1. తాతయ్యకు ఏ సమస్యా లేకుండా కాపాడిన బాబా
2. బాబా కృపతో గ్రీన్ కార్డు ఆమోదం
3. ఊదీతో కాసేపటికే తగ్గిన గ్యాస్ట్రిక్ నొప్పి
తాతయ్యకు ఏ సమస్యా లేకుండా కాపాడిన బాబా
అందరికి నమస్తే. నేను ఒక సాయిభక్తురాలిని. మాది విజయవాడ. నా అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించిన బాబాకు, ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మూడోసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. మా తాతయ్య చాలా కష్టజీవి, ఏ స్వార్థం లేని మనిషి. ఆయన ఎవరినీ ఒక్క మాట కూడా అనరు, ఎవరితోనూ పోటీపడరు, అందరితో పోల్చిచూసుకుని వాళ్ళలా నేను చేయలేకపోతున్నాను అనుకుంటారేకానీ, వాళ్ల నాశనాన్ని కోరుకోరు. అంత గొప్ప వ్యక్తిత్వమున్న మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. 7 నెలల క్రిందట ఒక హాస్పిటల్ వాళ్ళు తాతయ్యకు కరోనా టెస్టు చేసి, 'కరోనా కాద'ని చెప్పారు. తరువాత మా ఊరిలో టెస్టు చేసినప్పుడు కూడా 'కరోనా కాదు' అన్నారు. కానీ వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు వాళ్ళు టెస్టు చేసి, 'కరోనా' అన్నారు. అప్పుడు తాతయ్య ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుండటం వల్ల మేము కూడా కరోనా ఏమో అనుకుని హాస్పిటల్లో జాయిన్ చేసాము. అద్భుతంగా చికిత్స మొదలుపెట్టిన వారంలోనే తాతయ్య కోలుకున్నారు. అయితే కొంతమంది, 'అసలు ఆయనకు కరోనా లేదు, హాస్పిటల్ వాళ్ళు అలా చెప్పి క్యాష్ చేసుకున్నారు' అన్నారు. మాకు కరోనా అవునో, కాదో నిశ్చయంగా తేలియకపోయినా 'పోనీలే తాతయ్య ఆరోగ్యంగా ఉన్నార'ని మేము వాళ్ళు చెప్పేది పెద్దగా పట్టించుకోక వదిలేశాము. అయితే అప్పటినుండి తాతయ్యకు జలుబు చేసినప్పుడు వచ్చే శ్లేషంలా ఉమ్ము రాసాగింది. కరోనా ప్రభావం వల్ల అలా వస్తుందేమో అనుకున్నాము. ఆయన కూడా అలానే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పటికీ తగ్గకపోయేసరికి తాతయ్య కొంచం భయపడ్డారు. అది చాలదన్నట్లు ఇంచుమించు తన వయస్సున్న తాతయ్య దగ్గర బంధువు ఒకరు గొంతు క్యాన్సర్ తో చాలా ఇబ్బందిపడి ఈమధ్యనే చనిపోయారు. ఆ సంఘటనను దగ్గరుండి చూసిన తాతయ్య తనకి కూడా అలానే అవుతుందేమోనని మనసులో ఆందోళన పెట్టుకున్నారు. ఆ విషయం మాకు తెలిసి, 'అలాంటిదేమి ఉండదు, అనవసరంగా టెన్షన్ పెట్టుకోవద్ద'ని సర్దిచెప్పాము. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది.
నా మనసులో, 'అరునెలలుగా తాతయ్యకు ఉమ్ము శ్లేషంలా ఉండటం ఏమిట'ని బాధ ఉండి గొంతు క్యాన్సర్ లక్షణాల గురించి చూస్తే, 'శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంద'ని ఉంది. తాతయ్యకు కరోనా అన్నప్పుడు ఆయన శ్వాస తీసువడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుచేత, 'అసలు గతంలో తాతయ్యకు క్యాన్సర్ రాలేదేమో! ఇంకేదైనా సమస్య ఉందేమో!' అని నేను చాలా టెన్షన్ పడి, "అందరి మంచి కోరే తాతయ్య తన చివరిరోజుల్లో వాళ్ళ బంధువులా నరకం చూడాలా బాబా?" అని బాబాతో అనుకున్నాను. తరువాత మేము ఒక హాస్పిటల్ కి వెళ్తే, "5 రోజులు యాంటిబయోటిక్స్ ఇచ్చి చూద్దాం" అన్నారు. అయితే ఐదురోజుల్లో తాతయ్యకి తగ్గలేదు. దాంతో, 'ఇన్ఫెక్షన్ అయితే ఐదురోజుల్లో పవర్ ఫుల్ యాంటిబయోటిక్స్ కి తగ్గిపోవాలి కదా!' అని నాలో భయం మొదలైంది. ఇంకో మంచి హాస్పిటల్ కి తాతయ్యను తీసుకుని వెళదామని అనుకున్నాము. ఆ లోపు నేను, "బాబా! తాతగారికి అంతా బాగానే ఉందని డాక్టరు చెప్పాలి" అని బాబాను వేడుకున్నాను. ఐదురోజులు బాబా ఊదీ తీర్థాన్ని తాతయ్యకిచ్చిన తరువాత ఇంకో డాక్టరు దగ్గరకి వెళ్ళాము. డాక్టరు అంతా పరిశీలించి, "భయపడాల్సిందేమీ లేదు. లోపల ఇన్ఫెక్షన్ ఉంది కానీ, టాబ్లెట్లు వాడితే సరిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే తినడానికి సమస్య అవుతుంది. అలాంటిదేమీ లేదు కాబట్టి మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోవద్ద"ని చెప్పారు. అది విన్నాక మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. "తాతయ్యకు ఏ సమస్యా లేకుండా కాపాడినందుకు ధన్యవాదాలు బాబా. మీతో చెప్పుకున్నట్లే సచ్చరిత్ర మూడుసార్లు సప్తాహ పారాయణ చేస్తాను. ఇంకా ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని మనసులో అనుకున్నట్లే ఆ అవకాశాన్ని నాకు ఈవిధంగా ప్రసాదించారు బాబా. ఎప్పుడూ మమ్మల్ని ఇలా కాపాడుతున్నందుకు థాంక్యూ సో మచ్ బాబా. మేము ఎవ్వరికీ ఏ హాని చేయకుండా ఉండేలా మమ్మల్ని దీవించు తండ్రి".
బాబా కృపతో గ్రీన్ కార్డు ఆమోదం
సాయిబంధువులందరికీ నమస్కారాలు. తోటి సాయిభక్తుల అనుభవాలు ప్రచురిస్తూ ఈ బ్లాగును ఇంత చక్కగా నిర్వహిస్తూ అందరికీ సహాయం చేస్తున్న బ్లాగు బృందానికి నా నమస్సుమాంజలి. నేను ఒక సాయి భక్తురాలిని. ఇదివరకు నేను ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలవుతుంది. కానీ మొన్న నవంబర్ వరకు మాకు గ్రీన్ కార్డు(i140 వీసా) లేదు. మావారు పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు 2020, జులైలో మా గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తామని చెప్పినందువల్ల మేము టెన్షన్ లేకుండా ఉండేవాళ్ళము. కానీ మేము డిసెంబరు వరకు చూసి కంపెనీ వాళ్ళని, "మీరు మా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసారా, మాకింకా రాలేదు ఏమిటి?" అని అడిగితే వాళ్ళు, "లేదు, మేము చేయలేదు" అన్నారు. అప్పుడు మేము, "అయ్యో! అదేంటి ఇప్పుడెలా? ఎక్కువ సమయం కూడా లేదు" అని అంటే వాళ్ళు, "చేస్తాము,ప్రక్రియ మొదలుపెట్టాము" అన్నారు. కానీ చాలా ఆలస్యంగా 2021, మేలో మా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసారు. అయితే నవంబరు లోపల గనక గ్రీన్ కార్డు రాకుంటే మాకు ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అందువలన సమయానికి గ్రీన్ కార్డు వస్తుందో, రాదోనని మాకు టెన్షన్ గా ఉండేది. అలా రోజులు గడుస్తూ సమయం దగ్గర పడసాగింది. కానీ ఏదీ తెలియడం లేదు. ఇక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలాయనగా నేను ఆరోజు మా అత్తగారితో ఫోన్ లో మాట్లాడుతున్నాను. మాటల్లో ఆవిడ, "నువ్వు మీ వీసా వస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాను ఎందుకు అడగకూడదు?" అని అన్నారు. నేను సరేనన్నాను కానీ, బాబాను ఏమీ కోరుకోలేదు. అదేరోజు రాత్రి మావారు గుడిలో దీపావళి సందర్భంగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేసి అర్థరాత్రి ఒంటిగంటకి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా మావారు ఆన్లైన్ లో చెక్ చేసి, "వీసా స్టేటస్ రాలేదు" అన్నారు. అప్పుడు నా మనసుకనిపించి, "ప్లీజ్ బాబా! ఎలాగైనా వీసా వచ్చేటట్టు చేయండి. మా వీసా ఆమోదం పొందిన రోజే ఆలస్యం చేయకుండా నేను మా అనుభవాన్ని బ్లాగు నిర్వాహకులకు పంపుతాను" అని బాబాను కోరుకున్నాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము ఆన్లైన్ లో చూస్తే, స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంది. నిజంగా ఇది బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. ఏమని చెప్పాలి తండ్రి నీ గురుంచి? ముందు అలజడి సృష్టించి మమ్మల్ని మీ దగ్గరకు లాక్కొని, తరువాత మీరే అన్ని పరిష్కరిస్తారు. మీ లీలలు ఎవరికీ అర్థం కావు. అందరినీ చల్లగా కాపాడు తండ్రి".
ఊదీతో కాసేపటికే తగ్గిన గ్యాస్ట్రిక్ నొప్పి
ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు రవి. నేను హైదరాబాద్ నివాసిని. తోటి సాయిభక్తులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ప్రతిరోజూ మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును చదువుతాను. భక్తుల అనుభవాలు చదువుతుంటే నాకు బాబాపట్ల ఎంతో భక్తి పెరుగుతుంది. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ మధ్య నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది. అప్పుడు నేను బాబా ఊదీ నోట్లో వేసుకుని, మరికొంత ఊదీ పొట్టకి రాసుకున్నాను. బాబా కృపవలన కాసేపటికి నొప్పి తగ్గింది. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. వారి ఆశీస్సులతో గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గిపోవాలని ఈ బ్లాగు ద్వారా బాబాను కోరుకుంటున్నాను. నాకున్న ఆస్త్మా, గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గాలని నా తరపున బాబాను ప్రార్థించమని తోటి సాయిభక్తులకు విన్నవించుకుంటున్నాను. "థాంక్యూ బాబా. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమించండి బాబా".
JAI SAIRAM
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺😀🌼🥰🌸🤗🌹👪💕
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Arogya Kshemadhaya Namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram please cure gastric trouble, asma my husband is suffering from many years. He worked in facor factory. There he infected due to chemicals.he can't breathe normally. Baba give him health. ❤❤❤
ReplyDeleteOm sri naathaaya namaha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteJaisairam bless me for my health recovery and gain in wealth and happiness. Jaisairam
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee alage ma mardal ki confirm kavali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete