సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 979వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనసున్న దేవుడు - మనసెరిగిన దేవుడు సాయిబాబా
2. జ్వరం లేకుండా అనుగ్రహించిన బాబా
3. మంచి ఇంటిని అనుగ్రహించిన బాబా

మనసున్న దేవుడు - మనసెరిగిన దేవుడు సాయిబాబా


నా పేరు మాధవి. మేము భువనేశ్వర్‌లో నివాసముంటున్నాము. చాలారోజుల తరువాత ఒక చక్కటి బాబా లీల మీతో పంచుకుంటున్నాను. మా ఇంట్లో చాలా బాబా విగ్రహాలున్నాయి. అయితే, అవి అంత నాణ్యమైన పాలరాతి విగ్రహాలు కావు. నాకు మేలురకమైన పాలరాతి బాబా విగ్రహమొకటి ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలని ఎంతగానో ఉండేది. అది కూడా శిరిడీ నుండి తెచ్చుకోవాలని. కానీ అస్సలు కుదిరేది కాదు. ఈ మధ్యకాలంలో మా జీవితాలు ఎంతగానో అస్తవ్యస్తమయ్యాయి. ఈ స్థితిలో నేను బాబా విగ్రహం తెచ్చుకోవాలన్న కోరికను మర్చిపోయాను. హఠాత్తుగా 2021, జూన్ 11న శిరిడీ నుంచి 'సాయి చరణ్' అనే ఒక అబ్బాయి నాకు, "నేను మీకు ఏ సహాయం చేయగలను" అని ఒక మెసేజ్ పెట్టాడు. నిజానికి అతను ఎవరో, ఏమిటో నాకు అస్సలు తెలీదు. కానీ నేను ఏమీ ఆలోచించకుండా, "నాకు ఒక బాబా విగ్రహం కావాలి, మీరు పంపగలరా?" అని అడిగాను. ఇది జరిగి 4 నెలల అయింది. ఆ విషయం అతనూ మర్చిపోయాడు, నేనూ మర్చిపోయి భువనేశ్వర్‌లోనే బాబా విగ్రహం కొనుక్కుందామని నిర్ణయించుకున్నాను. అది కూడా 'నా కష్టాలు తీర్చడం లేద'ని బాబా మీద ఉన్న కోపంతో. నేను నా కష్టాలు భరించలేక బాబాను, "బాగా కళ్ళు తెరుచుకుని నా కష్టాలు చూడు బాబా" అని చాలా నిందించేదాన్ని. ఇంకా, "మీరు ఎన్నోసార్లు నన్ను కిందికి జారిపోకుండా గాజుబొమ్మలా జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు" అని అనుకునేదాన్ని. నా బాధ నాది మరి. సరే అదలా ఉంచితే, నాకు భువనేశ్వర్‌లో మంచి బాబా విగ్రహం దొరకలేదు, 'ఎలా?' అని బాధపడుతున్న తరుణంలో 2021, అక్టోబర్ 29 సాయంత్రం శిరిడీ నుంచి 'సాయి చరణ్' నాకు ఫోన్ చేసాడు. అతను, "మీరు బాబా విగ్రహం కావాలన్నారు కదా! నేను మర్చిపోయాను. ఆ విషయం సమాధి మందిరంలోని ఒక పూజారి నాకు గుర్తు చేశారు. మీరు వీడియో కాల్‌లోకి వచ్చి, బాబా విగ్రహం ఎంపిక చేసుకోండి" అని అన్నాడు. అది విని నేను, 'నాలుగు నెలల కిందటి మాట పూజారి గుర్తు చేయడమేమిట'ని షాకయ్యాను. సరేనని, వీడియోలో చూసి ఒక మంచి విగ్రహం ఎంపిక చేసుకున్నాను. ఆ షాపతను నాలుగు బాబా డ్రెస్సులు, కిరీటాలు, మాలలు కూడా వీడియోలో చూపించి, 30% డిస్కౌంట్లో ఇచ్చాడు. 'సాయి చరణ్' సమాధి మందిరంలోని పూజారి చేత పాండురంగ స్వామి మందిరంలో(ఆ మందిరం బాబా సశరీరులుగా ఉన్నప్పటి నాటిదట) ఆ బాబా విగ్రహానికి పూజ కూడా చేయించిన తరువాత బాబా విగ్రహాన్ని బస్సులో పంపాడు. సరిగ్గా దీపావళికి రెండు రోజుల ముందు ధన త్రయోదశినాడు బాబా మా ఇంటికొచ్చి నా కోరిక నెరవేర్చారు.


ఇంతకూ నేను చెప్పేది ఏమిటంటే, ఎక్కడ నాలాంటి వాళ్ళ ఆలోచనలు? ఎక్కడ బాబా లీలలు? ఎవ్వరికీ అర్థం కావు ఆ విశ్వవ్యాపి చర్యలు. ఇక్కడ కాకడ ఆరతి చేస్తుంటే, అదే సమయంలో ఇంకో చోట సంధ్య ఆరతి, మరో చోట మధ్యాహ్న ఆరతి, ఇంకో చోట శేజ్ ఆరతి జరుగుతుంటాయి. అలా క్షణమైనా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరమూ తమ భక్తులకోసం పరిశ్రమిస్తుంటారు ఆ సర్వాంతర్యామి. ఆయన నేను ఎంత వెనక్కు వెళుతున్నా, నన్ను ముందుకు లాక్కుంటున్నారు. ఎన్నిజన్మల పుణ్యమో! ఈ జన్మలో బాబా నాకు తోడుగా ఉన్నారు. ఆయన మనసులో నాకు స్థానం ఇచ్చారు. 'మనసున్న దేవుడు, మనసెరిగిన దేవుడు' అన్న మా గురువుగారి మాట అక్షరసత్యం. ఆయన ఋణం తీర్చుకోవాలనుకోవడం తప్పు. మనమెప్పుడూ ఆయనకు ఋణపడి ఉండాలని కోరుకోవాలి. అన్ని జన్మలలో మనమంతా బాబాను తోడుగా చేసుకుని మళ్ళీమళ్ళీ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


జ్వరం లేకుండా అనుగ్రహించిన బాబా


అందరికీ నమస్తే. ముందుగా సాయికి, ఈ బ్లాగు వారికి నా కృతఙ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. మాది విజయవాడ. నేను రెండోసారి నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే మా అమ్మ ఎప్పుడో ఒకసారి మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటుంది. అలాంటి అమ్మకి 2021, అక్టోబర్ 29 రాత్రి హఠాత్తుగా బాగా జలుబు చేసి దగ్గు మొదలైంది. అసలే మా గ్రామంలోని చుట్టుపక్కల వాళ్లలో చాలామందికి విష జ్వరాలు వస్తున్నాయి. అందువలన నాకు చాలా  భయమేసింది. నేను భయపడ్డట్టే దగ్గు, జలుబుతో బాధపడుతూ పడుకున్న అమ్మకి కాసేపట్లో జ్వరం కూడా మొదలైంది. అయితే నా పరిస్థితి కూడా బాగాలేదు. అందుచేతనే అమ్మ నా పనులు, ఇంటి పనులు మొత్తం తనే చేసుకుంటుంది. అలాంటి తన ఆరోగ్యం చెడిపోతే నేను తనకి ఏ సహాయం చేయలేని స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడి, "బాబా! నేను అమ్మ మీద ఆధారపడి ఉన్నాను. ఈ స్థితిలో అమ్మకి ఏమైనా అయితే హాస్పిటల్స్‌కి నేను తిరగలేను. దయచేసి మీ ఊదీతో అమ్మకి నయమయ్యేలా చేయి తండ్రి" అని మనసులోనే బాబాను వేడుకుని అమ్మకి ఊదీ కలిపిన నీళ్లు ఇచ్చాను. తరువాత సాయి అమ్మకి నయం చేస్తారనే నమ్మకంతో నిద్రపోయాను. వేకువఝామున చూస్తే, అమ్మ ఇంకా జ్వరంతో ఇబ్బంది పడుతుంది. అది చూసి నాకు చాలా బాధేసింది. కానీ కాసేపటికి అమ్మ మామూలుగానే లేచి ఎప్పటిలానే తన రోజువారీ పనులు చేసుకోసాగింది. తర్వాత నేను అమ్మని అడిగితే, "జ్వరం ఎమీ లేదు. జలుబు ఎక్కువగా ఉండటం వలన రాత్రి అలా అనిపించింది" అంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి అమ్మని ఆశీర్వదించండి".


మంచి ఇంటిని అనుగ్రహించిన బాబా


నేను సాయిభక్తురాలిని. నా తండ్రి సాయి పాదాలకు నమస్కరిస్తూ ఆయన మాకు చేసిన ఒక సహాయం గురించి పంచుకుంటున్నాను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు సాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయి బెంగుళూరులో ఉద్యోగం చేస్తోంది. తన సంపాదనతో తనకు నచ్చిన ప్రదేశంలో ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశపడి ఒక మంచి ఇంటికోసం వెతకసాగింది. నేను బాబాకు నమస్కరించుకుని, 'మంచి ఇల్లు దొరికితే ఆ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన'ని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా మాకు సహాయం చేశారు. బాబా ఆశీస్సులతో మా అమ్మాయి తనకి అన్నివిధాలా బాగా నచ్చిన చోట ఒక ఇల్లు కొనుక్కుంది. నా తండ్రి అనుగ్రహం లేనిదే ఇది జరిగేది కాదు. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా అందరికీ మీ సహాయం కావాలి తండ్రీ. అందరినీ చల్లగా చూడండి".


ఈమధ్య తప్పనిసరై మా దగ్గర బంధువుల పెళ్ళికి వెళ్ళొచ్చాము. మాకు ఏ కరోనా సోకకుండా బాబా చూసుకున్నారు. "థాంక్యూ బాబా. మా ఇద్దరి ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి దాదాపు 5, 6 సంవత్సరాలుగా మిమ్మల్ని అడుగుతున్నాను బాబా. నేను ఇంక భరించలేను, ఇప్పటికైనా దయచూపు తండ్రీ".



8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her throat infection recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  4. Om sai ram kapadu baba

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  6. Om sai Ram,,,,, nakunna samasyalanu theerchu baba,, na husband money vishayam lo koncham jaagrathaga vundela chudu thandri,, ni dhaya valana ma pelli jarigindhi, maku yetuvanti godavalu jaragakunda happy ga vundela chudu thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo