1. ప్రతి చిన్న ఇబ్బందిని తొలగిస్తున్న బాబా
2. బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకు అంత మంచిది
3. బాబా కృపతోనే తగ్గిన జ్వరం
ప్రతి చిన్న ఇబ్బందిని తొలగిస్తున్న బాబా
రోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివే భక్తులకు మరియు పవిత్ర భావంతో ఎంతో ఓపికగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ప్రసాదించిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. మాకు రెండు సంవత్సరాల మూడు నెలల వయస్సున్న బాబు ఉన్నాడు. తను ఒకరోజు ఆడుకుంటూ కాలుజారి పడటం వలన బాగా దెబ్బ తగిలింది. తన కాలికి ఏమైనా సమస్య అవుతుందేమోనని నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబు కాలికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి, మామూలుగా నడవగలిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన మూడు రోజుల్లో బాబు కాలు నార్మల్ అయ్యింది. "థాంక్యూ బాబా".
ఒకరోజు బాబు పాల సీసాతో ఆడుకుంటూ దానికి రంధ్రం చేసాడు. దాంతో చాలా సమస్య అవుతుందని నేను భయపడ్డాను. ఎందుకంటే, ఆ రకం సీసాలు ఇండియాలో మాత్రమే దొరుకుతాయి. నేను అక్కడినుండే వాటిని తెచ్చుకున్నాను. అందువలన "బాబా! ఏ సమస్యా లేకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. "థాంక్యూ బాబా".
నా భర్త తనకి ఉద్యోగం లేకపోవడం వల్ల కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కోచింగ్ తీసుకోసాగారు. అందుకోసం ఆయన చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన క్లాసులు పూర్తయితే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే ఏ సమస్యలు లేకుండా తన క్లాసులు పూర్తయ్యాయి. "థాంక్యూ బాబా".
ఆ తర్వాత కొన్ని రోజులకి నా భర్త సరుకులు తేవడానికని షాపుకి వెళ్లారు. పని పూర్తిచేసుకుని షాపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడటం వల్ల ట్రామ్ స్టేషన్ దగ్గర సైకిల్ జారి కింద పడిపోయారు. ఆ ఘటనలో ఆయన కాళ్లకు చిన్నగా దెబ్బలు తగిలాయి. మామూలుగా అయితే పెద్ద ప్రమాదం జరగాల్సిన పరిస్థితి. కానీ చిన్న దెబ్బలతో బాబా నా భర్తను కాపాడారు. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు మేము ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాం".
2021, నవంబరులో ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల సమస్య వచ్చి మేము చాలా ఇబ్బందిని ఎదుర్కున్నాము. నెట్ కనెక్షన్ సరి చేయడానికి టెక్నీషియన్లు రెండుసార్లు వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్ ప్రాబ్లం పరిష్కారమైతే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 2021, నవంబర్ 19న టెక్నీషియన్ వచ్చి నెట్ సమస్య పరిష్కరించారు. ఇదంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఇటీవల పొలంలో మా నాన్నకి పాము కరిచింది. బాబా దయవల్ల త్వరగానే కోలుకున్నారు కానీ, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అప్పుడు నేను, 'నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా నయమైతే, బ్లాగులో పంచుకుంటాన'ని అని అనుకున్నాను. బాబా దయవల్ల నాన్నకి నయమైంది. "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్".
ఒకసారి మావారు బయటకి వెళ్లాల్సిన పని పడింది. ఆయన వెళ్ళే ప్రదేశంలో జనం ఎక్కువగా ఉంటారని కాస్త భయమేసి, "బాబా! మీ దయవల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ ప్రాబ్లమ్ కాలేదు. కానీ కొంచం దగ్గు, నోరు చేదు ఉన్నాయి. బాబా దయవల్ల అవి కూడా తగ్గితే బ్లాగులో పంచుకుంటాను.
బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకు అంత మంచిది
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయిబంధవులందరికీ, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయితో తమకున్న అనుభవాలు పంచుకుంటున్న భక్తులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా పేరు ముసానపల్లె నిరంజన్ రెడ్డి. నేను రెండోసారి ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను రెండు నెలల నుంచి ఉదయం పూట శ్రీ శిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర మరియు సాయంత్రం ఏడు గంటల సమయంలో శ్రీ భగవద్గీత పారాయణ చేస్తున్నాను. ఆ క్రమంలో 2021, నవంబర్ 17న పారాయణ చేయబోతే అక్షరాలు సరిగా కనపడక పారాయణ చేయడానికి వీలు పడలేదు. మరుసటిరోజు 2021, నవంబర్ 18, గురువారంనాడు నేను బాబాను భక్తితో పారాయణ చేస్తానని ప్రార్థించిన తరువాత పారాయణ మొదలుపెట్టాను. ఆరోజు అక్షరాలు బాగా కనిపించి భక్తిశ్రద్ధలతో పారాయణ చేయగలిగాను. ఇలా పవిత్రమైన మనసుతో భక్తిగా పారాయణ చేస్తుంటే అక్షరాలు బాగా కనపడుతూ పారాయణ చక్కగా జరగడం, నిర్లక్ష్యంగా ఎలాగైనా పారాయణ చేయాలని చేస్తే, అక్షరాలు సరిగా కనపడకపోవడం నాకు చాలాసార్లు అనుభవమైంది. ఈ అనుభవం ద్వారా బాబాను ఎంత భక్తితో ఆరాధిస్తే, మనకి అంత మంచిదని గ్రహించాను. "బాబా! మీకు సర్వస్య శరణాగతి వేడుతున్నాను తండ్రి".
సర్వేజనా సుఖినోభవంతు!
బాబా కృపతోనే తగ్గిన జ్వరం
నేను సాయిభక్తురాలిని అనేకన్నా సాయి బిడ్డని అని చెప్పుకుంటాను. నేను రెండోసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. ఇటీవల మా అబ్బాయి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడ్డాడు. మేముండే ప్రాంతంలో డెంగ్యూ కేసులు ఉన్నందువలన నేను చాలా ఆందోళన చెందాను. నేను రోజూ పూజ చేసేటప్పుడు అబ్బాయి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తూ(ప్రత్యేకించి బాబాను కాదు) బాబుకి చాలా మందులిచ్చాను. కానీ జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను నా సద్గురు శ్రీ సాయినాథుని ప్రార్థించాలని నిర్ణయించుకుని ఆర్తితో ఆయనను ప్రార్థించాను. మరుసటిరోజు నుండి అద్భుతం జరిగింది. మా అబ్బాయి జ్వరం తగ్గుముఖం పట్టింది. మేము అబ్బాయికి కొన్ని టెస్టులు చేయించాము. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. బాబా తీవ్రమైన జ్వరం నుండి మా అబ్బాయిని కాపాడారు. నాకు ఇంకొక కోరిక ఉంది. అదేమిటో బాబాకు తెలుసు. ఆయన అనుగ్రహంతో తొందరలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అది నెరవేరితే ఆ అనుభవాన్ని కూడా పంచుకుంటాను. "థాంక్యూ బాబా"
Om sri sainathaya namaha
ReplyDeleteOm sai ram������
ReplyDeleteOm sai ram today is my father's birthday.He is with sai.sai is taking him care.all sai leelas are very nice.om sai ram♥️♥️♥️♥️
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam. Bless me for my health and wealth of happiness and happiness.jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai ram
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌺🥰🌼🤗🌸😃🌹👪💕 Baba, please bless my child and husband with good health and long life ahead... bless my family baba..
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete