1. అంతా బాబా దయవల్లే!
2. బాబాను వేడుకున్నందువల్ల తగ్గిన జ్వరం
3. బాబా రాకతో కలిగిన ఆనందం
అంతా బాబా దయవల్లే!
నా పేరు శివ. నేను పుట్టి, పెరిగింది నర్సాపూర్ లో. నేను బాబా భక్తుడిని. మా కుటుంబ సభ్యులందరూ బాబా భక్తులు. ముఖ్యంగా మా అమ్మగారు బాబాకు అత్యంత భక్తులు. ఆవిడ ద్వారానే నేను బాబాకి భక్తుడిని అయ్యాను. నా చిన్నప్పటి నుండి బాబా నాకు ఏన్నో అనుభవాలు ప్రసాదించారు. ఆ అనుభవాలన్నీ ఒక్కొక్కటిగా బ్లాగులో పంచుకుంటాను. ముందుగా బ్లాగులో పంచుకుంటానని బాబాకి మాటిచ్చిన అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను.
నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు మా అమ్మానాన్నలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాము. మాది అందమైన కుటుంబం. నేను, నా భార్య నా తల్లిదండ్రులకు ఎంతో గౌరవమిచ్చి కృతజ్ఞతా పూర్వకంగా ఉంటాము. అయితే ఇటీవల ఒక అనివార్య పరిస్థితిలో మా నాన్నకి, నాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాదన కాస్త నేను మా నాన్నని తిడుతున్నట్లుగా సాగి, నా మాటలతో ఆయనకు కోపం వచ్చింది. అదే సమయంలో మా నాన్న ప్రవర్తన, మాటల వలన నేను కూడా కలత చెందాను. నా జీవితంలో మొదటిసారి నేను మా నాన్నతో ఒక వారం వరకు మాట్లాడలేదు. అంతేకాదు నేను అమ్మతో, "అమ్మా! నేను ఇక మీతో ఉండలేను. ఈ గొడవ కారణంగా నేను సమీప పట్టణానికి వెళ్లాలనుకుంటున్నాను" అని అన్నాను. అది విని అమ్మ కూడా బాధపడింది. అయితే, నా హృదయంలో మాత్రం నా తల్లిదండ్రులను విడిచి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే, నేను ఎప్పుడూ వాళ్ళను నా ప్రప్రథమ ఆరాధ్య దైవాలుగా చూస్తాను. ఒక వారం తర్వాత నేను బాబా ముందు కన్నీళ్లు పెట్టుకుని, "ఇదంతా ఏమిటి బాబా? నా కుటుంబానికి మీరు ఏమి చేయబోతున్నారు? నేను, నాన్న మాట్లాడుకోవడం లేదు. దయతో నాన్న మనసును మార్చండి. భవిష్యత్తులో నేను నాన్నను ఇబ్బందిపెట్టను, బాధించను" అని బాబాతో చెప్పుకుని, ప్రశాంతంగా ఆ రాత్రి నిద్రపోయాను. రెండు రోజుల తర్వాత నాన్న నాతో ఎంతో ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడారు. అది చూసి అమ్మ, నా భార్య ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇదంతా కేవలం బాబా అనుగ్రహం వల్లనే.
ఆ తర్వాత కోవిడ్ కారణంగా చాలాకాలం నుండి ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్న 6 సంవత్సరాల నా కూతురు తిరిగి మునుపటిలా స్కూలుకు వెళ్లింది. అదే రోజు తను తీవ్రమైన జ్వరం, పొడి దగ్గుతో బాధపడింది. ఆ పొడి దగ్గు కారణంగా పాపకి కోవిడ్ వచ్చిందేమోనని నేను ఆ రాత్రి భయపడి, "బాబా! పాపకి కోవిడ్ వచ్చినట్లు ఉంది, తనని రక్షించండి. దయచేసి పరిస్థితిలో మార్పు తీసుకుని రండి. తనకి కోవిడ్ రాకూడదు. దయచేసి తనపై కృప చూపండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు పాపకున్న పొడి దగ్గు తడి దగ్గుగా మారి ముక్కు కారడం మరియు జ్వరం సమస్యలు ఉన్నాయి. బాబా నా ప్రార్థన విన్నారు, పొడి దగ్గును తడి దగ్గుగా మార్చారు. అంతటితో నేను బాబా దయవల్ల పాపకు కోవిడ్ కాదని ప్రశాంతించి పాపను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. పాపను పరీక్షించి డెంగ్యూ జ్వరమని నిర్ధారించి, మందులిచ్చి, రెండు రోజుల తర్వాత ప్లేట్లెట్లు చెక్ చేయడానికి రమ్మన్నారు. కానీ నేను పాపని మళ్లీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళక, "తను త్వరగా కోలుకోవాల"ని బాబాను ప్రార్థించాను. ఆయన నా బిడ్డకు కోవిడ్ రాకుండా చూడటమే కాదు, డెంగ్యూ నుండి కూడా కాపాడారు. ఆరేళ్ల పాప కేవలం మూడురోజుల్లో డెంగ్యూ నుండి కోలుకోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇదంతా బాబా దయవల్లే. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉంది. బాబా నా మార్గదర్శి, సంరక్షకుడు, ఆయనే నాకు, నా కుటుంబానికి గమ్యం. "మాపై మీకున్న కృపకు ధన్యవాదాలు బాబా".
బాబాను వేడుకున్నందువల్ల తగ్గిన జ్వరం
నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారిపై బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు బాబా ఇటీవల మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు హఠాత్తుగా మా అన్నయ్యకి బాగా జ్వరం వచ్చింది. ఈ కరోనా పరిస్థితుల్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చాలా కంగారుగా ఉంటుంది. అందువల్ల అన్నయ్యకి జ్వరం అనగానే నేను చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే, "బాబా! అన్నయ్యకి తొందరగా జ్వరం తగ్గేలా చేసి ఏ ఇబ్బంది లేకుండా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అలాగే సమయానికి ఇంట్లో ఊదీ లేకపోవటం వలన బాబా దగ్గర అగరుబత్తి వెలిగించగా వచ్చిన పొడిని ఊదీగా బాబాని తలుచుకుంటూ, అన్నయ్యకి పెడుతున్నట్లు భావిస్తూ నేనే పెట్టుకున్నాను. ఇంకా, "బాబా! అన్నయ్యకి జ్వరం తగ్గిపోతే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. ఆపై ఆ రోజంతా వీలైనంతసేపు బాబా నామస్మరణ చేస్తూ గడిపాను. బాబా చూపిన ప్రేమవలన మరుసటిరోజు ఉదయానికి జ్వరం తగ్గిందని అన్నయ్య చెప్పాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో కొంచెం ఆలస్యం చేసినందుకు క్షమించండి బాబా. అమ్మవాళ్ళు ఒక పెద్ద సమస్యతో చాలా బాధపడుతున్నారని మీకు తెలుసు కదా బాబా. ఆ సమస్య నుంచి వాళ్ళని చాలా తొందరగా కాపాడు తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి మీద మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండేలా చూడు తండ్రి. ఈ కరోనా పరిస్థితుల నుండి అందరినీ ఆదుకోండి బాబా".
సమస్త లోకా సుఖినోభవంతు!!!
ఓం శ్రీ సాయినాథాయ నమః.!!!
బాబా రాకతో కలిగిన ఆనందం
ముందుగా బాబాకి వందనాలు. సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను వైజాగ్ నివాసిని. నేను మహాపారాయణ గ్రూపుల్లో టీచరుని. మహాపారాయణ ద్వారా చాలామంది సాయి భక్తులు నాకు స్నేహితులయ్యారు. ప్రతి గురువారం మహాపారాయణ తరగతుల పర్యవేక్షణ చేస్తూ సాయికి సేవ చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప అవకాశమిచ్చినందుకు సాయికి నా వందనాలు. సాయి దయవలన మేము కోవిడ్ వాక్సినేషన్ రెండు డోసులు వేసుకున్నాము. ఇక నా అనుభవానికి వస్తే... ఒకసారి నేను బాబా విగ్రహమొకటి తీసుకోవాలనుకుని ఆన్లైన్‌లో విగ్రహం కోసం ౩,౦౦౦ రూపాయలు పంపించాను. వాళ్ళు,"కొన్ని రోజుల్లో విగ్రహం పంపిస్తామ"ని చెప్పారు. అయితే తరువాత చాలారోజులు గడిచినప్పటికీ వాళ్ళు విగ్రహం పంపలేదు. దాంతో నేను, "ఏంటి బాబా? మీ మూర్తికోసం ఇంతలా ఎదురు చూస్తున్నాగానీ, ఇంకా రాలేదు" అని చాలా బాధపడి, 'వాళ్ళు ఇక పంపించరు' అనుకున్నాను. కానీ నెల రోజుల తర్వాత ఆ ఆన్లైన్ వాళ్లని మళ్లీ అడిగాను. అప్పుడు వాళ్ళు, "ఒక పదిరోజుల్లో పంపుతాం" అని అన్నారు. తరువాత సరిగ్గా వారంలో బుధవారం నాడు బాబా విగ్రహం మా ఇంటికి వచ్చింది. బాబాను చూసి ఎంతో సంతోషించి నా ఆనందాన్ని ఈ బాబా బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. మరుసటిరోజు గురువారం సంతోషంగా బాబాకి పూజ చేసుకున్నాను. "సాయీ! నా వివాహ విషయంలో సహాయం చేయండి. నా పేరెంట్స్ నాకింకా పెళ్లి కాలేదని ఆందోళనపడుతున్నారు. దయచేసి మంచి వ్యక్తితో వివాహబంధాన్ని ముడివేయండి". చివరిగా ఈ అవకాశమిచ్చిన సాయిబాబాకి, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteషిరిడి సాయి నాథ మీరిచ్చిన ఆశీస్సులతోనే నేను ఇలా ఉన్నాను ఆరోగ్యంగా.. అష్ట ఐశ్వర్య ప్రదం గా.. నా అనారోగ్యం రూపుమాపి ఆయురారోగ్యాలు ప్రసాదించిన మీకు వేల కోట్ల నమస్కారాలు సాష్టాంగ ప్రణామాలు హృదయపూర్వక కృతజ్ఞతలు బాబా
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness. Jaisairam
ReplyDeleteBaba Naa Flat manchi rate ki ammudithe marala shirdi vasta Baba
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete