- శిరిడీకి పిలిచి అన్నివిధాలా అనుగ్రహించిన బాబా
- సాయి కృపా కటాక్షంతో పూర్తిగా నయమైన దగ్గు
శిరిడీకి పిలిచి అన్నివిధాలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తుడు బి.మారుతి ప్రసాద్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు మారుతి ప్రసాద్. నేను కడప జిల్లా రెవెన్యూ డిపార్టుమెంటులో తహశీల్దారుగా పనిచేస్తూ 2009, డిసెంబరు నెలలో పదవీ విరమణ చేశాను. ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, మనస్ఫూర్తిగా ‘సాయీ!’ అని పిలువగనే ‘ఓయీ!’ అంటూ నేనున్నానని పలికే కలియుగ దైవమైన శ్రీ శిరిడీ సాయిబాబా నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన ప్రేమానురాగాలను, మధురమైన అనుభవాలను ఆత్మీయులైన సాయిబంధువులతో పంచుకొనుటకు అవకాశాన్ని కల్పిస్తున్న సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేను పదవీవిరమణ చేశాక శ్రీసాయి కొలువైయున్న శిరిడీ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనుకున్నాను. కొంతకాలం ఏవో ఆటంకాలతో వెళ్ళలేకపోయాను. దాంతో, ‘బాబా అనుమతి లేదు’ అనుకున్నాను. సాయిబాబా తన భక్తులను తన దగ్గరకు పిలిపించుకోవాలనుకుంటే, తన భక్తులు ఎంత దూరంలో ఉన్నా పిచ్చుకకు దారం కట్టి తన దగ్గరకు లాక్కున్నట్లు మనల్ని తన వద్దకు పిలిపించుకొని తన కృపాకటాక్షాలను పంచి ఆశీర్వదించి తన భక్తులను తృప్తిపరచి క్షేమంగా ఇంటికి చేర్చుతారు. అందుకు నిదర్శనంగా నా జీవితంలో సాయి ప్రసాదించిన అనుభవాన్ని తెలుపుకుంటున్నాను.
2006, జులై నెల, వర్షాకాలంలో నేను నా భార్యతో కలిసి శిరిడీకి వెళ్ళి బాబా ఆశీస్సులు పొందాలని నిశ్చయించుకున్నాను. శిరిడీకి వెళ్ళే దారిలో, మా పెద్ద కుమార్తెను, రెండవ కుమార్తెను కలిసి వెళ్ళాలనుకున్నాము. పెద్ద కుమార్తె తన కుటుంబంతో హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లోనూ, రెండవ కుమార్తె తన కుటుంబంతో మహారాష్ట్రలోని పర్భణి జిల్లా దగ్గరలో ఉన్న (సాయిబాబా జన్మస్థానంగా పిలువబడే) పత్రి గ్రామంలోనూ నివసిస్తున్నారు. పిల్లలను కలిసి వెళ్ళాలనే ఆకాంక్షతో కడప నుండి కర్నూలు మీదుగా హైదరాబాదుకు ప్రైవేటు ట్రావెల్స్‌లో నాకు, నా భార్యకు రెండు సీట్ల సిట్టింగ్ బుక్ చేశాను. ప్రయాణం రోజు బస్సు ఎక్కడానికి ట్రావెల్స్ ఆఫీసుకు వెళ్ళగా, వారు ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పారు. కారణం అడగ్గా, ‘భారీవర్షాల వల్ల కర్నూలుకు వెళ్ళే మార్గంలో ఓ బ్రిడ్జి తెగిందనీ, ఆ రూటులో ఏ బస్సులూ వెళ్ళవ’నీ చెప్పారు. ఎందుకిలా జరిగిందని బాధపడుతూ, “సాయీ! ఇకనైనా నీ దర్శనభాగ్యం కలిగించవా?” అని బాబాను వేడుకున్నాము. బాబాను వేడుకున్న కొంతసేపటికి ట్రావెల్స్ వారు మమ్మల్ని పిలిచి, “ఇంటికి వెళ్ళకండి. మిమ్మల్ని మరో మార్గంలో, అనగా కడప, తాడిపత్రి, కర్నూలు మీదుగా హైదరాబాదుకు చేరుస్తాము” అని చెప్పారు. కాసేపటికి వారు మా వద్దనున్న టికెట్టుపైనే స్లీపర్ కోచ్‌లో వెళ్ళమని చెప్పారు. అలా బాబా అనుగ్రహంతో ఆ స్లీపర్ కోచ్‌లో సుఖంగా హైదరాబాదు చేరుకొని, అక్కడ మా పెద్ద కుమార్తె వారింటిలో రెండు రోజులుండి చక్కగా దిల్‌షుక్‌నగర్ బాబా దర్శనం చేసుకున్నాము. రెండు రోజుల తరువాత మా రెండవ కుమార్తె నివసిస్తున్న పత్రి గ్రామానికి వెళ్ళడానికి దిల్‌షుక్‌నగర్ నుండి సికింద్రాబాద్ రైల్వేస్టేషనుకు ఆటోలో బయలుదేరాము. మార్గంలో ట్రాఫిక్ జామ్ అయినందువల్ల స్టేషనుకు అరగంట ఆలస్యంగా చేరుకున్నాము. అప్పటికే బయలుదేరే సమయం దాటిపోవడం వల్ల ట్రైన్ స్టేషన్ విడిచివుంటుందని అనుకున్నాం. కానీ ఆరోజు ఎందుకో ట్రైన్ బయలుదేరే సమయం ఆలస్యమైంది. స్టేషన్లోకి వెళ్ళి ప్లాట్‌ఫాంలో చూస్తే ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. వెంటనే బాబాను తలచుకుంటూ టికెట్ కౌంటరుకు వెళ్ళి, పత్రి గ్రామం దగ్గరలోని ‘మన్వత్ రోడ్’కు టికెట్ల రిజర్వేషన్ అడిగాను. అందుకు బుకింగ్ క్లర్క్, ‘మన్వత్ రోడ్ స్టేషనుకు రిజర్వేషన్ ఉండదు, దాని దగ్గరలోని పర్భణి స్టేషనుకు ఉన్నాయ’ని చెప్పాడు. అప్పుడు ఆలోచించుకునే వ్యవధి లేనందున పర్భణి స్టేషనుకు రిజర్వు టికెట్లు తీసుకొని స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కీ ఎక్కగానే ట్రైన్ కదిలింది. బాబా దయతో ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణం గడిచింది. ట్రైన్ పర్భణి స్టేషనుకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు చేరింది. రాత్రంతా ప్రయాణంలో అలసినందున ట్రైన్ పర్భణి స్టేషన్ చేరేప్పటికి మాకు మెలకువ రాలేదు. ట్రైన్ ఆ స్టేషన్ దాటాక మాకు మెలకువ వచ్చింది. పర్భణి స్టేషన్లో టికెట్ కలెక్టర్లు మారినందున వారు ప్రయాణీకులందరినీ చెక్ చేస్తూ ఉన్నారు. మాకు టికెట్ లేకపోవటంతో ఏమవుతుందోనని భయపడుతూ బాబాపై భారం వేశాము. టి.సి లు మా వద్దకు వచ్చి మా టికెట్ చూసి, ‘పర్భణి వరకే టికెట్ ఉంది, మీరు ఫైన్ కట్టాలి’ అని సతాయించారు. “మాకు ఈ రూటులో రావటం ఇదే మొదటిసారనీ, పర్భణి స్టేషన్ చేరేటప్పటికి గాఢనిద్రలో ఉండటం వల్ల లేవలేకపోయామ”నీ మేము వారిని రిక్వెస్ట్ చేశాము. అందుకు వారు, “మీరు ముందు వచ్చే ‘మన్వత్ రోడ్’లో స్టేషన్లో దిగాలి, అలా దిగకపోతే రెట్టింపు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంద”ని హెచ్చరించి వదిలేశారు. మేము దిగాల్సిన స్టేషన్ మన్వత్ రోడ్ కనుక అక్కడ దిగి పత్రి గ్రామం చేరుకుని, అక్కడ మా రెండవ కుమార్తె వారింటిలో రెండు రోజులుండి, ఆ గ్రామంలో సాయిబాబా జన్మస్థలంలో ఉన్న మందిరాన్ని దర్శించుకుని శిరిడీ బయలుదేరాము. శిరిడీ చేరి ఎంతో ఆనందంగా బాబాను దర్శించుకుని ఆయన కృపాకటాక్షాలను పొందాము. రెండు రోజుల తరువాత ‘తిరుగు ప్రయాణం ఎలా వెళ్ళాలా’ అని ఆలోచిస్తూ శిరిడీ రైల్వేస్టేషనుకు వెళ్ళాను. శిరిడీ నుండి గుంతకల్, కడప మీదుగా వెళ్ళవలసిన ట్రైన్ మధ్యాహ్నం బయలుదేరుతుందని తెలుసుకుని, టికెట్ కౌంటరుకు వెళ్ళి కడపకు రెండు రిజర్వ్ టికెట్లు తీసుకున్నాను. తరువాత రూముకెళ్ళి సామాన్లు సర్దుకుని స్టేషనుకు వచ్చి ట్రైన్ ఎక్కి బాబా కృపాకటాక్షాలు, ఆశీస్సులతో కడపకు సుఖంగా చేరాము. ఎంతో ప్రేమతో మమ్మల్ని శిరిడీకి పిలిపించుకుని, అద్భుతమైన తమ దర్శనాన్ని ప్రసాదించి, తిరిగి మమ్మల్ని ఇంటికి క్షేమంగా చేర్చిన కరుణామూర్తి శ్రీసాయికి మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాము.
సాయి కృపా కటాక్షంతో పూర్తిగా నయమైన దగ్గు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. ఇంతకుముందు నేను చాలాసార్లు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇటీవల నాకు జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా నాన్నగారికి ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద దగ్గు వచ్చింది. దగ్గు తగ్గటానికి మందులు వేసుకున్నారు. ఆ మందుల ప్రభావంతో తాత్కాలికంగా దగ్గు తగ్గినప్పటికీ మళ్ళీ వెంటనే వచ్చింది. దగ్గు కారణంగా ఆరోజు రాత్రి నాన్నగారికి చాలా ఇబ్బంది అయింది. బాబానే నమ్ముకున్న మనకు దారి ఆయనే కదా! అందుకే బాబాను ప్రార్థించి, “బాబా! మా నాన్నగారికి దగ్గు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకొని, కొద్దిగా బాబా ఊదీని నాన్నగారి గుండెకి రాసి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించాను. తరువాత మందులు వేసుకొని, తలగడ క్రింద ఊదీ పెట్టుకుని పడుకోమన్నాను. అంతేకాదు, మంత్రాలయ రాఘవేంద్రస్వామి మంత్ర చాంట్ ఆన్ చేసి వినిపించాను. ఆశ్చర్యంగా దగ్గు తగ్గిపోయింది. ఆ మరుసటిరోజు నుండి ఇంక ఆయనకి దగ్గు సమస్య రాలేదు. ఇదంతా సాయి కృపా కటాక్షం.
Om sai ram sai leelas are very nice.baba gives his darshan when he blesses us.udi is medicine to all worries.when we trust him holehearthly he takes care of us.sai i love you. Be with us. Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sairam!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
724 days
ReplyDeletesairam
Om sai ram baba pleaseeee bless my mother with good health thandri
ReplyDeleteOm sai ram baba please bless my mother
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete