సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడీ సాయినాథుడు


సిద్ధిపేట నుండి లక్కరసు రవికుమార్ తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:

నేను 1993వ సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన తరువాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాను. అయితే, 1995, జనవరి 12వ తేదీన మా నాన్నగారు మరణించడంతో నేను చదువును మధ్యలోనే ఆపివేయవలసి వచ్చింది. మా కుటుంబ బాధ్యతలు నాపై పడడం వలన నేను ఏదో ఒక పని గురించి వెతకడం ప్రారంభించాను. మొదటగా STD బూత్‌లోనూ, తరువాత కిరాణాషాపులోనూ పనిచేశాను. ఆ తరువాత న్యూస్‌పేపర్ వేయడం, పాల ప్యాకెట్లు వేయడం కూడా చేశాను. ఆ తరువాత డ్రెస్సెస్ షాపులో పనిచేశాను. కానీ వారు ఇచ్చే జీతం చాలకపోవడం వలన చాలా చాలా ఇబ్బందిగా ఉండేది.

1996, ఏప్రిల్ 4వ తేదీ, గురువారంనాడు సిద్ధిపేటలోని శ్రీ శిరిడీ సాయిబాబా మందిరానికి వెళ్లి, బాబాను దర్శించుకొని, నా బాధలు ఆయనతో చెప్పుకుని, "నాకు ఏదో ఒక పని దొరికేటట్లు చూడమ"ని ఆర్తిగా ప్రార్థించాను. 8వ తేదీన మా చిన్నాన్న నన్ను ఒక నూనె మిల్లులో పని గురించి తీసుకెళ్ళారు. మా చిన్నాన్న తన షాప్ ఎదురుగా ఉన్న షాపు నుండి ఆ నూనె మిల్లుకు ఫోన్ చేశారు. కానీ, అక్కడ వారు లేరు. ఆ షాపు అప్పటి శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం అధ్యక్షులైన శ్రీశివశంకరయ్యగారిది. ఆయన, "బాబా మందిరంలో పనిచేస్తావా?" అని నన్ను అడిగారు. కానీ, నేను మందిరంలో పనికి భయపడి 'చేయన'ని చెప్పాను. ఇంటికి వచ్చిన తరువాత మా చిన్నాన్న నాపై కోప్పడ్డారు. ఆ తరువాత నేను 11వ తేదీన బాబా మందిరంలో పనికి చేరాను.

నేను బాబాను వేడుకోవడం, బాబా నన్ను తమ సేవకు రప్పించుకోవడం, శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో నాకు సేవ చేసుకొనే అదృష్టం లభించడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అప్పటినుండి నేను ఆ మందిరంలో పనిచేసుకుంటూ ఉన్నాను. 2002 నుండి ఆ మందిరంలో మేనేజరుగా పనిచూసుకుంటున్నాను. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ శిరిడీ సాయినాథుడు.


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo