సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 977వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని అనుగ్రహించి శిరిడీయాత్రను సఫలీకృతం చేసిన సాయిబాబా
2. "లౌకికమైన ఆహ్వానాలను మన్నించి ఎక్కడికీ పోవద్ద"ని హెచ్చరించిన బాబా
3. సాయి ఉంటే సర్వమూ ఉన్నట్టే!

ఆరోగ్యాన్ని అనుగ్రహించి శిరిడీయాత్రను సఫలీకృతం చేసిన సాయిబాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు కుమార్. నేను హైదరాబాద్ నివాసిని. శ్రీ సాయిబాబాతో నాకున్న అనుబంధం, ఆయన నన్ను ఎన్ని విధాలా కాపాడారో, కాపాడుతున్నారో అన్నీ వివరించాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. ఇప్పడు బాబా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి, శిరిడీయాత్రను ఎలా సఫలీకృతం చేసారో మీతో పంచుకుంటాను. నేను బాబా దర్శనార్ధమై 2021వ సంవత్సరం విజయదశమి(అక్టోబర్ 15)కి రెండురోజుల ముందు అక్టోబర్ 13, సాయంత్రం 7 గంటల ట్రైన్‍కి శిరిడీకి బయలుదేరాను. ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికే నాకు జలుబు మొదలై మరికొద్దిసేపట్లో బాగా తీవ్రమై గాలి పీల్చుకోవడం కూడా కష్టమైంది. దాంతో పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అసలే కరోనా రోజులు, పైగా రైలు ప్రయాణం. అదీగాక, శిరిడీలో మూడు రోజులు ఉందామని ప్రణాళిక చేసుకున్నాను. ఇదేవిధంగా జలుబు తీవ్రంగా ఉంటే ప్రయాణంగాని, శిరిడీలో బాబా దర్శనంగాని చాలా కష్టం అయిపోతాయి. అందువలన చాలా భయమేసి మనసులోనే బాబాని తలచుకుని, "బాబా! మీ దర్శనం కోసమే బయలుదేరాను. కానీ ఈ జలుబు చాలా ఇబ్బంది పెడుతుంది. జలుబు తగ్గి ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగి, మీ దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి చేరితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపటికి మెల్లగా నిద్రపట్టింది. తెల్లవారుఝామున నాగర్‍సోల్‍లో రైలు ఆగాక మెలకువ వచ్చింది. రైలు దిగి శిరిడీ చేరుకుని అక్కడ మూడురోజులుండి బాబాను సేవించుకున్నాను. ఆ మూడురోజుల్లో నాకు ఏ రోజు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుని, ఏ వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. "ధన్యవాదాలు బాబా. నాడు మీరు కలరా వైరస్‍ని సమూలంగా నాశనం చేసి, దాని బారినుండి ఈ ప్రపంచాన్ని కాపాడారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్‍ను కూడా సమూలంగా నాశనం చేసి,ఈ ప్రపంచాన్ని కాపాడండి సాయీ. మీరు మాత్రమే ఆ అద్భుతాన్ని చేయగలరు ప్రభూ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


"లౌకికమైన ఆహ్వానాలను మన్నించి ఎక్కడికీ పోవద్ద"ని హెచ్చరించిన బాబా


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఎంతో వ్యయప్రయాసలకోర్చి అనేకమంది సాయిభక్తుల అనుభవాలను మనకు అందిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారికి మనఃపూర్వక ఆశీస్సులు. నా పేరు సూర్యనారాయణమూర్తి. బాబా ప్రసాదించిన ఎన్నో అనుభవాలను తరచుగా సాయి భక్తులతో పంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 2021, అక్టోబర్ 23 నాటి అనుభవాన్ని సాయికిచ్చిన మాట ప్రకారం ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. ఆ రోజు నేను ఆఫీసుకు వెళ్లనందున చాలా కార్యక్రమాలకు హాజరు కావలసి వచ్చింది. సర్వసాధారణంగా నేను చాలాకాలం నుండి సాయి భజనలకు, సాయి సత్సంగాలకు తప్ప ఇతరత్రా లౌకికమైన కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అలాంటిది ఆ రోజు అనేక లౌకికమైన కార్యక్రమాలకు హాజరు కావడం వలన రాత్రి భోజనం చాలా ఆలస్యమై నిద్రకు ఉపక్రమించేసరికి రాత్రి 11:30 అయింది. కానీ ఎంతసేపటికి నిద్రపట్టలేదు. అంతేకాక గుండె లయ తప్పి అనేక విధాలైన భయాలకు దారి తీసింది. నేను సాయి ధన్వంతరిని తలచుకుని, "నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బాబా. నా ఈ పరిస్థితిలో మార్పు కోరుకుంటున్నాను తండ్రి. అదే జరిగితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయి" అని ప్రార్థించి, నిద్రపట్టేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించసాగాను. సుమారు వేకువఝామున మూడు గంటల తర్వాత నా ఆరోగ్యం కుదుటపడి మంచి నిద్రపట్టింది. అంతేకాదు స్వప్నమునందు బాబా, "లౌకికమైన ఆహ్వానాలను మన్నించి ఎక్కడికీ పోవద్ద"ని హెచ్చరించారు. ఈవిధంగా బాబా తమ భక్తుల పరిణితిననుసరించి తగిన సూచనలిస్తూ ఆధ్యాత్మికమార్గంలో పయనింపజేస్తుంటారు.  


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయి ఉంటే సర్వమూ ఉన్నట్టే!


సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఈమధ్య కాలంలో చాలాసార్లు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఈరోజు కూడా నా అనుభవాలు కొన్ని పంచుకుందామని మీ ముందుకి వచ్చాను. నాకు ఇటీవల డెంగ్యూ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో జ్వరం తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. జ్వరం వచ్చిన నాటి నుండి బాబా ఊదీ ధరిస్తూ, బాబా నామాన్ని, శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని జపించాను. సాయి దయవల్ల తొందరగానే నాకు నయం అయింది. ప్లేట్లెట్లు తగ్గిపోతాయేమోనని నేను భయపడినప్పటికీ బాబా దయవల్ల అలా ఏమి జరగలేదు. అలాగే మా చెల్లెలికి జ్వరం వచ్చినప్పుడు కూడా సాయి ఊదీయే మాకు రక్ష అయింది


కొన్నిరోజుల తరువాత మా చిన్నాన్నగారి కుటుంబంలో వాళ్ళకి కరోనా వచ్చింది. ఆ విషయం తెలియడానికి మూడు రోజుల ముందే మా చిన్నాన్న వాళ్ళ బాబుని మా చెల్లెలు పట్టుకున్నందున నేను చాలా భయపడ్డాను. అప్పుడు బాబాతో, "మా ఇంట్లో ఎవరికీ ఏమీ జరగకుండా చూడండి బాబా. అలాగే చిన్ననాన్న వాళ్ళింట్లో చిన్న పిల్లలు ఉన్నందున వాళ్ల ఆరోగ్యం కూడా త్వరగా మెరుగుపడేలా చూడండి. అందరూ బాగుంటే ఈ అనుభవం మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు బాగున్నారు, మేము కూడా. మేము భయపడినట్టు ఏమీ జరగలేదు. ఇంకో అనుభవం ఏమిటంటే, మేము కొత్తగా అద్దె ఇల్లు మారాలనుకున్నాము. కానీ ఎన్నో విఘ్నాలొచ్చాయి. చివరికి ఇల్లు తీసుకున్నాక కూడా నెల రోజుల వరకు ఇల్లు మారడం జరగలేదు. తుదకు బాబాను వేడుకుంటే, ఆయన ప్రేమతో మా అభీష్టాన్ని నెరవేర్చారు. సాయి ఉంటే సర్వమూ ఉన్నట్టే! "ధన్యవాదాలు బాబా".



9 comments:

  1. Om sai ram baba kapadu me prema help kavali sai

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  4. Om sai ram please remove corona virues. People are afraid of it.what is going on we don't know. Please take care of the world baba. Om sai ram ❤❤❤

    ReplyDelete
  5. Jaisairam bless amma and her will operation recovery and bless me for my health and wealth of happiness.jaisairam

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo