సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 762వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. స్నేహితుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
  2. ఊదీతో నయం చేసిన బాబా

స్నేహితుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా


శ్రీసాయి పాదపద్మములకు శతకోటి వందనాలు. నా పేరు అర్చన. ఒకసారి నా స్నేహితునికి పెద్ద యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళారు. తను త్వరగా కోలుకోవాలని మేమంతా బాబాను ఎంతో ఆర్తిగా ప్రార్థించాము. బాబా మా ప్రార్థన విన్నారు. బాబా ఆశీస్సులతో నా స్నేహితుడు 2020, డిసెంబరులో కోమా నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు నేను, "నా స్నేహితుడు క్షేమంగా ఇంటికి రావాల"ని బాబాను వేడుకున్నాను. అయితే తను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చివరికి 2021, మార్చి 30న తను క్షేమంగా ఇంటికి వచ్చాడని తెలిసి మా ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందానికి కారణం శ్రీ సాయినాథుడే! "ధన్యవాదాలు బాబా. నాకు మరి కొన్ని సమస్యలున్నాయి. మీ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. దయతో మాకు రావలసిన డబ్బులు త్వరగా మాకు వచ్చేలా చేయండి. అనుకున్న ధరకు స్థలం అమ్ముడయ్యేలా అనుగ్రహించండి బాబా. మీ అనుగ్రహం సదా మా అందరిపై ఉండాలి బాబా".


ఊదీతో నయం చేసిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శిరీష. 2021 ప్రథమార్థంలో నా శరీరంపైన చిన్న పొక్కులాంటిది వచ్చింది. కొన్నిచోట్ల అలాంటివి వచ్చినపుడు భయపడాల్సిన పరిస్థితి. పైగా మా అమ్మ విషయంలోనూ, తన అక్కచెల్లెళ్ళ విషయంలోనూ ఇదే సమస్యను చూసివున్న అనుభవం దృష్ట్యా నాకు చాలా భయం వేసింది. దాంతో నేను బాబాను ప్రార్థించి, "నాలుగైదు రోజుల్లో సమస్య పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. తరువాత ప్రతిరోజూ ఆ పొక్కుపై బాబా ఊదీ రాయటం మొదలుపెట్టాను. బాబా అనుగ్రహం వలన ఆ పొక్కు పెద్దది కాకుండా పూర్తిగా తగ్గిపోయింది. ఇది చిన్న అనుభవమే గానీ, ఆ సమస్య నన్ను చాలా భయపెట్టింది. బాబానే ఊదీతో నయం చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా!"


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo