధ్య బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక కోరిక ఉండేది. అది జరగాలంటే మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకోవాలని బాబాని చాలా గట్టిగా అడిగాను. వెంటనే బాబా నాకు సహాయం చేశారు.
మరో అనుభవం:
మా అమ్మ, చెల్లి భద్రాచలం వద్దామని 2019, అక్టోబరు 13న చెన్నై నుండి బయలుదేరారు. వాళ్ళు విజయవాడలో 12:30కి దిగుతారు కాబట్టి, మళ్ళీ 4 గంటలకు విజయవాడ నుండి భద్రాచలానికి వెళ్ళే బస్సుకు టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకొని ఉన్నారు. ఐతే వాళ్ళు చెన్నైలో ట్రైన్ ఎక్కాక బస్సు డిపో వాళ్ళు, "తెలంగాణ ఆర్.టి.సి. సమ్మె కారణంగా బస్సు రద్దు చేయబడింద"ని మెసేజ్ పెట్టారు. ఆ విషయం నాకు తెలిసి, "బస్సులు లేకపోతే వాళ్ళు ఎలా వస్తార"ని చాలా కంగారుగా అనిపించింది. ఏమి చేయాలో అర్థంకాక, "బాబా! అమ్మావాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చండి. అలా జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అద్భుతం! ట్రైన్ విజయవాడ చేరాల్సిన సమయానికన్నా ముందుగానే చేరుకుంది. అమ్మావాళ్ళు 12 గంటలకు విజయవాడలో దిగారు. బాబా దయవలన 12:30కి భద్రాచలం వెళ్ళే బస్సు దొరకడంతో 4:40 కల్లా వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా క్షేమంగా మా ఇంటికి చేరుకున్నారు. బాబాని నమ్మితే చాలు, ఆయన మనకి అన్నీ చేస్తారు.

Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete