1. బాబా దయతో దొరికిన నగలు
2. ఆశ్రయించిన వారికి తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించిన బాబా
3. బాబా చల్లని చూపు
బాబా దయతో దొరికిన నగలు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!
నా పేరు మాధురి. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను ఈమధ్య ఒక వివాహ వేడుకకు వెళ్లాలని బ్యాంకు లాకర్‌లో ఉన్న నా నగలు తెచ్చుకోడానికని బ్యాంకుకి వెళ్లాను. అయితే, ఆ లాకర్‌లో నగలు లేవు. బహుశా ఇంకో లాకర్‌లో ఉన్నాయేమోనని తలచి అందులో చూశాను. అందులో కూడా లేవు. ఎక్కడ పెట్టానో గుర్తుకు రాక చాలా కంగారుపడ్డాను. ఇంటికొచ్చి బీరువాలో చూశాను. అందులో కూడా లేవు. దాంతో లాకర్ లో పెట్టడానికి వెళ్లి అక్కడెక్కడైనా మర్చిపోయానో? లేదంటే, ఇంకెక్కడైనా చేజార్చుకున్నానో? నాకేమీ అర్థం కాలేదు. ఇంట్లోవాళ్ళు ఇంట్లో ఉన్న మరో బీరువాలో చూడమన్నారు. కానీ ఆ బీరువాలో నేను ఎప్పుడూ నగలు పెట్టను. కాబట్టి అందులో ఉండవని నా నమ్మకం. అందుచేత బాబాకి దణ్ణం పెట్టుకుని, "నగలు దొరికితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని మళ్లీ మొదట చూసిన బీరువాలోనే చూసాను. కానీ నగలు కనిపించలేదు. దాంతో మావాళ్ళు చెప్పినట్లు రెండో బీరువాలో వెతకడానికి వెళ్ళాలని అనుకున్నాను. అయితే, అందులో వెతికే ముందు మళ్ళీ బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరు ఎంతోమందికి తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి దొరికేలా చేసారు. అలాంటి అనుభవాలు బ్లాగులో చాలామంది భక్తులు పంచుకున్నారు. నాకు కూడా దొరికేలా చేయండి" అని వేడుకున్నాను. తరువాత వెళ్లి ఆ బీరువాలో చూస్తే, బట్టల మధ్యలో నగలు కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించి, ఆ నగలు తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళి, ఆయనకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అసలు విషయం ఏమిటంటే, కోవిడ్ మొదలైనప్పుడు నగలు ఆ బీరువాలో పెట్టాను. తరువాత ఏ ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. రెండేళ్ళు గడిచిపోయాయి. ఈలోగా నగలు అక్కడ పెట్టానని మర్చిపోయాను. తుదకు బాబా దయవలన ఆ నగలు దొరికాయి. ఆయనే ఫంక్షన్ నెపంతో ఆ నగలు ఎక్కడ ఉన్నాయో చూపించారు. "చాలా ధన్యవాదాలు బాబా. మీ దయ సాయిబంధువులందరిపై, అలాగే మాపై ఉండాలని, ఇంకా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనస్పూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను".
ఆశ్రయించిన వారికి తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించిన బాబా
సాయిభక్తులకు, బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను 2021, దసరా పండగకి మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలోనే మా చెల్లి పెళ్ళికి ముహూర్తం పెట్టుకోవాలని అనుకున్నాము. కానీ దానికంటే ముందు పెళ్లికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవాలని అనుకున్నాము. అందుకోసం మాకు ఉన్న ఒక భూమిని అమ్మాలనుకున్నాము. కానీ అక్కడే సమస్య మొదలై మేము చాలా టార్చర్ అనుభవించాము. విషయం ఏమిటంటే, మా అమ్మవాళ్ళ అక్క, 'సగం ధరకు ఆ భూమిని తనకు ఇచ్చేయమని, లేకుంటే ఆ భూమి ఎవరు కొంటారో చూస్తాన'ని మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టింది. బెదిరించడమే కాదు, బయటవాళ్లు భూమి కొనడానికి వస్తే చెప్పరాని విధంగా తిట్టి పంపించేది. అయితే భూమి అమ్మకపోతే చెల్లి పెళ్లి చేసే పరిస్థితి లేదు. మాకు తండ్రి లేరు. అమ్మకు మేము ముగ్గురం అమ్మాయిలం. మా అమ్మ వేరే భూమి అమ్మి నాకు, మా అక్కకు పెళ్లి చేసింది. అప్పుడు కూడా మా పెద్దమ్మ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఇప్పుడూ అదేవిధంగా చేస్తుంటే మాకు దిక్కు తోచలేదు. అట్టి స్థితిలో నేను రోజూ మన బాబాను, "తండ్రీ! నువ్వు తప్ప మాకు దిక్కెవరు? ఈ సమస్యని పరిష్కరించి, పెళ్లి జరిపించాల్సింది మీరే తండ్రి" అని వేడుకుంటూ మా భారమంతా ఆయన మీద వేసాను. బాబానే అన్నీ చూసుకుంటారని, అంతా ఆయనకే వదిలేసి ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకుండా మా ప్రయత్నాలు మేము చేయసాగాము. ఇదిలా ఉంటే, అబ్బాయి వాళ్ళు, "ఏంటి మీరు? అసలు పెళ్లి చేస్తారా, లేదా" అని మమ్మల్ని అడుగుతుండేవారు. ఎందుకంటే, నిశ్చితార్థం జరిగి కొన్ని నెలలైన తరువాత కూడా పెళ్లి ఆలస్యం జరుగుతుండటం సబబు కాదు కదా! ఇలా ఒక నెల గడిచిపోయింది. 2021, నవంబర్ 16న నేను బాబాతో, "ఏంటి తండ్రి. నిన్ను నమ్ముకున్న వాళ్లని ఇలాగే ఏడిపిస్తారా? రేపు ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి. అలా జరిగితే, నా అనుభవాన్ని వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అంతే! ఆ తండ్రి మాపై ఎలా దయ చూపారో చూడండి. నవంబర్ 17న పెళ్లికి కావాల్సిన డబ్బులు ఒక స్నేహితుని ద్వారా సమకూరేలా అనుగ్రహించారు బాబా. అయినవాళ్లే ఇబ్బందులు పెడుతుంటే, ఓర్పుతో నువ్వే దిక్కని ఆ తండ్రి పాదాలు పట్టుకుంటే, తప్పకుండా దారి చూపిస్తామని నిరూపించారు బాబా. అందుకే ఆ తండ్రి మీద నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఆలస్యమైనా బాబా అందరికీ మంచి చేస్తారు. చివరిగా ఆ తండ్రి కరుణకు, దయకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
బాబా చల్లని చూపు
అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను ఈరోజు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఒకసారి మా పిన్ని మూడు నాలుగు రోజులపాటు కడుపునొప్పితో బాధపడింది. తనని డాక్టరు దగ్గరకు తీసుకెళ్తే, అన్నిరకాల టెస్టులు చేసారు. అప్పుడు నేను, "రిపోర్టులన్ని నార్మల్ రావాల"ని బాబాను, ఆంజనేయస్వామిని వేడుకున్నాను. వారి దయవలన రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. కానీ, "కడుపులో ఏదో గడ్డ ఉందని అనుమానంగా ఉంది, మరోసారి స్కాన్ చేయించమ"ని అన్నారు. అది విని మేము అంతా చాలా భయపడిపోయాము. అప్పుడే నేను బాబాని తలుచుకుని, "బాబా! దయచేసి మాకు సహాయం చేయండి. పిన్నికి ఎలాంటి సమస్యా ఉండకూడదు. టాబ్లెట్లతో నొప్పి తగ్గిపోవాలి" అని ప్రార్ధించి, మా పిన్ని పేరు తలుచుకుని నా నుదుటన బాబా ఊదీ పెట్టుకున్నాను. బాబా ఆశీర్వదించారు. 'పిన్నికి ఉన్న సమస్య చాలా చిన్నదని, దానికి టాబ్లెట్లు కూడా అవసరం లేదు, అదే తగ్గిపోతుంది' అని చెప్పి పంపించారు. ఇదంతా బాబా చల్లని చూపు వల్లే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా".
Om sai ram om sai ram om sai ram om sai ram osai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌺🥰🌼🤗🌸😃🌹👪👪 I'm sorry baba na mokkulu theerchukolekapoya.. I'm very very sorry.. please forgive me and my family. Twaralone na mokkulu theerchukune shakthini prasadinchandi baba.. please bless my child with good health and long life ahead baba.. please stay with my family always.. please bless my family.. please help my brother in his work.. Thank you so much for everything baba..
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram father today experiences are very nice ❤❤❤��
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness and happiness. Jaisairam
ReplyDeleteWhen we trust our sai he takes care of every one. That is power of sai. He is our belowed Lord Sai baba❤❤❤
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete