ఈ భాగంలో అనుభవం:
- ప్రప్రథమ బాబా స్వప్నదర్శనం - అడిగి మరీ ప్రసాదించిన ముఖదర్శనం
హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు శ్రీమతి మాధవి తనకు బాబా ప్రసాదించిన అమూల్యమైన స్వప్నదర్శన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు మాధవి. బాబా తమ భక్తులకు ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తుంటారు. వాటిలో కొన్ని ఎప్పటికీ మరిచిపోలేని మధురస్మృతులుగా ఉంటాయి. వాటిని ఎప్పుడు కళ్ళుమూసుకొని గుర్తుచేసుకున్నా మొదటిసారి పొందిన అదే ఆనందానుభూతి కలుగుతుంది. మరల మరల ఆ అనుభూతిని పొందగలుగుతున్నామంటే, అది కేవలం బాబా కృపే! అటువంటి మధురస్మృతిని బాబా నాకు తొలిసారి అందమైన స్వప్నదర్శనంగా బహూకరించారు. స్వప్నమే అయినా ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడే సజీవ దృశ్యమది. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. "బాబా! మీరు నాపై చూపిన ఆ ప్రేమ సరిగా అక్షరరూపం దాల్చేలా ఆశీర్వదించండి".
"నాకు సంబంధించినవారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు" అని బాబా చెప్పినట్లుగా నేను కూడా ఒక కోరికతోనే ఆయనకు చేరువయ్యాను. నేను 1996 నుండి బాబా భక్తురాలిని. అయితే నేను అప్పట్లో కేవలం ‘గురువారం భక్తురాలిని’. అందరి దేవుళ్ళతో పాటు బాబా, అంతే. ఆయనకంటూ ప్రత్యేక స్థానమేమీ ఉండేది కాదు. అలాంటిది 2013, జనవరి 1న బాబా నన్ను పూర్తిగా తమ చెంతకు చేర్చుకున్నారు. 2012 చివరిలో మా బంధువులలో ఒకరు 'సాయి సచ్చరిత్ర' సప్తాహపారాయణ చేస్తే మనసులో ఉన్న కోరిక ఏదైనా బాబా వెంటనే తీర్చేస్తారనీ, అది తన అనుభవమనీ చెప్పి, తనకు కలిగిన ఆ అనుభవాన్ని నాతో పంచుకుంది. నేను ఆ క్షణంలోనే 'సచ్చరిత్ర' పారాయణ చేయాలని నిర్ణయించుకొని 2012, డిసెంబరు 27వ తేదీ, గురువారంనాడు పారాయణ ప్రారంభించాను.
నేను సప్తాహపారాయణ ప్రారంభించిన ఆరవరోజు, అనగా 2013, జనవరి 1, మంగళవారం ఉదయం నాలుగు ఐదు గంటల ప్రాంతంలో నాకొక కల వచ్చింది. ఆ కలలో, నేను ఒక ప్లేటులో కొద్దిగా బియ్యం పోసి మా ఇంటి బాల్కనీలో పెట్టాను. కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూస్తే, బియ్యపు గింజలు బాల్కనీ అంతా చెల్లాచెదురుగా పడివున్నాయి. అది చూసి నాకు చాలా చిరాకుగా, కోపముగా అనిపించి, కోతులే ఈ పని చేసుంటాయని వాటిని తిట్టుకుంటూ వెళ్లి వెయిటింగ్ రూములో ఉన్న సోఫాలో కూర్చుని సచ్చరిత్ర చదువుతున్నాను. అంతలోనే బాబా చాలా వేగంగా ఆ బియ్యం పడివున్న బాల్కనీ నుండి, వెయిటింగ్ రూమ్ మీదుగా మెయిన్ డోర్ వైపుకు వెళుతుండటం గమనించాను. నేను కళ్ళతో బాబాను చూడలేదుగానీ, వెళ్తున్నది బాబా అని గుర్తించాను. మరో అడుగు వేస్తే బాబా ఆ మెయిన్ డోర్ దాటి బయటకు వెళ్ళిపోతారనగా నేను బాబాతో, "మీరు అక్కడే ఆగిపోండి బాబా. నేను మిమ్మల్ని నిజంగా ఇష్టపడినట్లయితే, నా ప్రేమ నిజమైనట్లయితే అడుగు బయటకు వేయకుండా లోపలికి రండి" అని అన్నాను. బాబా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. అప్పుడు నేను బాబా వద్దకు వెళ్లి, వారి పాదాల చెంత కూర్చున్నాను. బాబా కోపంగా నాతో, "నేను చేయని పనికి నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు" అని అన్నారు. నేను, "అయ్యో బాబా! నేను మిమ్మల్ని నిందిస్తానా? నాకు అంత ధైర్యం ఉందా? మనస్ఫూర్తిగా ఇష్టపడేవాళ్ళని ఎవరైనా నిందిస్తారా, మీరే చెప్పండి? నేను తిట్టింది కోతులని, మిమ్మల్ని కాదు బాబా. మీరు కాస్త శాంతించండి" అని అన్నాను. దాంతో బాబా కోపం కాస్త తగ్గి, "అది సరే, నువ్వు నన్ను చూడనైనా చూడలేదు, మరి నువ్వు నన్ను ఎలా గుర్తించి ఆగిపొమ్మన్నావు?" అని అడిగారు. అందుకు నేను, "మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే, వారి ఉనికిని మన మనసు గుర్తించి చెబుతుంది కదా బాబా! అలాగే నా మనసు మిమ్మల్ని గుర్తించింది. అందుకే అంత కోపంగా మీరు వెళ్తున్నా, అంత ధైర్యంగా ఆగిపొమ్మని మీతో చెప్పాను" అని అన్నాను. నా సమాధానానికి బాబాకు నా మీద ఉన్న ఆ కాస్త కోపం కూడా పోయి, ఎంతో ప్రేమగా నా తలపై చేయి వేసి, "ఏం కావాలో చెప్పు?" అని అన్నారు. నేను, "ఏమీ వద్దు బాబా" అని బదులిచ్చాను. "పర్లేదులే, నీ మనసులోని కోరికేమిటో చెప్పు" అని బాబా అన్నారు. నేను మరలా, "నాకు ఏమీ వద్దు బాబా" అని అన్నాను. అప్పుడు బాబా, "సరే, నా పాదనమస్కారం చేసుకో! లేకపోతే మళ్లీ నన్ను తిడుతూనే ఉంటావు. 'వచ్చావు. కనీసం పాదదర్శనమైనా ఇవ్వకుండా, ఆశీర్వదించకుండా వెళ్లిపోయావు' అని తిడతావు. నీతో నాకెందుకు ఆ తగవు?" అని అన్నారు. బాబాకు, నాకు మధ్య ఇంత సంభాషణ జరుగుతున్నా నేను మాత్రం రెండు చేతులు జోడించి, నా తలను క్రిందికి వంచి వారి పాదం వైపు చూస్తూ మాట్లాడుతున్నానే గానీ బాబా ముఖాన్ని చూడలేదు. అప్పటివరకు ద్వారకామాయిలో రాతిపై కూర్చొని ఉన్న విధంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్న బాబా, తమ కుడికాలిని క్రిందికి దించి, "ఆఁ.. ఇప్పుడు నమస్కరించుకో" అని అన్నారు. దాంతో, బాబాకు కుడివైపుగా కూర్చుని ఉన్న నేను కొంచెం ప్రక్కకు జరిగి వారి పాదాలపై నా తలను ఉంచాను. నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా గుర్తున్న విషయమేమిటంటే, బాబా కాలి బొటనవ్రేలి గోరు కొంచెం పెద్దగా ఉండటం, వారి తెల్లని మృదువైన పాదాలపైన నరాలు ఆకుపచ్చరంగులో చాలా స్పష్టంగా కనబడటం. నేను నా తలను బాబా పాదాలపై పెట్టినప్పుడు, బాబా కుడికాలి బొటనవ్రేలి గోరు నా నుదుటికి మృదువుగా గుచ్చుకుంది. నేను నా రెండు చేతులతో బాబా పాదాలు ఒత్తుతూ ఉండగా, బాబా తమ కుడిచేతిని నా తలపై వేసి ఎంతో ప్రేమగా నన్ను ఆశీర్వదించారు.
తరువాత బాబా నాతో, "నన్ను చూడాలని ఉందా?" అని అడిగారు. నేను వారి పాదాలకు నమస్కరిస్తూనే కన్నీళ్లపర్యంతమయ్యాను. ఆనందంతో నా కళ్ళనుంచి ధారాపాతంగా ప్రవహిస్తున్న కన్నీటితో వారి పాదాలను కడిగేస్తానేమో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. బాబా చూపుతున్న ప్రేమకు నాకు మాట రావడం లేదు. అంతలో బాబా, "ఇంతసేపూ నా పాదాలే చూస్తూ మాట్లాడుతున్నావు. నన్ను చూడాలని నీకు అనిపించడం లేదా?" అని అడిగారు. నోటా మాట రాక నేను, "నా మనసేంటో మీకు తెలుసు కదా బాబా" అని మనసులోనే బదులిచ్చాను. అప్పుడు, "సరే, మరి నన్ను చూడు" అని అన్నారు బాబా. నేను నెమ్మదిగా నా తలను పైకెత్తి బాబాను చూశాను. కానీ బాబా నాకు స్పష్టంగా కనపడట్లేదు, మసకమసకగా కనబడుతున్నారు. నా స్థితిని గుర్తించిన బాబా, "కన్నీళ్లు తుడుచుకుని చూడు" అని అన్నారు. వెంటనే నా రెండు కళ్ళను తుడుచుకొని బాబా వైపు చూశాను. బాబాను చూడటానికి నాకు రెండు కళ్ళూ సరిపోలేదు. బాబా తెల్లని శరీరఛాయతో, తెల్లని గడ్డంతో ఉన్నారు. ఆయన ముఖం మీద చర్మం ముడతలు పడివుంది. ఎంతో ప్రేమతో కూడిన స్నిగ్ధమైన ఆ చిరునవ్వు నా మనసును కట్టిపడేసింది. అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్నవి బాబా కళ్ళు. అవి ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేకపోతున్నాను. బాబా ఇష్టంగా ఇచ్చిన దర్శనం కాబట్టే నేను వారి కళ్ళలోని తేజస్సుని చూడగలిగానేమో అని నా మనసుకు అనిపిస్తుంది. నేను సూటిగా బాబా కళ్ళను చూస్తూ ఉన్నాను. బాబా కూడా చిరునవ్వుతో 'నీ మనసు తృప్తిపడేంతవరకు నన్ను చూడు' అన్నట్టుగా ఎంతో ప్రేమగా నా వైపు చూస్తున్నారు. నా ప్రథమ బాబా ముఖదర్శనమది, ఎంతో ప్రేమగా అడిగి మరీ నాకు ప్రసాదించిన ఆనందస్వరూప దర్శనమది. ఆ సమయంలో నా మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. నా మనసు ఆ దివ్య దర్శనంతోనే శాంతించింది. ఆ దర్శనంతోనే బాబా నన్ను పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నారు. అంతలా బాబా నన్ను అనుగ్రహించారు.
తరువాత, అప్పటివరకు బాబా కళ్ళనే చూస్తున్న నా దృష్టి కాస్త ప్రక్కకు మరలింది. బాబా వెనుకగా కొండలు, నిర్మలమైన ఆకాశం, సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్న దృశ్యం గోచరమైంది. నేను, బాబా మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నాము. అంటే, అప్పటివరకు మేమున్న మా ఇల్లు, సోఫాలు మాయమై మేమెక్కడో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉన్నాము. బాబా తమ పాదాల వద్ద నాకు స్థానాన్ని అనుగ్రహించినందుకు గొప్ప ఆనందానుభూతి కలుగుతోంది. కొన్ని క్షణాల తర్వాత బాబా, "ఆఁ.. చెప్పు, ఇప్పుడు సంతోషమేనా?" అని అడిగారు. కానీ నేను అనుభవిస్తున్న ఆనందంతో మాటలు రాక మూగబోయాను. కొంతసేపటికి నా మనస్సు తృప్తిపడి నా తలను మరలా బాబా పాదాలపై ఉంచి నమస్కరించాను. అప్పుడు బాబా తమ కుడిచేతితో నా తల నిమురుతూ, "సంతోషంగా ఉండు" అని ఆశీర్వదించారు. తరువాత బాబా తమ చేయి వెనక్కి తీసుకుంటుండగా నా తలవెంట్రుకలు వారి చేతివేళ్ల గోర్లలో చిక్కుకుని ఉన్నందున నా జుట్టు లాగుతున్నట్లు అనుభవమైంది. దాంతో నాకు మెలకువ వచ్చింది. అప్పటివరకు జరిగినదంతా కల అని నాకు ఎంత మాత్రమూ అనిపించడం లేదు. నా కళ్ళనుండి నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. కన్నీళ్లతో నా జుట్టంతా తడిసిపోయివుంది. నా శరీరమంతా ఒకరకమైన పారవశ్యస్థితిలో ఉంది. అప్పటి నా పరిస్థితి గురించి నేను సరిగా చెప్పలేకపోతున్నాను. కళ్ళు తెరిస్తే బాబాను మిస్ అవుతానేమోనన్న బాధతో కళ్ళు తెరవలేకపోతున్నాను. పూర్తిగా నా కళ్లు తెరవడానికి పదినిమిషాల సమయం పట్టింది. ఆలోగా నేను బాబాను, "ఇదంతా ఎప్పటికీ నాకు గుర్తుండేలా అనుగ్రహించండి. నేను మీ రూపాన్ని ఎప్పటికీ మరవకుండా చూడండి. మీరు నన్ను వదిలిపెట్టకండి" అని బాబాను వేడుకున్నాను.
బాబా అనుగ్రహించిన దర్శనానికి నేను ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ దర్శనంతో నేను పొందిన అనుభూతి ఒక వారం రోజులపాటు అలాగే కొనసాగింది. అస్సలు మర్చిపోలేకపోయాను. స్వప్నంలోని బాబా రూపం నా కళ్ళలో స్థిరంగా నిలిచిపోయింది. ఆ రూపం కోసం ఫేస్‌బుక్‌లో వెతికాను. బాబా ఎంత అనుగ్రహించారంటే, ఆయన నాకు స్వప్నంలో ఏ విధంగా అయితే దర్శనమిచ్చారో ముమ్మూర్తులా అదే రూపంలో ఉన్న ఫోటో నాకు దొరికింది. (అంతకుముందెన్నడూ నేను ఆ ఫోటో చూడలేదు.) ఆ ఫోటోను ఈ అనుభవంతో పాటు జతపరుస్తున్నాను. అంతేకాదు, సరిగ్గా నెలరోజులలోపే, అనగా 2013, జనవరి 26, శనివారంనాడు మొట్టమొదటిసారిగా పవిత్ర శిరిడీక్షేత్ర దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు బాబా. ఇకపోతే, ఏ కోరికతో అయితే నేను పారాయణ చేశానో అది నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా బాబా ప్రసాదించిన తొలి దర్శనానుభూతి మాత్రం ఎప్పటికీ మరవలేనిది. ఈనాటికీ కళ్ళుమూసుకుంటే అదే అనుభూతి కలిగేలా అనుగ్రహిస్తున్నారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! నేను ఎప్పటికీ మీ పాదాలను మరవకుండా ఉండేలా, సదా మీ ధ్యాసలోనే ఉండేలా అనుగ్రహించండి బాబా!”
Om sai ram sai gave her blessings through dream.her dream is beautiful.sai ram gives opportunity for some body who are lucky.baba bless es in dream.om sai ram I want you come in dream.please bless my desire.please bless my son and be with him
ReplyDeleteOm sai ram,, miru entho dhanyulu elanti anubhavam kaliginanduku
ReplyDeleteఓం సాయి రామ్. అద్భుతమైన దర్శనం. జై సమర్థ సద్గురు సాయి నాథ మహరాజ్ కీ.
ReplyDeleteOm sairam, your lucky person.
ReplyDeleteOm sairam
ReplyDelete🙏🙏🙏
ఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram madhavi garu chala adrustam baba kanipincharu ante u r so lucky
ReplyDeleteOm sai ram baba amma ki smell tondarga ravali sampurna arogyani prasadinchu baba kapadu thandri
ReplyDeleteAdbhutamiena darsanam podina meeku sastanga namaskaraalu.
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete730 days
ReplyDeleteSairam
Meru chala adrushtavanthulu madhavi Garu.om sauram
ReplyDeleteMiku baba garu chala manchi darshanam icharu ..chadhuvthunte ne kalla mundu aa dhrushyalu kanipisthunai andi
ReplyDeleteTq sai
DeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete