- బాబా మా కుటుంబంపై చూపిన దయ
- ఎటువంటి కష్టమైనా బాబాకి చెప్పుకుంటే తీరుతుంది
బాబా మా కుటుంబంపై చూపిన దయ
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ, మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారములు. మా కుటుంబంలోని వారందరం సాయిభక్తులము. వీలైనప్పుడల్లా శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుంటాము. నాకు జరిగిన అనుభవాలను ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ ద్వారా నేను మొట్టమొదటిసారి బాబాతో పంచుకోబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాయికి నా ధన్యవాదాలు.
మొదటి అనుభవం:
మేము 30 సంవత్సరాల క్రితం ఒక స్థలాన్ని కొన్నాము. అయితే, రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, ఎవరూ మాకు సహాయం చేయలేదు. అటువంటి సమయంలో గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి మా వద్దకొచ్చి, ‘ ‘గురుచరిత్ర’ పారాయణ చేస్తే సమస్య పరిష్కారమవుతుంద'ని చెప్పారు. అప్పటినుంచి మేము 'గురుచరిత్ర', 'బాబా చరిత్ర' పారాయణ చేస్తున్నాము. బాబా దయవల్ల సమస్య తొలగి రిజిస్ట్రేషన్ పని పూర్తయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఆ స్థలం బాగా అభివృద్ధి చెందాలని, దాన్ని అమ్మి ఇల్లు కొనుక్కోవాలని మా కోరిక. మా కోరిక నెరవేరేలా అనుగ్రహించండి బాబా".
రెండవ అనుభవం:
2021, ఏప్రిల్ 12న మా మనవడు కోట శ్రీసాయి అనీష్ మొదటి పుట్టినరోజనగా ఆ ముందురోజు తనకు జ్వరం వచ్చింది. ప్రస్తుత కరోనా దృష్ట్యా మాకు చాలా భయం వేసి, మా బాధను లెటర్ రూపంలో బాబాకు విన్నవించుకున్నాము. ఆ రాత్రి బాబా వద్ద నుండి మాకు సమాధానం లభించింది. బాబా ఆశీస్సులతో మా మనవడి జ్వరం తగ్గిపోయింది. ఈ విధంగా మొదటి పుట్టినరోజున బాబా ఆశీస్సులు మా మనవడికి లభించాయని మేమంతా చాలా సంతోషించాము.
మూడవ అనుభవం:
మా కూతురు, అల్లుడు ఢిల్లీలో నివాసముంటున్నారు. ఈమధ్య మా అల్లుడు శ్రీనివాసుకి కరోనా వచ్చింది. తొమ్మిదవ రోజున పరిస్థితి విషమించి తను హాస్పిటల్లో చేరాడు. మేమంతా చాలా ఆందోళన చెంది, సహాయం కోసం బాబాను ప్రార్థించాము. వెంటనే, "బాబా ఉన్నారు. అతని వెంటే ఉంటారు. భయపడవద్దు" అని ఒక సాయిబంధువు ద్వారా బాబా సమాధానం ఇచ్చారు. బాబా ఆశీర్వాదం వలన కేవలం మూడు గంటల్లో మా అల్లుడు ఇంటికి వచ్చారు. మొత్తం 12 రోజులు బాబానే దగ్గరుండి మా అల్లుడిని చూసుకున్నారు. ఆయన దయవలన మా అల్లుడికి కరోనా పూర్తిగా తగ్గి ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. అయితే, మా అల్లుడికి కరోనా రావడంతో వారి కుటుంబంలోని అందరికీ కరోనా టెస్ట్ చేశారు. అందులో మా అల్లుడు వాళ్ళ అమ్మగారికి నెగిటివ్ వచ్చింది. కానీ మా అమ్మాయికి, వాళ్ళ పిల్లలకి కొంచెం కరోనా లక్షణాలు కనిపించడంతో వాళ్ళంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. "వాళ్ళకి తొందరగా నయం కావాల"ని నేను బాబాను వేడుకుని ‘నవగురువార వ్రతం’ మొదలుపెట్టాను. బాబా దయవలన అందరూ త్వరగా కోలుకున్నారు. "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకున్నాను తండ్రీ!"
ఎటువంటి కష్టమైనా బాబాకి చెప్పుకుంటే తీరుతుంది
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో బాబా నాకు ఎలా సాయం చేశారో ఈరోజు మీకు తెలియజేస్తాను.
ఒకసారి మా ఇంట్లో ఒక స్థలానికి సంబంధించిన కాగితాలు కనిపించకుండా పోయాయి. మా నాన్న వాటికోసం చాలాసార్లు వెతికినా అవి కనిపించలేదు. ఒకరోజు నాన్న నాకు ఫోన్ చేసి, ‘ఆ స్థలం కాగితాలు కనిపించట్లేద’ని చెప్పారు. తర్వాత నేను నాన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి ఆ కాగితాల కోసం చాలాసేపు వెతికాము. కానీ అవి కనిపించలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! స్థలం కాగితాలు కనిపిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాతో చెప్పుకున్నాను. బాబాను ప్రార్థించిన కాసేపటి తర్వాత, ‘ఒకవేళ ఆ కాగితాలు బీరువా వెనకాల పడివుంటాయేమో’నని అనిపించి మా నాన్న ఆ చిన్న బీరువాను కాస్త ప్రక్కకు జరపగానే దాని వెనకాల స్థలం కాగితాలు కనిపించాయి. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”
ఇంకొకసారి, మా అమ్మ తన ఫోనుని కిటికీలో పెట్టి మర్చిపోయింది. తరువాత ఫోను కోసం ఇల్లంతా వెతికినా కనపడలేదు. అప్పుడు నేను బాబాను స్మరించుకుని, “బాబా! అమ్మ ఫోను కనిపించేలా చేయి. నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. కాసేపటి తర్వాత కిటికీలో చూస్తే ఫోన్ అక్కడే ఉంది. అలాగే ఇంకొకసారి కూడా మా ఇంట్లో ఫోన్ కనపడకపోతే బాబాకు చెప్పుకోగానే ఫోన్ దొరికింది. “చాలా ధన్యవాదాలు బాబా!”
మరోసారి, నా బిజినెస్‌లో కొంచెం డబ్బులు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఎలాగైనా డబ్బు నష్టం రాకుండా చూడండి” అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఏ నష్టమూ రాలేదు. రెండు రోజుల తర్వాత సమస్య పరిష్కారం అయిపోయింది. “శతకోటి వందనాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే చల్లగా చూడు తండ్రీ. ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ కాపాడు బాబా”.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఓం సాయిరాం;
ReplyDeleteJai sairam
ReplyDeleteJai sairam
ReplyDelete🙏🙏
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete