1. సాయిని నమ్ముకున్న వారికి తిరుగులేదు2. సాయి ఆశీస్సులతో కోవిడ్ నెగిటివ్
సాయిని నమ్ముకున్న వారికి తిరుగులేదు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మాహరాజ్ కీ జై!!!
నా పేరు శ్రీదేవి. ముందుగా సాయి పాదములకు నా అనంతకోటి నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతఙ్ఞతలు. సాయే నాకు తల్లితండ్రి, గురువు, దైవం. ఆయనే నా సర్వస్వం. నాకు ఇరవై సంవత్సరాల వయసున్నప్పుడు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. "అది తగ్గితే, వెండి వక్షస్థలం సమర్పించుకుంటాన"ని అమ్మవారికి మొక్కుకున్నాను. తరువాత నా అనారోగ్య సమస్య తీరింది. కానీ నా మొక్కు తీర్చుకుందామంటే ఎంతకీ వీలయ్యేది కాదు. చివరికి నేను, "బాబా! వీలైనంత త్వరగా అమ్మవారి మొక్కు తీర్చేలా అనుగ్రహించండి. మొక్కు చెల్లించిన వెంటనే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. 2021, దసరా నవరాత్రుల్లో శుక్రవారంనాడు నా మొక్కు తీర్చేలా బాబా అనుగ్రహించారు. ఆరోజు గుడి ప్రవేశ ద్వారం వద్ద సాయిబాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చి నేను అనుకున్న దానికంటే వెయ్యిరెట్లు గొప్పగా అమ్మవారి పూజ జరిగేటట్లు చూసారు. అలా సాయి అనుగ్రహం వల్ల నేను నా మొక్కు తీర్చకోగలిగాను.
నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు ఒకసారి బట్టలు ఆరవేస్తూ మెట్ల మీద నుంచి కిందకి జారి పడిపోవడంతో జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. డాక్టరు, "ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చాలా కష్టమ"ని చెప్పారు. తరువాత నాలుగైదు గంటలపాటు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఒకసారి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి, కలలో నా కాలు తొక్కుతూ కనిపించారు. అప్పటినుండి నా కాలుకి ఎటువంటి నొప్పి ఉండేది కాదు. తిరుపతి కొండ కూడా ఎక్కాను. అయితే, 32 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేసిన ప్రదేశంలో నొప్పి రావడం మొదలైంది. నేను చాలా భయపడి, "సాయీ! నాకు ఎటువంటి సమస్య రాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవలన డాక్టరు, "ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండండి" అని చెప్పారు. కానీ ఇప్పుడు కూడా తరచుగా నొప్పి వస్తుంది. బాబా దయవలన అది కూడా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను.
ఒకరోజు ఉదయం నేను నిద్రలేచాక చూసుకుంటే నా ఉంగరం కనపడలేదు. ఉద్యోగరిత్యా వెతికే సమయం లేక నేను, "ఉంగరం ఎక్కడ పోయిందో తెలియదు బాబా. ఎలాగైనా ఉంగరం దొరికేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను ప్రార్ధించాను. ఆరోజు సాయంకాలం నేను ఇంటికి వచ్చేసరికి మావారు, "ఉంగరం దొరికింద"ని చెప్పి ఆ ఉంగరాన్ని చూపిస్తూ, "ఈ ఉంగరం మన పనిమనిషికి చెత్తలో దొరికితే ఇచ్చింద"ని అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి మనసులోనే సాయికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. మన మనసెరిగిన బాబా ఆలస్యం చేయకుండా మనల్ని అనుగ్రహిస్తారు.
ఒకసారి మా ఆడపడుచు, తన భర్త వివాహానికి వెళ్లొస్తుంటే వాళ్ళ కారు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. అప్పుడు నేను, "వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఉండాల"ని బాబాను ప్రార్థించి వాళ్ళకి బాబా ఊదీ ఇచ్చాను. డాక్టరు అన్ని టెస్టులు చేసి రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని చెప్పి, చిన్న ఆపరేషన్ చేసారు. బాబా దయవల్ల వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. "థాంక్యూ సో మచ్ బాబా. నా అనుభవాలు ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. మా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, చదువులో వాళ్ళకి తోడుగా ఉండి మంచి భవిష్యత్తునివ్వండి సాయి".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సాయి ఆశీస్సులతో కోవిడ్ నెగిటివ్
సాయిభక్తులకు బాబా ప్రసాదించిన తమ అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిచ్చిన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల నా భార్యకు జలుబు, దగ్గుతోపాటు జ్వరం వచ్చింది. డాక్టరు యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ దగ్గు తగ్గలేదు. దాంతో డాక్టరు రోగనిర్ధారణ కొరకు అన్ని పరీక్షలు చేయించమన్నారు. సరేనని ఆ పరీక్షలు చేయిస్తే, దాదాపు అన్ని రిపోర్టులు నార్మల్ అని వచ్చాయి. చివరగా డాక్టరు మమ్మల్ని కోవిడ్ పరీక్షకు వెళ్లమన్నారు. అప్పుడు మేము మన ప్రియాతిప్రియమైన బాబాను, "కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా అనుగ్రహించండి బాబా. అదే జరిగితే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని ప్రార్థించాము. ఆయన ఆశీస్సులతో కోవిడ్ టెస్టు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. మాపై చూపించిన శ్రద్ధకు సాయిమాతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. "ప్రణామాలు సాయి. నేను మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని ప్రియ సోదర సాయిభక్తులతో పంచుకున్నాను".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sai ram ❤❤❤ I love you tandri.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health issues and gaining in wealth of happiness.
ReplyDeleteOm sri naathaaya namaha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDelete