శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించుకున్న అదృష్టవంతులలో షోలాపూర్ నివాసియైన ఆర్.సి.కపాడి ఒకరు. అతను తన జీవితంలో ఒక్కసారి మాత్రమే శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. తన మదిలో నిక్షిప్తం చేసుకున్న ఆ మధురానుభూతిని అతనిలా తెలియజేశాడు:
"చిన్నవయస్సులో ఉన్నప్పుడు నాకు సాధుసత్పురుషుల పట్ల అత్యంత ఆసక్తి ఉండేది. ఆ వయస్సులో నేను హుబ్లీకి చెందిన శ్రీసిద్ధారూఢస్వామి అనుగ్రహాన్ని పొందాను. 1917లో నేను పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు మా అన్నయ్య సఖారామ్ తన స్నేహితుడు రామ్‌భావు దేశ్‌పాండేతో కలిసి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత అద్భుతమైన బాబా దైవత్వం గురించి, అక్కడ వారు పొందిన అనుభవాల గురించి ఎంతో ఆనందంగా, రమణీయంగా వర్ణించారు. అవి నాపై చెరగనిముద్ర వేశాయి. దాంతో, ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్లి బాబాను దర్శిస్తానా అని ఆరాటపడసాగాను. అదలా ఉంచితే, దురదృష్టవశాత్తూ శిరిడీ నుండి వచ్చిన కొద్దిరోజులకే మా అన్నయ్య ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి బారినపడ్డాడు. అయితే తను బాబాను దర్శించి, వారి దివ్య సన్నిధిలో మూడురోజులు గడిపిన అదృష్టవంతుడు.
కొన్ని నెలల తరువాత నాకు శిరిడీ సందర్శించే అవకాశం వచ్చింది. మా కజిన్ (సోదరుడు) బాబా దర్శనానికి వెళ్లదలచి, "నాతో పాటు వస్తావా?" అని నన్ను అడిగాడు. నేను సంతోషంగా వెంటనే నా అంగీకారాన్ని తెలిపాను. ఆ రోజుల్లో రైలులో కోపర్‌గాఁవ్ వరకు వెళ్లి, అక్కడినుండి ఎడ్లబండిలో శిరిడీ చేరుకోవాల్సి ఉండేది. అలాగే మేము శిరిడీ చేరుకొని, వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వారి ముందు సాష్టాంగపడ్డాము. అప్పుడు ఆయన మమ్మల్ని దక్షిణేమీ అడగలేదు. కానీ, తరువాత మేము శిరిడీలో బసచేసిన రెండురోజుల్లో బాబా మమ్మల్ని తరచూ దక్షిణ అడుగుతూ ఉండేవారు. మా తిరుగు ప్రయాణం విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటారని మాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆయన కోరింది ఆయనకివ్వడానికి మేము చాలా సంతోషించాము. అందువలన మేము శిరిడీ నుండి బయలుదేరే సమయానికి మా జేబులు ఖాళీ అయిపోయాయి.
మేము శిరిడీ వెళ్లిన మరుసటిరోజు ఉదయం 8 గంటలకు బాబా లెండీకి వెళ్తున్నపుడు సాఠేవాడా సమీపంలో వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. నేను, నా సోదరుడు కూడా అక్కడికి వెళ్లి, ఇద్దరమూ పదేపదే వారి పాదాలకు నమస్కరించసాగాము. చివరికి బాబా, "అరే! ఎందుకు మీరు నా పాదాలకు పదేపదే నమస్కరిస్తున్నారు? మీరు ఇప్పటికే పదిహేడుసార్లు నమస్కరించారు. భక్తితో ఒకసారి నమస్కరించడానికి, పదిహేడుసార్లు నమస్కరించడానికి తేడా ఏమిటి?" అని అడిగారు.
ఆరోజు సాయంత్రం మేము దివ్యమైన బాబా చావడి ఉత్సవానికి హాజరై, చావడిలో బాబాకు ఆరతి ఇవ్వడం చూశాము. తరువాత బాబా ఒకసారి చిలిం పీల్చి, అక్కడ కూర్చున్న భక్తులకు అందించారు. వాళ్లంతా ఆ చిలిం పీల్చి ఆధ్యాత్మికానందాన్ని అనుభవించారు.
చివరిరోజున మేము మసీదుకు వెళ్లి బాబా ముందు సాష్టాంగపడ్డాము. మేము బయలుదేరడానికి ప్రత్యేకంగా బాబాను అనుమతి అడగలేదు. కానీ మనసులోనే మేము బయలుదేరుతున్నామని వారితో చెప్పాము. తరువాత బయలుదేరి మా వద్ద డబ్బు లేనందున కాలినడకన కోపర్గాఁవ్ చేరుకున్నాము. మా తిరుగు ప్రయాణానికి అదివరకే మా దగ్గర టికెట్లు ఉన్నందున రైలు ఎక్కాము. నాసిక్‌లో దిగి కాలినడకన వివిధ పవిత్ర స్థలాలను దర్శించి, రాత్రి కాగానే మా తదుపరి ప్రయాణం కొనసాగించడానికి తిరిగి స్టేషనుకి చేరుకున్నాము. అప్పటికే మేము చాలా ఆకలితో ఉన్నాము. ఇద్దరమూ మా జేబులు తడుముకున్నాము. మా కజిన్‌కి తన జేబులో రెండణాల నాణేలు నాలుగు దొరికాయి. వాటితో తను మరమరాలు కొని తెచ్చాడు. వాటిని తిని ఏదో విధంగా మేము ఇంటికి చేరుకున్నాము. ఈ సంఘటన ద్వారా, 'బాబా అనుమతి తీసుకొన్న తరువాతే శిరిడీ వదలి రావాల'నే పాఠాన్ని మేము నేర్చుకున్నాము. శిరిడీలో నేను గడిపిన ఆ మూడురోజులు నా స్మృతిఫలకంపై చిరస్మరణీయంగా చెక్కబడ్డాయి. అవి నా జీవితంలో మరపురాని రోజులు".
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.
Om sai ram baba nice story.baba your devotees are lucky because you are our Lord sai baba❤❤❤
ReplyDeleteOm Sri Sai Ram��������
ReplyDeleteJai Sairam
ReplyDelete🙏🙏🙏
ఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram baba mamalini rakshinchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha