ఈ భాగంలో అనుభవం:
- సాయి ఇచ్చిన మధురానుభవాలు
- సాయికి ప్రార్థన - లభించిన ఉపశమనం
సాయి ఇచ్చిన మధురానుభవాలు
సాయిభక్తుడు ప్రవీణ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! ఓం శ్రీ గురుభ్యోనమః!
నా పేరు ప్రవీణ్. నా నివాసం హైదరాబాదులోని షాద్‌నగర్. ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 'శిరిడీసాయి సేవారహస్యం' అనే గ్రంథాన్ని పారాయణ చేస్తున్నాను. అందులో ఒకచోట ఇలా ఉంది: "రామ రావణ యుద్ధానంతరం శ్రీరాముడు అందరికీ అనేకరకాల బహుమతులు ఇస్తూ ఉంటారు. అక్కడే ఉన్న హనుమంతుడు, "ప్రభువు నాకేమీ ఇవ్వడం లేదే!" అని అనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు హనుమను దగ్గరకు పిలిచి కౌగిలించుకుంటారు. అప్పుడు హనుమ 'తన స్థానం శ్రీరాముడి హృదయంలో' అని తెలుసుకుని చాలా ఆనందపడతాడు. అది చదివాక నేను సమర్థ సద్గురుడైన సాయితో, "మీ దగ్గర నా స్థానం ఏమిటి?" అని అనుకున్నాను. ఆరోజు రాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాయి దర్శనమిచ్చి, నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. అది స్వప్నమే అయినా సాయి స్పర్శను నేను ఇప్పటికీ మరువలేను. ఆ స్వప్నం ద్వారా 'నా స్థానం సాయి హృదయంలో' అని తెలిసి నేను పొందిన ఆనందాన్ని పదాల్లో వర్ణించలేను. "అడిగినంతనే ఇంత గొప్ప అనుభవాన్నిచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"
మరో అనుభవం:
నేను విజయవాడ దగ్గర చల్లపల్లిలో ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజులలో జరిగిన అనుభవమిది. అప్పుడప్పుడే సాయి నా జీవితంలోకి వస్తున్న రోజులు. నేను మా మేనత్త వాళ్ళ ఇంటిలో ఉండి చదువుకుంటున్నాను. ఒకసారి మా మేనత్త వాళ్ళు శిరిడీ వెళ్లారు. నేను ఒక్కడినే ఇంటిలో వున్నాను. రాత్రి పడుకునేముందు కాసేపు టీవీ చూశాను. ఆ తరువాత టీవీపై ఉన్న సాయిబాబా విగ్రహాన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటున్నాను. ఇంకా ఐదు నిమిషాలు కూడ అయివుండదు. అంతలో టీవీపై ఉన్న సాయి క్రిందకు దిగివస్తున్నారు. అది కల అనుకుందామంటే నేనింకా పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు. సాయి రావటం స్పష్టంగా తెలుస్తుంది కానీ, లేద్దామంటే నేను లేవలేకపోతున్నాను. ఆయన నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టారు. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా, నిజం! ఆ స్పర్శానుభూతి నేను ఎన్నటికీ మరువలేనిది. అది సాయి ప్రేమ!
అంతటి అనుభవాలిచ్చినా సాయి నాతో వున్నారని మరచి, చేయకూడని తప్పులు చేసి సాయి ప్రేమకు నేనే దూరంగా ఉన్నాను. అందుకే ఇంకా సాయికి దూరం కాకూడదని ఇలా నా అనుభవాలను పంచుకుంటున్నాను. అమితమైన ప్రేమను కురిపించే సాయికి నన్ను అర్పితం చేసుకోవాలని, ఎప్పటికీ ఆయనకి శరణాగతుడినై ఉండాలని నా కోరిక.
ఇటీవల ఒక పదిరోజుల క్రితం మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు టైఫాయిడ్, డెంగ్యూ వచ్చి, ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆ సమయంలో నేను, "సాయీ! అమ్మకు ప్లేట్లెట్స్ పెరగాలి. ఆమెకు త్వరగా ఆరోగ్యం చేకూరేలా చేయండి" అని ఆ సాయినాథుని వేడుకున్నాను. సాయి కరుణ వల్ల డెంగ్యూ నెగిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ వృద్ధి చెంది అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. సాయికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కానీ ఈరోజు(2019, అక్టోబర్ 24) నా భార్యకు డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. నేను సాయిపైనే ఆధారపడివున్నాను. నా భార్యకు నయమయ్యేలా సాయి చేస్తారని నాకు నమ్మకం వుంది.
ఓం శ్రీసాయిసమర్థ నమః
ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి.

సాయికి ప్రార్థన - లభించిన ఉపశమనం
సాయిభక్తుడు నీలేష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాయిభక్తుడిని. నా సొంత ఊరు శిరిడీ సమీపంలోని కోపర్‌గాఁవ్. నేను ఒక బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాను. నా క్రింద పనిచేసే ఒకామె రాజీనామా చేసి సంస్థను విడిచిపెట్టింది. ఆమె వెళ్ళిపోయాక తను ఉపయోగించిన ఆఫీసు ల్యాప్‌టాప్ కనిపించకుండా పోయింది. సూపర్‌వైజర్‌గా తనకి ఫోన్ చేసి, ల్యాప్‌టాప్ గురించి అడిగి పెండింగ్‌లో ఉన్న ఫార్మాలిటీలను పూర్తిచేయమని చెప్పాను. కానీ ల్యాప్‌టాప్ ఆచూకీ తెలియలేదు. నేను ఆఫీసు అంతర్గత బృందాలతో ల్యాప్‌టాప్‌ను వెతికించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆమె వెళ్లేముందు తన వద్దనుండి ల్యాప్‌టాప్ వంటివన్నీ హ్యాండోవర్ చేసుకున్న తరువాత క్లియరెన్స్ ఇవ్వడం నా బాధ్యత. కాబట్టి ల్యాప్‌టాప్ దొరక్కపోతే అందుకు నేనే బాధ్యుడనవుతాను. అందువలన సాయిని తలచుకుని, "రెండు గంటల్లో ల్యాప్‌టాప్ దొరికితే మీ మందిరంలో స్వీట్స్ పంపిణీ చేస్తాను. నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తరువాత సాయి దయవల్ల ల్యాప్‌టాప్ ప్రాజెక్ట్ క్యాబినెట్‌లో మా మేనేజరుకి దొరికింది. "సాయినాథా! నన్ను మానసిక ఒత్తిడి నుండి బయటపడేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".
కొన్ని నెలల క్రితం మా కుటుంబమంతా వైరల్ ఫీవర్ మరియు దగ్గుతో బాధపడింది. అందరూ అనారోగ్యానికి గురికావడంతో ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఆ స్థితిలో నేను, "సాయీ! ఈ అనారోగ్యం నుండి మాకు ఉపశమనం లభిస్తే, నేను నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను" అని ప్రార్థించాను. సాయి దయవల్ల ప్రతిఒక్కరూ త్వరగా కోలుకున్నారు. శ్రీ సాయిని ప్రార్థించండి, ప్రశాంతంగా ఉండండి.
Sri sachchidananda samartha sadguru sainath maharajuki jai omsai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDelete