సాయి వచనం:-
'నీవేం భయపడవద్దు. నీ చావుచీటీ చింపేశాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది.'

'ఇంతవరకు అన్నీ చూసుకున్న బాబా రేపటి రోజుల్లో మన బాగోగులు చూసుకోరా?' - శ్రీబాబూజీ.

శ్రీ లక్ష్మణ్ విఠల్ నడ్కర్


1915వ సంవత్సరంలో శ్రీ లక్ష్మణ్ విఠల్ నడ్కర్ తన కుటుంబంతో కలిసి బాబా ఆశీస్సుల కోసం షిర్డీ వచ్చారు. కొన్ని రోజులు షిర్డీలో ఉన్న తరువాత, బాబా షిర్డీ వదిలి వెళ్ళమని వారికి చెప్పారు. కానీ వారు బాబా చెప్పిన విధంగా వెళ్ళకుండా, షిర్డీలోనే ఉన్నారు. ఒకరోజు బాబా తన భక్తులతో లెండీ బాగ్ కి వెళ్తూ నడ్కర్ ని చూసి, "మీరు షిర్డీ విడిచిపెట్టలేదా? వెళ్ళండి" అన్నారు. ఆ రోజులలో గోదావరి నది చిన్న పడవలలో దాటాలి. వెంటనే వారు బయలుదేరి గోదావరి తీరానికి చేరుకున్నారు. కాని పడవ నడిపే వాళ్ళందరూ వారిని నది దాటించడానికి నిరాకరించారు. ఏమి చేయాలో తోచక నది ఒడ్డున నడ్కర్ నిలుచుని, "ఇప్పుడు మేము ట్రైన్ వచ్చే సమయానికి మన్మాడ్ చేరుకోలేము" అని ఆలోచనలో పడ్డాడు. బాబా మాట వినకపోవడం వలన ఇలా ఇబ్బంది పడుతున్నామని అతను చింతించసాగాడు. ఇప్పుడు కుటుంబంతో అడవిలో ఈ రాత్రి ఎలా గడపాలి అని ఆలోచిస్తూ బాబాను క్షమాపణ వేడుకొని, సహాయం కోసం ప్రార్ధించాడు. 

అకస్మాత్తుగా కోపర్గాం మామల్తదారు అక్కడకు చేరుకున్నాడు. నడ్కర్ నది దాటించమని అతనిని అభ్యర్ధించగా, అతడు అంగీకరించాడు. వారు నది దాటి రైల్వే స్టేషన్ చేరుకొనేటప్పటికి, అక్కడ చాలా జన సమూహము ఉంది. అక్కడ విచారించగా రైలు రెండు గంటలు ఆలస్యం అని తెలిసింది. ఈ విధంగా బాబా సహాయంతో నడ్కర్ మరియు అతని కుటుంబం రైలు అందుకొని క్షేమంగా ముంబై చేరుకున్నారు.

Source: SAIBABA'S AMBROSIA BEFORE SAMADHI 

4 comments:

  1. 🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo