సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా జీవితంలో నిజమైన సాయి లీల


మహారాష్ట్ర నుండి పాండే కౌన్ధ్యా అనే సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నాడు బాబా పేరు మీద వచ్చిన రెండు రూపాయల మనియార్డరును, ఎంతవరకు బాబా తెలుసుకొంటారో చూద్దామని ఒక గుంటలో పాతిపెట్టాడు శ్యామా. కొంతకాలం తర్వాత శ్యామా ఇంటిలో దొంగలుపడి ఉన్నదంతా దోచుకుపోయారు. శ్యామా ఏడుస్తూ బాబాకు చెప్పుకొన్నాడు. అందుకు బాబా, "శ్యామా! చెప్పుకునేందుకు నీకు నేనైనా ఉన్నాను. నా రెండు రూపాయలు పోయి 6 నెలలు అయింది. నేను చెప్పుకునేందుకు ఎవరున్నారు?" అన్నారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఇటువంటిదే నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను.

2004వ సంవత్సరంలో నేను బాబా మందిర నిర్మాణం కొరకు 3 లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను. మొదట మందిరంవారికి లక్ష రూపాయలు ఇచ్చాను. మళ్ళీ నెలరోజుల తరువాత 50,000 రూపాయలు ఇచ్చాను. తరువాత 8 రోజులలో 50 వేలు ఇచ్చాను. ఇంకా ఒక లక్ష రూపాయలు ఇవ్వవలసి ఉందన్న విషయం మందిరంవారికి చెప్పాను. కానీ తరువాతి రోజులలో నేను ఆ లక్ష రూపాయలు ఇవ్వడానికి సంకోచించాను. 2011లో బాబాకి నేను ఇవ్వాలనుకున్న లక్షరూపాయలు గుర్తున్నా, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇవ్వలేదు. మొత్తానికి నేను బాబాకి ఇవ్వాలనుకున్న ఆ లక్ష రూపాయలు ఇవ్వకుండా మాట తప్పాను.

2004 నుండి 2018 వరకు 14 సంవత్సరాలలో, 2015 వరకు నేను చేస్తున్న వ్యాపారం చాలా లాభాలతో సంతోషకరంగా సాగింది. 2016లో నా వ్యాపారంలో నా భాగస్వామి నన్ను మోసం చేసి, కోటి రూపాయలు నష్టాన్ని చూపించాడు. 2017వ సంవత్సరం పూర్తయ్యే సమయానికి సమస్యలకు తట్టుకోలేక నేను, నా కుటుంబసభ్యులు చనిపోవాలని అనుకున్నాము. అప్పుడు, బాబాను నేను మోసం చేశాననే విషయం మళ్ళీ గుర్తు వచ్చింది. ఎలాగైనా నేను బాబాకు ఇవ్వవలసిన లక్షరూపాయలు ఇద్దామని నిర్ణయించుకుని, ఆ డబ్బును కొంతమంది దగ్గర అప్పుగా తీసుకోవాలని అనుకున్నాను.

2018, మార్చి 18వ తేదీన బాబా నాతో, "నీవు నాకు ఇస్తాననుకున్న ఋణం నువ్వు ఇవ్వలేదు. నిజానికి అది నీది కాదు, నాది. నాకు ఇవ్వాలనుకున్న లక్షరూపాయలు ఇవ్వు" అన్నారు. అదేరోజు అప్పుగా తీసుకున్న లక్షరూపాయలు ఆ మందిరంలోనే ఇచ్చాను. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆరోజు నేను ఇచ్చిన డబ్బులు చాలా అవసరం అని. ఆ మందిరంలో ఉన్న ఒకరికి బాబా కలలో దర్శనమిచ్చి, "ఈరోజు పాండే డబ్బు తీసుకువస్తాడు" అని చెప్పారని వారు నాకు స్వయంగా చెప్పారు.

మరుసటిరోజు, అనగా 2018, మార్చి 19వ తేదీ ఉదయం నా స్నేహితుడు '3 కోట్ల రూపాయలు నా అకౌంటుకు పంపానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, తనని మన్నించమ'ని కూడా అడిగారు. అందుకే అతని పేరు చెప్పటంలేదు. ఒక్కరోజులో బాబా తమ అనుగ్రహంతో నా కష్టాలు తీర్చి, అదేరోజున వ్యాపారంలో కూడా 22 కోట్ల రూపాయల వర్క్ నాకు ఇచ్చారు. నిజంగా మనకు చెప్పుకోడానికి బాబా ఉన్నారు.

చర్యకు ప్రతిచర్య లోకసహజం. కానీ బాబా ఎన్నడూ శాపాలు పెట్టరు. ఎవరు చేసిన తప్పుకు, వారే శిక్ష అనుభవించటం ప్రకృతి సహజం. ఉద్రేకపడేదీ మనసే, దోషం చేస్తే హెచ్చరించేదీ మనసే. మనకు ఏ దోషం అంటనపుడు, దేవుడికైనా సమాధానం చెప్పవచ్చు.

పాండే కౌన్ధ్యా,
సెల్: 9059122239



2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo