సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 191వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. భక్తులపై బాబాకున్న ప్రేమ అపారం!
  2. అండగా ఉన్న బాబా

భక్తులపై బాబాకున్న ప్రేమ అపారం!

ఒక సాయిసోదరి తనకి బాబా ఇచ్చిన అనుభవాల్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.

అందరికి నమస్కారం. నాపేరు 'సాయి'. మా నాన్నగారు గొప్ప సాయిభక్తులు. ఆయన జీవించి ఉన్నకాలంలో క్రమం తప్పకుండా ప్రతి గురువారం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళేవారు. ఆయన భరద్వాజ్ మాస్టర్ గారిని తన గురువుగా భావించి ఆరాధించేవారు. ఆయన ద్వారా నేనుకూడా ప్రతిరోజు సచ్చరిత్ర పారాయణ చేసి, బాబా ఊదీ ధరించడం అలవాటుగా చేసుకున్నాను. ఒకసారి మా అక్క శిరిడీ నుండి గ్లాస్ ఫ్రేమ్ ఉన్న ఒక బాబా ఫోటో తెచ్చి నాకిచ్చింది. నేను దానిని జాగ్రత్తగా మా ఇంటిలో ఒకచోట పెట్టాను. మాఇంట్లో తిరిగే పిల్లులు ఆ ఫోటోను క్రిందకు తోసేసాయి. నేను ఎంత జాగ్రత్త తీసుకుని ఆ ఫోటోను భద్రపరుస్తున్నా అవి తోసేస్తూ ఉండేవి. అలా మూడుసార్లు చాలా ఎత్తునుండి కిందపడ్డప్పటికీ గ్లాస్ ఏమాత్రం దెబ్బ తినలేదు. అది కచ్చితంగా బాబా లీలేనని నేను గట్టిగా నమ్ముతున్నాను.

రెండో అనుభవం:

ఈ సంవత్సరం(2019) ఫిబ్రవరిలో వచ్చిన శివరాత్రి నాటిరాత్రి మేము గాఢనిద్రలో ఉన్నాము. అకస్మాత్తుగా నన్ను ఎవరో లేపుతున్నట్టుగా అనిపించి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే, సీలింగ్ ఫ్యాన్ నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయి. సరిగా దాని క్రింద అమ్మ పడుకుని ఉంది. వెంటనే నేను తేరుకుని గాభరాగా ముందు అమ్మని నిద్రలేపాను. తాను కంగారుపడుతూ లేచి నిర్ఘాంతపోయింది. తరువాత ఫ్యాన్ ఆపేసాము. సమయానికి నన్ను నిద్రలేపి మా ప్రాణాలను రక్షించింది బాబా కాక మరెవరు? బాబా తన బిడ్డల రక్షణ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో తెలియజేసిన అనుభవమిది. "చాలాచాలా ధన్యవాదాలు బాబా మీకు".

మూడో అనుభవం:

ఈ మధ్య ఒకసారి అనుకోకుండా నాకు బ్రీతింగ్ సమస్య రావడంతో ENT డాక్టర్ ని సంప్రదించాను. ఆవిడ పరీక్షించి CT-స్కాన్ చేయించమని చెప్పారు. స్కాన్ చేయించుకున్నాక రిపోర్ట్స్ చూసి మేము ఆందోళన చెందుతుంటే, చుట్టూ ఉన్న వాళ్లంతా సర్జరీ అవసరం అవుతుందని చాలా భయపెట్టారు. దానితో నాకు చాలా ఆందోళనగా అనిపించింది. ఆ సమయంలో నేను బాబానే నమ్ముకుని, "సర్జరీ అవసరం లేకుండా చూడండి బాబా" అని ప్రార్ధించాను. తరువాత ఆ రిపోర్ట్స్ పట్టుకుని నేను, మా అక్క బాబాగుడి మీదుగా హాస్పిటల్ కి వెళ్తూ, గుడి లోపలికి వెళ్లేంత సమయం లేదని అనుకున్నాము. సరిగ్గా బాబాగుడి ముందర మాకు డాక్టర్ ఎదురయ్యారు. ఆమె మాతో, "నేను రావడానికి కాస్త సమయం పడుతుంది. మీరు వేచి ఉండండి" అని చెప్పి వెళ్లిపోయారు. బాబాగుడి ముందరే డాక్టర్ అలా చెప్పడంతో 'ఇంకా సమయం ఉంది, కాబట్టి మీరు లోపలకి రండి' అని బాబా మమ్మల్ని పిలుస్తునట్టుగా అనిపించి, మేము మందిరం లోపలికి వెళ్ళాము. సరిగ్గా అప్పుడే సంధ్య ఆరతి మొదలుకాబోతుంది. సంతోషంగా బాబా ఆరతి చూసి, ప్రసాదం తీసుకుని మరలా హాస్పిటల్ కి వెళ్ళాం. ఆశ్చర్యం! డాక్టర్ రిపోర్ట్స్ చూసి, "అంతా నార్మల్ గా ఉంది. చాలా చిన్నసమస్యే. కేవలం పూర్తి స్పష్టత కోసం స్కాన్ చేయించమన్నాను" అని చెప్పి, మందులు వ్రాసిచ్చారు. ఇదంతా బాబా కృపతోనే సాధ్యం అయ్యింది. మేము గుడిలోపలికి వెళ్ళకుండా హాస్పిటల్ కి వెళ్తుంటే, మమ్మల్ని లోపలకి రప్పించుకునిమరీ, నన్ను ఆశీర్వదించి, సమస్యను తీసేసారు బాబా. "చాలాచాలా ధన్యవాదాలు బాబా. భక్తులపై మీకున్న ప్రేమ అపారం".  

ఓం సాయిరామ్!!!

అండగా ఉన్న బాబా

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను ఆంధ్రప్రదేశ్ వాసిని. నాకు బాబాతో చాలా అనుభవాలున్నాయి. ఆయనపట్ల నాకున్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియదు. నేను బాబా ఆశీర్వాదాలతో వచ్చిన ఒక ఉద్యోగం చేస్తుండేదాన్ని. ఉద్యోగంలో చేరిన తరువాత ప్రతి గురువారం ఏవో ఒక పరిస్థితులు ఎదురవుతూ ఉండేవి. వాటిలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఏమి జరిగినా అవన్నీ బాబాకు తెలుసు, ఆయన చూసుకుంటారని ఆయనకే వదిలేశాను. అయితే ఒకరోజు నా బాస్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను చాలా భయపడిపోయాను. వెంటనే 'నాకు సహాయం చేయమ'ని బాబాను ప్రార్థించాను. తరువాత నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి చాలా ఏడ్చి, "బాబా! ఎందుకిలా జరిగింది?" అని బాబాను అడిగాను. అప్పుడు బాబా నుండి, "ఎందుకంటే, ఇది జరగకపోతే నువ్వు వేరే మంచి ఉద్యోగాన్ని వెతకవు, ఈ ఉద్యోగంలోనే ఉంటావు" అని వచ్చింది. నేను ఆశ్చర్యపోయినా, బాబా లీలను అర్థం చేసుకున్నాను. వెంటనే వేరొక మంచి సంస్థలో ఖాళీలు ఉన్నాయని తెలిసి దరఖాస్తు చేసుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మేము మనుషులం, మీ లీలలను అర్థం చేసుకోలేము. ఎల్లప్పుడూ మాకు అండగా ఉండి రక్షణనివ్వండి". నేను భక్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కలత చెందకండి. కష్టసమయాలందు తప్పకుండా బాబా సహాయం లభిస్తుంది. మన జీవితాలలో జరిగే ప్రతి సంఘటన ద్వారా ఆయన మనకు ఏదో ఒకటి బోధిస్తూ ఉంటారు. ఆయన మననుండి ప్రేమ, ఆప్యాయతను మాత్రమే కోరుకుంటారు. శ్రద్ధ, సబూరీ ఎంతో శక్తివంతమైన ఆయుధాలు. వాటిని వృద్ధి చేసుకోండి. ధన్యవాదాలు బాబా! 

ఓం సాయిరామ్! సాయినాథ్ మహరాజ్ కీ జై! 

3 comments:

  1. ఓం సాయిరాం ,
    సాయి భక్తులందరికి నా నమస్కారాలు ,
    ఎల్లవేళలా సాయి కృప కరుణ కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను.
    నేను సాయితో నేను ఎల్లవేళలా నా భాదలు చెప్పుకుంటూ ఉంటాను .
    ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చిన ఎవ్వరు పరిష్కరించ లేనివి , ఎవ్వరికి చెప్పుకోలేనివి వస్తున్నవి, జీవితం అంటే విసుగు వచ్చేసింది . ఇప్ప్డుడు సాయిని నా ఈ జన్మనుండి విముక్తిని కలిగించమని ఏడుకుంటున్నాను. ఏడ్చి ఏడ్చి విసుకు వచ్చేసింది . దయచేసి మీరు అందరూ నా కోసం సాయి ని ప్రాదించండి.ఈ విషయాలు వ్రాయ వచ్చో లేదో కూడా నాకు తెలియదు . తప్పుగా వ్రాసి ఉంటే మన్నించండి.
    ఓం సాయిరాం , ఓం సాయి రామ్ , ఓం సాయి రామ్ , ఓం సాయి రామ్, ఓం సాయిరాం.

    ReplyDelete
  2. Appreciating the commitment you put into your site and in depth information you offer.
    It's nice to come across a blog every once in a while that isn't the same out of date rehashed
    information. Wonderful read! I've bookmarked your site and I'm adding your
    RSS feeds to my Google account.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo