- కనిపించని సర్టిఫికెట్లు దొరుకుట
- సాయి మహరాజ్ సన్నిధి ద్వారా బాబా ఆశీస్సులు
- విషమ సమయంలో బాబా చూపిన కరుణ
- ఊదీ మహిమ - ముఖంపై ఏర్పడిన సమస్య మాయం
హైదరాబాదు నుండి సాయిభక్తుడు ఎన్. సూర్యనారాయణమూర్తి తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును గత 3 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తున్న సాయినాథుని పాదాలకు వినమ్ర అంజలి ఘటిస్తూ..
నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను ఈ బ్లాగ్ ద్వారా బాబా నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలనెన్నో తోటి సాయిభక్తులతో పంచుకున్నాను. సాయి దీవెనలతో మా అమెరికా ప్రయాణం పూర్తిచేసుకుని తిరిగి ఇండియా వచ్చిన తరువాత ఇటీవల బాబా ప్రసాదించిన మరికొన్ని అద్భుతాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
1) కనిపించని సర్టిఫికెట్లు దొరుకుట:
మేము అమెరికాలో మా రెండవ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు, తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా మా అమ్మాయి తన ప్రాథమికవిద్య మొదలుకొని వైద్యవిద్య వరకు గల ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ కూడా మా దగ్గర హైదరాబాదులో ఉన్నాయనీ, తన దగ్గర కేవలం సర్టిఫైడ్ కాపీలు మాత్రమే ఉన్నాయనీ, అందువల్ల హైదరాబాద్ వెళ్ళాక ఒరిజినల్ సర్టిఫిట్లన్నీ చెక్ చేసి పంపమనీ చెప్పింది. అలాగేనని తనకు మాటిచ్చి మేము హైదరాబాదు వచ్చేశాము. హైదరాబాదు వచ్చాక 10 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ తర్వాత ఆ సర్టిఫికెట్ల కోసం ఇంట్లో అన్నిచోట్లా వెతికాము. కానీ 5 రోజుల పాటు వెతికినా సర్టిఫికెట్లు ఎంతకీ కనపడలేదు. దాంతో మేము చాలా కంగారుపడ్డాము. అటువంటి పరిస్థితులలో, మనందరి రక్షకుడైన సాయినాథుని స్మరించి, సమస్యను ఆయనకు విన్నవించి, సర్టిఫికెట్లు దొరికితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో ఈ అద్భుతాన్ని పంచుకుంటానని మ్రొక్కి, తిరిగి అన్నిచోట్లా వెతికాము. కానీ సర్టిఫికెట్లు దొరకలేదు. తెల్లవారితే గురువారం (2021, మార్చి 18). నేను మా ఆఫీసుకి వెళ్ళిన తరువాత మా ఆవిడ చివరి ప్రయత్నంగా తన చీరలపెట్టె వెతుకుతుండగా, ఆ చీరల మధ్య ఒక చీరలో ఈ సర్టిఫికెట్ల కవరు దొరికింది. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పగానే ఎంతో సంతోషంతో సాయినాథునికి వేవేల నమస్కారాలు చెప్పుకున్నాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం సాయి మహరాజ్ సన్నిధిలో ఈ అద్భుతమాలను ఆయన మెడలో వేస్తున్నాను.
2) సాయి మహరాజ్ సన్నిధి ద్వారా బాబా ఆశీస్సులు:
A. ఇటీవల మా విజయనగర్ కాలనీలో ఉంటున్న సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి 10 రోజుల పాటు సాయి నామజపము, లక్ష మల్లెల పూజ, బియ్యము పూజ, 24 గంటలు సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణలు జరిపించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీ ఆదివారంనాడు ఓంసాయి శ్రీసాయి జయజయసాయి భజన జరిపి, అన్నదానంతో ఆ కార్యక్రమం ముగించారు. ‘నాకు బాబా ఆశీస్సులు ఎలా అందుతాయి?’ అని ఆమె అనుకొంటుండగానే బాబా అనుగ్రహచిహ్నంగా ఆరోజు మన బ్లాగులో ఆమె అనుభవం (గాణ్గాపురం వెళుతుండగా పెద్ద ప్రమాదాన్ని బాబా తప్పించిన విధము) ప్రచురితమైంది. తద్వారా తమ ఆశీస్సులు, దత్తుని ఆశీస్సులు బాబా అందజేశారని చెప్పగానే ఆమె ఆనందభాష్పాలతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంది. అంతకుముందే ఒకరోజు శిరిడీ సాయి సంస్థాన్ వారు ఆమెకు ఫోన్ చేసి, వాళ్ళు ఇటీవల శిరిడీ దర్శనానికి వెళ్లి ఉన్నందున వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఆమె వాళ్లతో తన ఇంట జరుగుతున్న కార్యక్రమాలు గురించి చెప్పింది అందుకు వాళ్ళు అది బాబా ఆశీర్వాదామని చెప్పారు.
B. ఇటువంటిదే మరొక అనుభవం. ఏప్రిల్ 9వ తారీఖు శ్రీమతి కృష్ణవేణిగారి (సాయి అంకితభక్తులు కీ.శే. శ్రీ శంకరయ్య గారి భార్య) జన్మదినం. ఇటీవల ఆమె పరమపదించిన కారణంగా, ఆ సమయంలో కరోనా తీవ్రంగా ఉండి ఎటువంటి సమావేశాలు జరిపే వీలులేనందున ఆమె కుమార్తెలు, అల్లుళ్ళు, దేశవిదేశాలలో ఉన్న ఆమె బంధువర్గము ఆమెకు నివాళిగా ఏప్రిల్ 10వ తారీఖునాడు జూమ్ (zoom) ద్వారా ఆన్‌లైన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ జరిగినరోజే, కృష్ణవేణిగారి మరణ సమయంలో ఆమెకు బాబా తన దివ్యహస్తాన్ని అందించిన అనుభవం (నేను వ్రాసింది) ఈ బ్లాగులో ప్రచురింపబడింది. అంటే, బాబా ఈ బ్లాగు ద్వారా కూడా ఆమె ఆత్మకు శాంతి కలిగించినట్లే కదా. ఈ విషయాన్ని మీటింగ్ ప్రారంభానికి ముందే వారి కుమార్తెలకు చెప్పి ఆ లీలను వారికి ఫార్వర్డ్ చేయడంతో వారు బాబాకు అనేక కోట్ల కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
3) విషమ సమయంలో బాబా చూపిన కరుణ
నేను ఇంతకుముందు మా కాలనీలో శ్రీమతి జ్యోతిగారింట జరిగిన కార్యక్రమాలు చెప్పాను కదా. 10 రోజులపాటు జరిగిన ఆ కార్యక్రమాలలో మా శ్రీమతి ఎంతో శ్రమించింది. తిరిగి ఇప్పుడు కరోనా విజృంభిస్తున్నవేళ ఆమెకు ఎటువంటి సమస్యా రాకూడదని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆమె కరోనాకు వ్యాక్సినేషన్ కూడా వేయించుకుంది. అయినప్పటికీ ఏప్రిల్ 7వ తేదీన ఆమెకు స్వల్పంగా జ్వరం వచ్చింది. ఆ మరునాడు మేము డాక్టరుని సంప్రదించగా డాక్టర్ నన్ను, ఆమెను కరోనా పరీక్ష చేయించుకోమన్నారు. మేమిద్దరం పరీక్ష చేయించుకొనగా నాకు నెగెటివ్ అనీ, మా శ్రీమతికి పాజిటివ్ అనీ రిపోర్టు వచ్చింది. ఒక్కసారిగా నేను కృంగిపోయాను. తను కూడా కొంచెం అధైర్యపడింది. అయినప్పటికీ నేను, “మనం ఈ సమస్యను బాబాకే వదిలేద్దాము, ఆయనే చూసుకుంటార”ని మా శ్రీమతికి నచ్చజెప్పి తన రిపోర్టును మా డాక్టరుగారికి చూపించగా ఆయన, “మరేం ఫరవాలేదు, ఆమెకు వచ్చిన కరోనా తీవ్రమైంది కాదు, వైరస్ స్వల్పంగానే ఉంది. మందులు వాడితే 7 రోజుల్లో తగ్గిపోతుంది. ఆమెను ధైర్యంగా ఉండమనండి. ఇంట్లోనే ఉంటూ నేనిచ్చిన మందులు వాడమని చెప్పండి” అని చెప్పారు. మేము బాబాను నమ్ముకొని 7 రోజులు మందులు వాడి, తిరిగి డాక్టరును కలవగా, ఆయన “ఎటువంటి ఇబ్బందీ లేదు, ఆమెకు కరోనా లక్షణాలు తగ్గి నెగెటివ్ వచ్చింది” అని చెప్పారు. బాబా చూపిన ఈ అద్భుత కరుణను మన సాయి మహరాజ్ సన్నిధిలో సాటి సాయిభక్తులతో పంచుకుంటే బాబాకు కృతజ్ఞతలు అర్పించినట్లే అని భావించి, బాబా ఆదేశానుసారం మీతో పంచుకుంటున్నాను.
సాయిభక్తులారా! ప్రతిరోజూ మన సద్గురు సాయి బ్లాగును చదవండి, బాబా మనతో మాట్లాడినట్లే ఉంటుంది. ఈ కరోనా మహమ్మారి పోయేవరకు మీకు వచ్చిన రీతిలో బాబా నామజపం చేయండి. సాయి అనుగ్రహాన్ని పొందండి.
చివరిగా, ఇది వ్రాస్తున్న సమయంలో టీవీలో టి.టి.డి వారి ఛానెల్లో, సహస్ర దీపాలంకరణ సేవలో గాయనీమణి విఠల నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఈ అనుభవాలు వ్రాస్తున్న నాకు సాయిదత్త వెంకటరమణుడు ఊయలలో ఊగుతూ దర్శనమివ్వడం బాబా నాకు ప్రసాదించిన అద్భుత అనుభూతి.
ఊదీ మహిమ - ముఖంపై ఏర్పడిన సమస్య మాయం
సాయిభక్తురాలు నళిని ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నళిని. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురింపబడుతున్న అనుభవాలు చదువుతాను. నాకు ఈమధ్య ముఖం మీద చిన్న చిన్న రంధ్రాలు వచ్చాయి. వెంటనే, "వాటిని తగ్గించమ"ని బాబాను వేడుకొని, 'సాయి సచ్చరిత్ర' సప్తహపారాయణ ప్రారంభించాను. నేను బ్లాగులో ఊదీ మహిమల గురించి చాలా చదివి ఉన్నందున ఆ రంధ్రాలపై ఊదీ రాయడం కూడా మొదలుపెట్టాను. ఇంకా, "నా ఈ సమస్య తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. 2021, ఏప్రిల్ 21, బుధవారంరోజు నా పారాయణ పూర్తయింది. మరుసటిరోజు గురువారానికి నా ముఖం మీద ఏర్పడిన సమస్య పూర్తిగా సమసిపోయింది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నేను మీకు చాలా ఋణపడివుంటాను". అనుకున్నంతనే మా బాధలను తీర్చే సాయి మహరాజుకి నా నమస్కారాలు తెలుపుకుంటూ... సెలవు.
ఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram 1st sai leela is very nice. He wrote very well.what is rice pooja. Please write about that pooja.in star sai there are many poojas.om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram baba Amma arogyam bagundali thandri please
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri please
ReplyDelete⚘🏵🌷Om Sri Sai Ram⚘🏵🌷
ReplyDeleteOm Sairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete