సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 994వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేయి గట్టిగా పట్టుకుంటే చాలు
2. నా ప్రతి మొర విన్న బాబా

బాబా చేయి గట్టిగా పట్టుకుంటే చాలు


అందరికి నమస్తే. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, నవంబర్ 6, శనివారంనాడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఆరోజు రాత్రి 9గంటల ప్రాంతంలో నా భర్త తన ఎడమచేయి బాగా నొప్పిగా ఉందని చెప్పారు. అది విని నేను ఏమైందో ఏమిటోనని భయపడితే, ఆయన పెయిన్ కిల్లర్ వేసుకున్నానని అన్నారు. అయినప్పటికీ ఆయన నొప్పితో బాధపడుతుంటే నాకు ఏం చేయాలో తోచలేదు. బహుశా ఎక్కువగా పని చేసినందువల్ల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుందేమోననిపించి ఆయన చేయి మర్దన చేసాను. కొంతసేపటి తరువాత బాబా ఊదీ ఆయన నుదుటికి, చేతికి పెట్టి, ఊదీ నీళ్లు త్రాగమని చెప్పాను. తరువాత మేము నిద్రకి ఉపక్రమించాము. కానీ ఆందోళన వలన నేను చాలాసేపటివరకు మెలకువగానే ఉన్నాను. ఏదో సమయంలో నిద్రలోకి జారుకున్న నేను 12:30కి ఎవరో నన్ను లేపుతున్నట్లు అనిపించి హఠాత్తుగా నిద్రలేచాను. చూస్తే, నా భర్త పక్కన లేరు. మంచం దిగి వెళితే, ఆయన సోఫాలో కూర్చుని తన చేయి మర్దన చేసుకుంటున్నారు. నేను ఏమైందని అడిగితే, చాలా నొప్పిపెడుతుంది అని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, అర్ధరాత్రి సమయం, నిద్రపోతున్న పిల్లల్ని ఒంటరిగా వదిలి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేను. ఇక్కడ యు.ఎస్.ఏలో అర్ధరాత్రి సహాయం దొరకడం చాలా కష్టం. ఆ స్థితిలో మా ఇంటిలో ఉన్న పెద్ద దిక్కు నా సాయి మాత్రమే. ఆయన్ని తలుచుకుని నా భర్తతో "రండి, నేను మర్దన చేస్తాను. వచ్చి పడుకోండి" అన్నాను. ఆయన వచ్చేలోపు నేను డాక్టరైన మా అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను కొన్ని వివరాలు అడిగిన మీదట, "చింతించకండి, కొద్దిగా కండరాల ఒత్తిడి అయుండొచ్చు. మరో పెయిన్ కిల్లర్ ఇవ్వు" అని చెప్పారు. అప్పుడు నేను మావారికి మరో పెయిన్ కిల్లర్ ఇచ్చాను కానీ, అనేకరకాల ఆలోచనలతో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. కొంతసేపటికి నన్ను నేను శాంతపరుచుకుని బాబా సచ్చరిత్ర, స్తవనమంజరి, రామ నామాలు కొన్ని చదివాను. హృదయంలో 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ ఆన్‌లైన్ లో పండరీపురం దర్శనాన్ని కూడా వీక్షించాను. కాసేపటికి నా భర్త గాఢ నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం బాబా కొన్ని కర్మలను తొలగించడం ద్వారా మా రక్షణలోనే ఉన్నారని ఆలోచిస్తూ 'ఏదో పెద్ద సమస్యే వచ్చి ఉంటుంది, దానికి బదులు చిన్న సమస్యకు ఆందోళన చెందేలా చేసి ఈ రాత్రి నా కర్మలను తగ్గిస్తున్నార'ని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం నా భర్త నిద్ర లేచినప్పుడు "ఇప్పుడు మీకు ఎలా ఉంద"ని అడిగాను. అందుకాయన "ఇప్పుడు దాదాపు బాగుంది. ఏ ఇబ్బంది లేద"ని చెప్పారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి.


ఆ రోజు శనివారం మధ్యాహ్నం నేను నిద్రపోతున్నప్పుడు కలలో, 'నా భర్త తన ఎడమచేయి పట్టుకుని చాలా నొప్పిగా ఉందని చెప్పడం, ఆ తర్వాత శివలింగం, శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర పరమాచార్యస్వామి మరియు బాబా నాకు కనిపించడం' జరిగింది. వెంటనే నేను, 'ఏమిటి ఈ కల' అనుకుంటూ ఆందోళనగా నిద్రలేచాను. కలలో భగవద్దర్శనం అయినందుకు చాలా సంతోషించాను కానీ, అదే సమయంలో నా భర్త నొప్పితో బాధపడటం కనిపించినందుకు భయపడ్డాను. అయినా పగటి కలలు నిజం కావని సమాధానపడ్డాను. కానీ నేను ఏదైతే కలలో చూశానో అదే ఆ రోజు రాత్రి నిజంగా జరిగింది. జరగనున్న దాన్ని ముందుగానే బాబా నాకు చూపించారని అప్పుడు అర్థమైంది. ఈ మధ్యకాలంలో ఇలా నాకు తెలియజేయడం చాలాసార్లు జరిగింది. నేను ఆ రాత్రి ఎంత టెన్షన్ పడ్డానో మాటల్లో చెప్పలేను. కానీ అంతటి టెన్షన్‌లో నేను చేసిన పని ఒక్కటే - బాబా చేయి గట్టిగా పట్టుకోవడం. ఆయన ఆ రాత్రి బాధపడటం వలన చాలా పెద్ద కష్టం నుండే బాబా మమ్మల్ని రక్షించారని నేను గట్టిగా నమ్ముతున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. అలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో నాకు సహాయం చేసినందుకు థాంక్యూ థాంక్యూ సాయి. నాకు కష్టం వచ్చినప్పుడల్లా నాలో మార్పును నేను గమనిస్తున్నాను బాబా. వచ్చిన కష్టం గురించి మీతో చెప్పడానికి బదులు, నేను మీ చేయి గట్టిగా పట్టుకుని నా కర్మలను తొలగించే వరకు సహనంతో వేచి ఉంటున్నాను. పెద్ద కుటుంబం, చాలామంది స్నేహితులు, ధనం ఉన్నప్పటికీ ఏదీ నా పక్షం కాదు. అవసరమైనప్పుడు నాతో ఉండేది మీరు మాత్రమే. మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటున్నారు. దయచేసి ఇలాగే ఎప్పుడూ ఉండండి బాబా. దయచేసి నా కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ సర్వదా రక్షించండి బాబా. చివరిగా తప్పుగా ఏదైనా వ్రాసి ఉంటే, మీ ప్రియమైన కుమార్తెనైన నన్ను దయచేసి క్షమించండి".


నా ప్రతి మొర విన్న బాబా


ప్రియమైన సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా పేరు సంధ్య. నేను బాబా భక్తురాలిని. నేను నా అనుభవాలను పంచుకోవాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు బాబా నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.


నేను ఎప్పటి నుంచో వ్యాక్సిన్ వేయించు కోవాలనుకుంటున్నప్పటికీ భయం వల్ల వేయించుకోలేదు. చివరికి బాబా దగ్గర చీటీలు వేస్తే, 'వేయించుకోమ'ని వచ్చింది. అంతటితో వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని, "నాకు జ్వరం రాకుండా ఉంటే, నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాన"ని సాయికి చెప్పుకున్నాను. ఆయన ప్రేమతో జ్వరం, నొప్పులు ఏమీ లేకుండా నన్ను అనుగ్రహించారు.


ఒకసారి నా బిడ్డలు, మావారు జలుబు, దగ్గుతో బాగా ఇబ్బంది పడుతుంటే, "బాబా! నా భర్త, పిల్లలకు త్వరగా నయమైతే మీ గుడికి వస్తాను. అలాగే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని ప్రార్ధించాను. సాయి దయవలన వాళ్లకు నయమై ఆరోగ్యంగా ఉన్నారు.


కరోనా సమయంలో నా తమ్ముడు తన ఆఫీసు విషయమై వైజాగ్ వెళ్లి, అక్కడ ఐదు రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా తమ్ముడికి ఎటువంటి ఆపద రాకుండా ఉండాలి. తను అక్కడి నుండి వచ్చాక కూడ పూర్తి ఆరోగ్యంగా ఉండాలి సాయి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడు బాగున్నాడు. "ధన్యవాదాలు బాబా. మీ దయ అందరిపై ఇలాగే ఉండాలి తండ్రి".


11 comments:

  1. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om Sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om Sai ram om sai ram

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness. Jaisairam

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Om sai ram❤❤❤

    ReplyDelete
  5. Om sai ram please bless my family. Be with us.take care of us. Om sai ram❤❤❤

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌺🥰🌼🤗🌸😃🌹👪💕

    ReplyDelete
  9. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo