బద్వేల్ నుండి సాయి కార్తీక్ గారు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.
సాయిరామ్ సార్,
ఈవిధంగా మీరు సాయిభక్తుల అనుభవాలను షేర్ చేయడం చాలా బాగుంది. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి, ఎందుకంటే నిత్యం శ్రీ సాయిబాబా వారి లీలావిలాసంలో మునుగుతున్నారు. మీరు ఆ లీలావిలాసంలో మమ్మల్ని కూడా ముంచుతున్నారు. ఆవిధంగా మేము కూడా అదృష్టవంతులము సార్.
అందుకు మీకు కృతజ్ఞతలు సాయి.
శ్రీ సాయిబాబా వారి నుంచి ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా రక్షణ పొందినవారమే... ఒక సందర్భంలో బాబా మా కుటుంబం పైన చూపిన కరుణను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను.
కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఆసుపత్రికి వెళ్లారు. కడుపులో ప్రేగు పొక్కినట్లు వుందని, ఆపరేషన్ చేయాలని అన్నారు వైద్యులు. అమ్మ భయపడిపోయింది. అయినా సరే ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేసి, "రక్తం తక్కువగా వుంది, ఒక నెలరోజులకు మందులు వ్రాసి ఇస్తాను, వాడండి. దానితో రక్తం వృద్ధి చెందుతుంది. తరువాత ఆపరేషన్ చేస్తాను" అని అన్నారు. సరే అని ఇంటికి వచ్చాము. నెల గడిచాక ఆపరేషన్ కోసం హాస్పిటల్ కు బయలుదేరుతూ బాబా వారి దగ్గరకు వెళ్లి, “ఆపరేషన్ కు వెళ్తున్నాం, అంతా మీరే చూసుకోవాలి బాబా!” అని చెప్పి కడప ఆసుపత్రికి వెళ్ళాం. డాక్టర్ పరీక్షించి, "రక్తం బాగా వృద్ధి అయింది. ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాము, అందుకు సిద్ధంగా వుండండి" అని అన్నారు. సరే అని చెప్పాము. ఇంతలో హఠాత్తుగా మా బంధువులలో ఒకామె వచ్చి, నాకు బాగా తెలిసిన వేరే డాక్టర్ వున్నారు, ఆమెకు కూడా ఒకసారి చూపిద్దామని బలవంతంగా ఆ డాక్టర్ వద్దకు తీసుకొని పోయింది. అక్కడికి వెళ్ళాక ఆ డాక్టర్ పరీక్షించి, "దీనికి ఆపరేషన్ అవసరం లేదు, ఇది టాబ్లెట్స్ తో తగ్గుతుంది" అన్నారు. ఇంక సరే అని ఆపరేషన్ చేయించుకోకుండా తిరిగి ఇంటికి వచ్చేశాం. అంతా బాబాగారే చూసుకుంటారులే అని వదిలివేసాం. అప్పటినుండి చాలా రోజుల వరకు అమ్మకు ఈ సమస్య లేకుండా బాగానే ఉంది.
కాని 9, 10 సంవత్సరాల తరువాత మరలా అదే సమస్య వచ్చింది. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు ఎంతగానో మారాయి. అసలే అమ్మకు భయం. ఇప్పుడున్న పరిస్థితిలో ఆపరేషన్ అంటే చాలా కష్టం అవుతుంది అని ఆసుపత్రికి వెళ్ళడానికి ముందు బాబాతో, “అమ్మకు ఏమీ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పేలా చేయండి” అని ప్రార్ధించాను. తరువాత నేను, అమ్మ మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళాం. అమ్మకు పాత సమస్యే మరలా వచ్చిందని అనుమానం ఎక్కువగా వుండటంతో నేను X-ray తీయమని డాక్టర్ ను అడిగాను. ఆమె, "సరే తీయించండి" అన్నారు. X-ray తీయించిన తరువాత X-ray తీసిన అతనిని, "ఏమైనా ప్రాబ్లం ఉందా?" అని అడిగాను. అతను చెప్పడానికి అంగీకరించక, డాక్టర్ గారు చెప్తారన్నాడు. ఏమీ పర్వాలేదు, చెప్పండి అని అతనిని రిక్వెస్ట్ చేయగా, అతను, ప్రేగు కొంత పొక్కిందని, X-ray లో ఆ స్పాట్ చూపించారు. కడుపు ఎడమవైపు భాగంలో కొంత పొక్కినట్లు స్పష్టంగా కనిపించింది. నాకు చాలా భయం వేసింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఆమె ఇంకా భయపడిపోతుందని, నాకు ఇంక ఏమి చేయాలో అర్థంకాక బాబాతో, “బాబా! డాక్టర్ అమ్మకు ఈ విషయం చెప్పకుండా, ఏమీ లేదని చెప్పేటట్లు చూడండి” అని మరల బాబాని ప్రార్ధించాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి X-ray చూపించాం. ఆశ్చర్యంగా ఆమె, ‘ఏమీలేదు ఈమెకు' అని చెప్పి, బలానికి టాబ్లెట్లు రాసి ఇచ్చారు. అమ్మ అప్పటికి కొంత శాంతించింది. నాకు పూర్తిగా అర్థం కాలేదు.
నిజంగా ఏమీ లేదా?
X-ray అతను తప్పు చెప్పాడా?
బాబా అలా చెప్పించారా? అని అర్థంకాక, నేను ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్లి వేరే వాళ్ళను అడిగాను. వాళ్ళు కూడా ప్రేగు కొంత పొక్కిందని అన్నారు.
బాబా అలా చెప్పించారా? అని అర్థంకాక, నేను ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్లి వేరే వాళ్ళను అడిగాను. వాళ్ళు కూడా ప్రేగు కొంత పొక్కిందని అన్నారు.
నేను బాబాతో, “అయ్యా! ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది, కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి. మీరు ఏమి చేస్తారో ఏమో నాకు తెలియదు. మీరే ఈ అనారోగ్యాన్ని తీసివేయాలి. అమ్మ సంగతి మీరే చూసుకోవాలి. ఈభాధ్యత పూర్తిగా మీదే, నాకు తెలియదు” అని చెప్పేశాను. మరలా అమ్మకు బాగాలేకుంటే వేరే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అతను కూడా ఏమీ లేదని చెప్పారు.
ఆ తరువాత 15 రోజుల లోపలే ఒక అద్భుతం జరిగింది. మా ఇంట్లో గురువారం అమ్మ బాబా విగ్రహాన్ని నీళ్ళతో కడుగుతున్న సమయంలో బాబా కడుపు ఎడమ వైపు భాగంలో కొంత రంధ్రం పడి ఉండటం గమనించి, తనకి ఏమీ అర్థంకాక, ఆ విషయం నాకు చెప్పింది. బాబాగారి విగ్రహం చూస్తూనే నాకు గుర్తు వచ్చింది, అమ్మ X-ray లో ఏ భాగంలో అయితే స్పాట్ ఉందో, సరిగ్గా బాబా కడుపుపై అదే భాగంలో రంధ్రం వుంది. వెంటనే, 'అమ్మకు ఉన్న కర్మను బాబా స్వీకరించారు' అనే విషయం నాకు అర్థమైంది. నేను ఈ విధంగా భావించినా, నా భావన సరైనదా! కాదా! అని సతమతమవుతూ, అదే విషయం బాబానే అడిగాను. బాబా నుండి, 'నీ భావన నిజమైనదే!' అని సమాధానం వచ్చింది. అప్పటినుంచి అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడటం జరిగింది.
🕉 సాయి ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me