సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 980వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది
2. నా మొర ఆలకించిన బాబా
3. బిజినెస్ బాగుండేలా అనుగ్రహించిన బాబా

బాబాను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది


నేను సాయిభక్తురాలిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నమస్కారాలు. నేను మొదటిసారిగా బాబా మా అబ్బాయి విషయంలో చేసిన మేలును తోటి సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయి చేసిన పొరపాటు వల్ల తన ఉద్యోగం పోయి, చాలా డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో మా బంధువులొకరు సహాయం చేశారు. నేను కూడా నా మంగళసూత్రంతో సహా అన్నీ కుదువపెట్టి ఆ డబ్బులు కట్టాము. అయినాసరే మా అబ్బాయిని ఉద్యోగం నుండి తొలగించారు. పై అధికారులతో మాట్లాడి, "డబ్బు కట్టాము కదండి, కనీసం రిలీవింగ్ లెటర్ అయినా ఇప్పించండి" అని ప్రాధేయపడ్డాము. అందుకు వాళ్ళు, "మా శాయశక్తులా ప్రయత్నిస్తామండి, ఆ పై ఆ భగవంతుని దయ" అని చెప్పి రిలీవింగ్ లెటరు కోసం ప్రయత్నించసాగారు. ఎంతో కష్టపడి చదివించుకున్న బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని భయంతో మేము ఏడవనిరోజు లేదు. "ఏంటి బాబా, మాకు ఈ పరీక్ష" అని నేను, మావారు చాలా బాధపడేవాళ్ళం. నేనైతే బాబా దగ్గర కూర్చొని ఏడుస్తుండేదాన్ని. ఈ బాధ ఇలా ఉండగా మావారికి జ్వరం వచ్చి, తన శరీరంలో ఎడమవైపు నొప్పి వస్తుండేది. ఉన్న బాధ చాలదన్నట్లు మరో సమస్య తోడయ్యేసరికి నేను రాత్రిళ్ళు కూడా నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్ని. సరిగా అప్పుడే ఎలా వచ్చిందో తెలియదుగాని మా ఫోన్‌లో ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వచ్చింది. నేను, మావారు పెద్దగా చదువుకోలేదు. ఏదో నొక్కితే ఈ  బ్లాగు వచ్చింది. దాంతో రోజూ బాబా మెసేజ్లు, భక్తుల అనుభవాలు వస్తుంటే చదివుతూ, "బాబా! నా బిడ్డకు రిలీవింగ్ లెటరు ఇప్పించండి. ఆ అధికారులతో మీరు మాట్లాడండి. నా బిడ్డకు రిలీవింగ్ లెటరు వస్తే, నేను కూడా ఈ బ్లాగు ద్వారా సాటి సాయిబంధువులతో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుంటుండేదాన్ని. ఒకరోజు "వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు. కానీ వీళ్ళిద్దర్నీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను" అన్న బాబా మెసేజ్ వచ్చింది. రెండునెలలు ఎంతో బాధపడిన తరువాత ఆఖరికి ఎలాగైతేనేమి బాబా దయవల్ల, ఆయన చేసిన మేలు వల్ల మా అబ్బాయికి రిలీవింగ్ లెటర్ వచ్చింది. తరువాత మా అబ్బాయి ఎన్నో కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. అన్ని రౌండ్లు పూర్తయ్యేవి కానీ, ఆఫర్ లెటర్ వచ్చేది కాదు. అప్పుడు నేను మళ్ళీ బాబాను, "అప్పుల్లో కూరుకుపోయాము బాబా. పిల్లాడికి ఉద్యోగం ఇప్పించండి తండ్రి" అని వేడుకోసాగాను. నా సాయి మళ్లీ ఆయన కృప చూపించారు. మా బాబుకు ఉద్యోగం వచ్చింది. 2021, అక్టోబర్ 4న తను కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మా వారికి ఆపరేషన్ అయింది. ఆ సమయంలో కూడా బాబా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇదంతా నా సాయితండ్రి దయ. నాకు బాగా అర్థం అవుతుంది, 'బాబాను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది'. "బాబా! నీ చల్లని చూపు మా కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి తండ్రి. నేను మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు, ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే ఎలా పంచుకోవాలో తెలియక ఆలస్యమైంది, మన్నించండి బాబా". నేను ఒకటి అనుకుంటున్నాను, బాబా దయవలన అది జరిగితే మళ్లీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు సాయి.


నా మొర ఆలకించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. నా పేరు రూప. ఈమధ్య ఒకసారి మా అమ్మకి ఆయాసం(breathing problem) వచ్చింది. వారం రోజులు అయినా  తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! అమ్మకి తొందరగా తగ్గిపోవాలి" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. నాలుగు రోజుల్లో అమ్మకి ఆయాసం తగ్గింది. "బాబా! మీకు శతకోటి నమస్కారాలు తండ్రి. అమ్మకి ఉన్న యూరిన్ సమస్యని తగ్గించు తండ్రి. అదేవిధంగా నాకున్న ఆరోగ్యసమస్యను తొందరగా తగ్గించు తండ్రి. చాలారోజులు నుండి భాధ పడుతున్నాను. కరుణ చూపించు తండ్రి సాయినాథా".


ఇటీవల స్కూలుకి వెళ్తున్న మా బాబుకి ఉన్నట్టుండి జ్వరం, జలుబు వచ్చాయి. ఇప్పుడున్న రోజుల్లో అవి అంటే భయమేస్తుంది. అందువలన నేను, "బాబా! బాబుకి మామూలు జ్వరమే అయుండాలి" అని అనుకున్నాను. బాబా మా మీద దయ చూపించారు. అది మాములు జ్వరమే. రెండురోజులకి తగ్గిపోయింది. "జలుబు కూడా తొందరగా పోయేలా అనుగ్రహించండి బాబా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి. బాబా మా అందర్ని రక్షించు తండ్రి".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బిజినెస్ బాగుండేలా అనుగ్రహించిన బాబా

 

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి. నేను రోజూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారి ఫేస్‌బుక్ పేజీ చూస్తూ ఉంటాను. అందులోని 'సాయి వచనాలు' స్వయంగా సాయి నాకే చెప్తున్నట్లు ఉంటాయి. ఇంకా సాయిభక్తుల 'అనుభవమాలిక'లో వచ్చే భక్తుల అనుభవాలను చదువుతూ బాబా ప్రేమను ఆస్వాదిస్తుంటాను. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. కొన్నిరోజుల నుండి మాకున్న వ్యాపారం బాగా నడవట్లేదు. అప్పుడు నేను, "బాబా! వ్యాపారం బాగా నడిస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవలన ఇప్పుడు వ్యాపారం కాస్త పర్వాలేదు. మమ్మల్ని సాయినాథుడు ఇలాగే చల్లగా చూడాలి. "సాయీ! నాకు అన్ని నువ్వే అయి కాపాడాలి తండ్రి. మాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. అవి కూడా త్వరగా తీరిపోయేలా అనుగ్రహించు సాయి".



9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram today sai leelas are very nice.Baba saves every devotees.He helps his devotees in time. Om sai ram❤❤❤

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her throat infection and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  7. Om sai ram bless my family with good health,wealth and happiness

    ReplyDelete
  8. Om Sairam please bless my kids and my wife return to my home and please approve my salary advance Baba

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo