సాయి వచనం:-
'ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది.'

'సాయిభక్తులకు శ్రీసాయినాథుడే దైవం, సాధన, మార్గం, గమ్యం!' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 976వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో దొరికిన ఉంగరం
2. ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాబా
3. బాబా కృపతో సమస్యల పరిష్కారం 

బాబా కృపతో దొరికిన ఉంగరం


'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః'. అందరికీ నమస్తే. నేను సాయి భక్తురాలిని. 2021 జూన్ లేదా జూలై నెలలో మా మరదలి ఉంగరం కనపడకుండా పోయింది. 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని చాలాసార్లు జపించి రోజుల తరబడి వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. మన బ్లాగులో ఎవరైనా భక్తులు పోగొట్టుకున్న తమ బంగారం వస్తువులు బాబా అనుగ్రహంతో దొరికాయని చదివినప్పుడల్లా మా వస్తువు కూడా దొరికేలా అనుగ్రహించమని మళ్ళీ మళ్ళీ బాబాని అడిగి విసిగించినప్పటికీ కూడా ఆ వస్తువు దొరకలేదు. తర్వాత ఆగస్టులో తమ్ముడువాళ్ళు ఇల్లు మారారు. అప్పుడు సామాన్లు ప్యాక్ చేస్తూ, అలాగే కొత్త ఇంటిలో ఆ సామాన్లు విప్పుతూ అంగుళం అంగుళం గాలించినా కూడా ఉంగరం దొరకలేదు. దాంతో ఇక ఆ ఉంగరం దొరకదన్న నిశ్చయానికి వచ్చాము. ఎందుకంటే, ఇల్లు మారటం వల్ల సామాన్లు అటు ఇటు తారుమారయ్యాక ఇంకేం దొరుకుతుందని అనుకున్నాము. అందరూ దాని గురించి వదిలేశారు. దాదాపు నేను కూడా వదిలేసి, 'బాబా ఏది చేసినా మన మంచికోసమే చేస్తార'ని అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు మనసు ఉండబట్టక, "ఉంగరం దొరకాలి" అని బాబాకి చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2021, అక్టోబర్ 27న మన బ్లాగులో అదివరకు ఎప్పుడో ప్రచురింపబడిన ఒక భక్తురాలి అనుభవమొకటి చదివాను. అందులో ఆవిడ బాబా అనుగ్రహంతో నవగురువార వ్రతం చివరిరోజున పోయిన తన బంగారు ఆభరణాలు దొరికాయని పంచుకున్నారు. అది చదివాక మళ్ళీ ఉంగరం గురించి బాబాను అడిగాను. ఒక చిన్న వస్తువుకోసం ఎందుకంత తాపత్రయమని మీకు అనిపించవచ్చు. కానీ బంగారం పోవటం నాకు మంచి విషయంగా అనిపించలేదు. అందుకే నేను అన్నిసార్లు బాబాను అడిగాను. మే నెలలో మాకు కరోనా వచ్చినపుడు నవగురువారవ్రతం చేస్తానని బాబాకి మొక్కుకున్న మొక్కులో భాగంగా 2021, అక్టోబర్ 28న నేను 8వ వారం పూజ మొదలుపెడుతుండగా మా తమ్ముడు వీడియో కాల్ చేసాడు. నేను పూజ అయ్యాక మాట్లాడతానని వాళ్ళకి పూజ ఏర్పాట్లు చూపించాను. వాళ్ళు ఫోన్లో నుంచే దణ్ణం పెట్టుకున్నారు. తరువాత నేను పూజ పూర్తిచేసి ఫోటో తీసి వాళ్ళకి పంపాను. కాసేపటికి నా మేనకోడలు ఫోన్ చేసి, "అర్జెంట్‍గా వాట్సప్ చూడమ"ని చెప్పింది. నేను వాట్సప్ ఓపెన్ చేసి చూస్తే, దాదాపు నాలుగు నెలల క్రితం పోయిన ఉంగరం పెట్టుకుని ఉన్న మా మరదలి ఫోటో ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, "ఉంగరం ఎక్కడ దొరికింది" అని అడిగాను. అందుకు వాళ్ళు నా మేనకోడలు ముందురోజు స్కూల్లో జాయిన్ అయిందని, రేపటి(శుక్రవారం) నుంచి స్కూలుకి పంపుదామని ఈరోజు (గురువారం) తన స్కూల్ బ్యాగు జిప్ లన్నీ తెరిచి శుభ్రపరుస్తుంటే, అందులో ఆ ఉంగరం దొరికిందని చెప్పారు. నాలుగు నెలలుగా దొరకని ఉంగరం దొరికింది. అది కూడా గురువారం నాడు. మేము ఎంత సంతోషించి ఉంటామో మీరు ఉహించగలరనుకుంటాను. అసలు ఆ ఉంగరం ఆ బ్యాగులోకి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో బాబాకే తెలియాలి. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని, అలిగిన బిడ్డల్ని అమ్మలా బుజ్జగించి, ఏది, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు నా సాయి. "ఎంతెంత దయ నీది ఓ సాయి!. నీ లీలలను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ సబూరితో ఉండేలా మమ్మల్ని దీవించు బాబా".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

శుభం భవతు!!!


ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. నా పేరు శశి. 2020 చివరిలో నేను చాలా తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడ్డాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గి, మళ్ళీ వస్తుండేదిగాని పూర్తిగా తగ్గేది కాదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో ఈ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోవాలి" అని బాబాకి మ్రొక్కుకుని ఊదీ నీళ్లు త్రాగాను. బాబా దయవల్ల చాలావరకు తగ్గింది. అయితే నాకు ఆ సమస్య తగ్గుతూనే మొదట మా చిన్నపాపకి జలుబు, జ్వరం వచ్చాయి. రెండోరోజుకి మా పెద్దమ్మాయికి కూడా జలుబు, జ్వరం వచ్చాయి. అప్పుడున్న కరోనా పరిస్థితుల్లో జలుబు, జ్వరం అంటే చాలా భయమేస్తుండేది. పైగా మా పెద్దమ్మాయి కాలేజీకి కూడా వెళ్తుంది. అందువలన భయంతో నేను బాబాకు నమస్కారం చేసుకుని, "బాబా! ఈ సమస్యనుంచి బయటపడేయండి. పిల్లలిద్దరికీ తగ్గేలా దయ చూపండి" అని వేడుకున్నాను. తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, "గుడిలో తెల్లని మిఠాయిలు పంచండి. మీ సమస్య పరిష్కారమవుతుంది" అన్న మెసేజ్ కనిపించింది. నేను ఆరోజు ఉదయం, సాయంత్రం పిల్లల చేత ఊదీ నీళ్లు త్రాగించి, మరుసటిరోజు గుడికి వెళ్లి పాలకోవా పంచిపెట్టాను. బాబా దయవల్ల మరుసటిరోజు పిల్లలిద్దరికీ జలుబు, జ్వరం తగ్గిపోయాయి. "బాబా! మీ పాదాలకు వేలవేల నమస్కారాలు. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం మేము తీర్చుకోలేము తండ్రి. మీ చల్లని చూపు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలానే ఉండేలా అనుగ్రహించు తండ్రి".


బాబా కృపతో సమస్యల పరిష్కారం


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా ఆశీస్సులతో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగంలో చేరాక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, "ప్రాజెక్ట్‌కి సంబంధించి కె.టి.(knowledge transfer) అందేలా చూడండి బాబా, మీ దయతో నేను కోరుకున్నది లభించాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా నేను కోరుకున్నట్లే అనుగ్రహించారు. దాంతో నా సమస్య పరిష్కారమైంది. అలాగే నెలసరి విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నేను సాయిని ప్రార్థించి, ఊదీ కలిపిన నీళ్లు త్రాగి, "బాబా! నాకు ఈరోజు నెలసరి రావాలి" అని అనుకున్నాను. బాబా దయవలన సరిగ్గా గంటన్నర తర్వాత నాకు నెలసరి వచ్చింది. "క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేసిన సహాయానికి చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఉద్యోగంలో నేను మంచిగా స్థిరపడేలా నన్ను ఆశీర్వదించండి".


14 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI KRISHNA

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  4. Om sai ram baba arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  5. Baba naku tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. ఓం సా౦ుు తండ్రి నాకు చాలా దురదలు వున్న ను. ఒక మందు వలన నాకు ఎలర్జీ వచ్చిన ది. కాని ఆ మందు వాడాలి.ఎక్కువగా వుండే దురదలు బాబా దయ వలన తక్కువ అయినను. ఇంకా దురదలు వున్నా సా౦ుు తండ్రి కాపాడుతున్న దేవుడు. నా కుమారుడు డాక్టర్ నాకు మందులు, ఇంజక్షన్లు చేసి నా కు తక్కువ చేశాడు. అది బాబా దయ. ఓం సా౦ుు బాబా❤❤❤

    ReplyDelete
  8. Om Jai sairam naku manchi health and e elargi nunchi kapadandi sairam nanu kapadu sairam garu

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺😃🌼😀🌸🥰🌹👪💕
    Saibaba, please bless my child with good health and long life.

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  11. Baba Kalyan ki marriage chai thandri pl meku satha vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl

    ReplyDelete
  12. Thandri vadu ma jevithallonunchi povali nuve mamalani kapadali thandri govt job prasadinchu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo